EPAPER
Kirrak Couples Episode 1

Botsa Jhansi | లోక్ సభ ఎన్నికల్లో బొత్స సతీమణి పోటీ.. విశాఖ నుంచి బరిలోకి దింపాలని జగన్ ప్లాన్

Botsa Jhansi | సాగరనగరిలో సీటు కోసం వైసీపీ అధిష్టానం యత్నాలు ముమ్మరం చేసింది. విశాఖ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పటం సహా ఏకంగా.. రాష్ట్రానికి ఆ ప్రాంతాన్ని రాజధానిని చేస్తామన్న జగన్‌… అక్కడ పాగా వేసేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు.

Botsa Jhansi | లోక్ సభ ఎన్నికల్లో బొత్స సతీమణి పోటీ.. విశాఖ నుంచి బరిలోకి దింపాలని జగన్ ప్లాన్

Botsa Jhansi | సాగరనగరిలో సీటు కోసం వైసీపీ అధిష్టానం యత్నాలు ముమ్మరం చేసింది. విశాఖ నగరమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పటం సహా ఏకంగా.. రాష్ట్రానికి ఆ ప్రాంతాన్ని రాజధానిని చేస్తామన్న జగన్‌… అక్కడ పాగా వేసేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా బొత్స కుటుంబానికే ఆ అవకాశం ఇస్తే… అటు సామాజికవర్గాలకు న్యాయం చేస్తున్నామని భావనతో పాటు ఆ కుటుంబానికి ఉన్న పేరుతో విజయం దక్కించుకునేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది.


విశాఖపట్నం నుంచి పోటీ చేయటం అంటే అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎంపీ అయినా.. ఆ పేరు ప్రత్యేకంగా నిలుస్తుందనటంతో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. విశాఖలో విజయం సాధించాలని ప్రతి పార్టీ కోరుకుంటోంది. ఈసారి 175 నినాదంలో ముందుకెళ్తున్న వైసీపీ.. ఎంపీ స్థానంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలనూ గెలుచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ ఆ అవకాశం వైసీపీ అందకుండా చేయాలని మరోవైపు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.

175 నినాదం ఎత్తుకున్న జగన్‌.. ఎంపీ సీట్లు కూడా క్లీన్‌స్వీప్ చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. నేతలతో పాటు ఎమ్మెల్యే స్థానాలనూ ఊహించని విధంగా మార్పుచేర్పులు చేస్తూ.. నూతన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎమ్మెల్యేల అంశంలో చాలా మార్పులు చేయగా.. ఇప్పటికే నేతల నుంచి తిరుగుబాటు రావటం కూడా జరిగింది. అందుకే పక్కా ప్రణాళికలతో అభ్యర్థులను నిలబెట్టి..గెలుపే లక్ష్యంగా జగన్‌ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ స్థానంపై ఆయన గురి పెట్టారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న M.V.V. సత్యనారాయణ.. విశాఖ ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేస్తుండటంతో కొత్త అభ్యర్థికోసం అధికార పార్టీ విస్తృత కసరత్తు చేసింది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు వినిపిస్తోంది.


విశాఖ ఎంపీ స్థానంలో ఇప్పటివరకూ స్థానికేతరులే నిలబడి.. తమ అదృష్టం పరీక్షించుకున్నారు. విశాఖ మెట్రో నగరం కావటం సహా విద్యాధికులు ఎక్కువ ఉండటం వల్ల.. బయట ప్రాంతం నుంచి వచ్చినా.. వారిని ఆదరించారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఏరోజు.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గత ఎన్నికల్లో 25 సీట్లకు 25 తనకు ఇప్పిస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్‌ నాడు హామీ కూడా ఇచ్చారు. జనం కూడా దానిని నమ్మి ఆయనకు మెజారిటీ సీట్లు ఇచ్చారు. గత ఎన్నికల్లో పరిస్థితి వేరు.. ఇప్పుడున్న పరిస్థితి వేరు. నాడు ఫ్యాన్ హవా వల్ల అభ్యర్థుల ముఖాలు తెలియకపోయినా జగన్‌ ఫోటోతో వార్‌ వన్‌సైడ్ అయ్యింది. ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేనందున.. ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సి వస్తోంది. అందుకే విశాఖ ఎంపీ స్థానం.. కీలకంగా మారింది.

జగన్‌ సీఎం అయ్యాక.. విశాఖ అంటే తనకు ఇష్టమని.. అక్కడి నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. దానికి తోడు రిషికొండ సమీపంలో పాలనాపరమైన కొన్ని భవనాలూ కట్టారు. అంటే వైసీపీకి విశాఖపట్నం ఒక సెంటిమెంట్‌గా భావించవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే గెలుపుగుర్రాలకే అవకాశాలంటూ ఎంపిక కసరత్తు చేయగా.. బొత్స ఝాన్సీ పేరు వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ఈ కుటుంబానికి బాగా పేరు ఉండటం సహా రాజధాని తరలింపు అంశంలో ఎక్కువగా బొత్స సత్యనారాయణ కలుగు చేసుకోవటంతో… ప్రజల అండగా ఉంటారనే భావనలో వైసీపీ అధిష్టానం ఉంది.

సుదీర్ఘ చర్చల అనంతరం బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలుగా ప్రస్తుతం రాజకీయలు జరగుతున్న నేపథ్యంలో విశాఖలో బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించుకోవటం..అందులోనూ ఉత్తరాంధ్రలో పేరుగాంచిన బొత్స కుటుంబానికి ఇవ్వాలనుకోవటం.. పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతోందని రాజకీయ పండితులు అంటున్నారు. ఉన్నత విద్యావంతురాలు, ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన వెనకబడిన సామాజిక వర్గం తూర్పు కాపు కావటం కూడా గెలుపు అవకాశాలకు మరింత దగ్గర చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక.. బొత్స ఝాన్సీ విషయానికి వస్తే.. ఆమె కూడా రాజకీయ నేపథ్యం ఉన్న మహిళే. అటు తన భర్త రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ పేరు తెచ్చుకోగా.. ఆయనకు అండగా ఝాన్సీ నిలబడుతూ వచ్చారు. గతంలో జడ్పీ చైర్మన్ గా, రెండు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఝాన్సీకి ఉండటం.. ఆ పార్టీ ప్లస్‌గా భావిస్తోంది. ఝాన్సీ పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందని ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్లు సమాచారం. ఝాన్సీ అభ్యర్థిత్వంతో.. మిగతా పార్టీలూ బీసీ నేతలకు ఇవ్వాల్సి వస్తుందనే రాజకీయ ఎత్తుగడ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు విశాఖ లోక్ సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విధానానికి ఈసారి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్న జగన్‌.. ఝాన్సీకే ఛాన్స్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

2004 లో నేదురుమల్లి, 2009లో పురంధరేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవివీ సత్యనారాయణ.. విశాఖ ఎంపీ బరిలో నిలిచారు. వీరంతా.. ఇతర ప్రాంతాలకు చెందిన ఓసీ నేతలే. బొత్స ఝాన్సీని విశాఖకు తీసుకురావడం వల్ల బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సందేశం రాష్ట్రవ్యాప్తంగా వెళ్తుందనే భావనలో వైసీపీ ఉంది. విశాఖకు బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థి అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మీద ఉన్న పరిచయాలతో అందరు సహకరించే అవకాశం ఉంటుందనే ఆలోచనలో అధిష్టానం అటు వైపు ఆలోచన చేస్తోందని సమాచారం. బొత్స మాటకు ఉత్తరాంధ్ర వైసీపీలో అడ్డు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి విశాఖలో గెలుపు ఈజీ అవుతుందనే భావన వైసీపీ అధిష్టానం ఉంది. సామాజిక సమీకరణాల్లో వైసీపీ ఒక బీసీకి సీటు ఇస్తే… టీడీపీకి బలమైన బీసీ అభ్యర్థి లేకపోవడం కూడా కలిసి వస్తుందనే ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకూ అందరూ నాన్ లోకల్ వాళ్లు కావడంతో విజయనగరం లోకల్ గా పరిగణించే అవకాశాలు లేకపోలేదు. పైగా ఎలాంటి వ్యతిరేకతా ఉండదనే భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆర్థికంగానూ బలమైన వారిగా బొత్స కుటుంబం ఉండటం కూడా ఆమె విజయానికి దోహదం చేస్తుందని వైసీపీ ఆలోచిస్తోందని వాదన ఉంది.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×