EPAPER
Kirrak Couples Episode 1

VV Vinayak in YCP | ఏపీ పాలిటిక్స్‌లో సినీ దర్శకుడు వి.వి.వినాయక్!.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ?

VV Vinayak in YCP | ఏపీ పాలిటిక్స్‌లో సినీ దర్శకుడు వి.వి.వినాయక్!.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ?

VV Vinayak in YCP | క్లాప్‌..కెమెరా..యాక్షన్.. ఇవే అతని జీవితం. ఆది సినిమాతో దర్శకుడిగా మారి.. అనతికాలంలోనే మెగా డైరక్టర్‌గా ఎదిరాయన. మెగాఫోన్ పట్టుకుని.. ఫైటింగ్ సీన్స్‌, ఛేజింగ్స్‌తో అదరగొట్టే ఆ దర్శకుడు…రాజకీయాల్లోకి రానున్నారా. హీరోల బాడీ లాంగ్వేజ్‌ల బట్టి అదిరిపోయే డైలాగ్స్‌ రాసి.. థియేటర్లలో ఈలలు కొట్టించే వ్యక్తి… రాజకీయాలను శాసించగలడా… తొలి సినిమాతో తొడగొట్టు చిన్నా అనిపించిన ఆ వ్యక్తి.. రాజకీయాల్లోనూ తొడగొడతారా?


ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీ, టీడీపీ మధ్య పాలిటిక్స్ హాట్‌టాఫిక్‌గా మారాయి. రెండు పార్టీల అధినేతలూ.. తమ పార్టీలు బలాన్ని పుంజుకునేందుకు చేరికలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురు సీనియర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరగా.. వీరందరికీ చెక్ పెట్టేందుకు అధికార పార్టీ సినీ గ్లామర్‌ ఫోకస్‌ పెట్టింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీవీ వినాయన్‌ను పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు దీటుగా సినీ గ్లామర్‌ జోడించడం సహా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన్ను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందని సమాచారం. కాకినాడ లేదా… ఏలూరు నుంచి ఎంపీగా వినాయక్‌ను పోటీలో నిలపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు ఉభయగోదావరి జిల్లాల్లో వచ్చే ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీనే అధికారంలో వస్తుంది. ఈ జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ ఇప్పటికే వ్యూహరచన చేసింది. కాపు ఉద్యమనేత ముద్రగడ పధ్మనాభంను పార్టీ చేర్చుకుంటురని ప్రచారం ఉంది. ముద్రగడతో పాటు వంగవీటి రాధా కూడా వైసీపీలో జాయిన్ అవుతారానే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో..కాపు సామాజిక వర్గానికి చెందిన మూవీ డైరెక్టర్‌ వినాయక్‌ను పార్టీలో ఆహ్వానించినట్లు సమాచారం. వినాయక్‌ కూడా వైసీపీలో జాయిన్‌ అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని జోరుగా చర్చ జరుగుతుంది.


వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం లేదా కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో పవన్ పైన నిలబెట్టేందుకు వైసీపీ తమ అభ్యర్దిని సిద్ధం చేస్తోంది. నేడో రేపో వినాయక్ అధికారికంగా వైసీపీలో చేరనున్నారు. కాకినాడ లేదా ఏలూరు ఎంపీ బరిలో వీవీ వినాయక్ ను దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న కసరత్తుల్లో భాగంగా వినాయక్ పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. సంక్రాంతిలోపే ఇంఛార్జిగా ప్రకటించి ప్రజల్లోకి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపన సమయంలోనే వినాయక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సాగింది. 2014 ఎన్నికల్లోనే నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తన మీద వచ్చే ప్రచారాన్ని వినాయక్ ఖండించలేదు అలా అని ఏ రాజకీయపార్టీకి ఇప్పటివరకు తన మద్దతు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంతవరకూ ఆయన అధికారికంగా స్పందించలేదు. కానీ, ఈ సారి పొలిటికల్ ఎంట్రీ పక్కా అన్న టాక్ మాత్రం రోజు రోజుకూ బలంగా వినిపిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వినాయక్ స్వయంకృషితో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని సినిమా ఫీల్డ్ లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత వినాయక్ సొంతూరు చాగల్లు..తూర్పుగోదావరి జిల్లాకు మారింది. వినాయక్ నాన్న గండ్రోతు కృష్ణారావు…ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉండటంతో పాటు చాగల్లులో సొంతంగా సినిమా థియేటర్ నడిపించారు.

అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చాగల్లు సర్పంచ్‌గా ఒకసారి ఓడిపోయిన తదుపరి ఎన్నికల్లో తండ్రి చిరకాల కోరిక తీర్చేందుకు వినాయక్ దగ్గర ఉండి మరీ సర్పంచ్‌గా ఆయన్ను గెలిపించారు. వినాయక్ తన సొంతూరు చాగల్లులో పలు సేవా కార్యక్రమాలు చేయటంతో పాటుగా గ్రామానికి చెందిన యువతకు తనకు చేతనైనంత మేరకు ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేశారు. గోదావరి జిల్లాలలో వినాయక్ కుటుంబీకులకు రాజకీయంగా సామాజికంగా మంచి పలుకుబడి ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.

అయితే.. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన వినాయక్.. పవన్‌కల్యాణ్‌కు వ్యతిరేకంగా వైసీపీకి ప్రచారం చేస్తారా అనే అనుమానాలూ ఉన్నాయి. రాజకీయాల్లో ఎవరికి శాశ్వత మిత్రులుండరు.. అలాగని శత్రువులు కూడా ఉండరనే ప్రకారం ఏదైనా జరగవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. చూడాలి.. సినిమాల్లో తనదైన శైలిలో డైలాగ్‌లతో సూపర్‌హిట్లు కొట్టిన వినాయక్‌.. రాజకీయాల్లోకి వస్తారా…. అక్కడా కూడా తనదైన మార్కు చూపిస్తారా అనేది.. మరికొన్ని రోజుల్లో తేలనుంది.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×