EPAPER
Kirrak Couples Episode 1

Anantapur YCP Chaos | వైసీపీలో తెగని టికెట్ల పంచాయితీ.. గందరగోళంగా అనంతపురం పరిస్థితి!

Anantapur YCP Chaos | వైసీపీ టికెట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు. కన్ఫర్మ్ అయిన స్థానాల్లోనూ మార్పులు చేర్పుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి అనంతజిల్లాల్లో రెండో జాబితాలో కన్ఫర్మ్ అయినా కూడ మరోసారి మార్పులంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా.. తాడేపల్లి నుంచి వచ్చిన పిలుపుతో ఉమ్మడి అనంత నేతలకు కలవరం మొదలైంది.

Anantapur YCP Chaos | వైసీపీలో తెగని టికెట్ల పంచాయితీ.. గందరగోళంగా అనంతపురం పరిస్థితి!

Anantapur YCP Chaos | వైసీపీ టికెట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు. కన్ఫర్మ్ అయిన స్థానాల్లోనూ మార్పులు చేర్పుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి అనంతజిల్లాల్లో రెండో జాబితాలో కన్ఫర్మ్ అయినా కూడ మరోసారి మార్పులంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా.. తాడేపల్లి నుంచి వచ్చిన పిలుపుతో ఉమ్మడి అనంత నేతలకు కలవరం మొదలైంది.


వై నాట్ 175 వినాదంలో భాగంగా వైసీపీలో టికెట్లు మార్పు మొదలైంది. మొదటి లిస్టులో వైసీపీలో మార్పులు చేర్పులు రావడంతో రెండో జాబితాపై ఆసక్తి పెరిగింది. అనంతపురం జిల్లా వైసీపీ నేతలలో టెన్షన్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే ఉమ్మడి అనంత వైసీపీలో సీట్ల మార్పు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక్కడ 8 నుంచి 10 సీట్లలో అభ్యర్థులను మారుస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే.. జిల్లాలో ఐదుగురు స్థానాలు మార్చి.. అందరికీ షాక్ ఇచ్చింది అధిష్టానం.

ఉమ్మడి అనంతపురంలో ఉన్న రెండూ ఎంపీ స్థానాలనూ.. మూడు అసెంబ్లీ స్థానాలను అధిష్టానం మార్చేసింది. సిట్టింగుల్లో ఇద్దరికీ మొండిచెయ్యి చూపించింది. మరో ఇద్దరికి స్థానచలనం చేసింది. మార్చిన స్థానాలతో పాటు మరో నాలుగు స్థానాలలో మార్పు చేర్పులు ఉండొచ్చంటూ సంకేతాలు పంపింది. ముఖ్యంగా సింగనమల, మడకశిర, రాయదుర్గం స్థానాలు మార్పు కన్ఫర్మ్ అయినట్లు జిల్లాల జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి తోడు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మిగిలిన సింగనమల, మడకశిరలోనూ మార్పు తథ్యం అనే టాక్ నడుస్తోంది. ఇవన్నీ కూడా ఐపాక్ సర్వే ప్రామాణికంగానూ… మరోవైపు సామాజిక అంశాల కొలమానంగానూ ఛేంజస్ చేస్తున్నట్లు సమాచారం.


ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. మరోసారి జాబితాలోనూ స్థానాలు మారుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఎంపీ స్థానాలు రెండింటిని మార్చేసి… హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో.. కొత్త అభ్యర్థి శాంతాకు కేటాయించారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యని కల్యాణదుర్గం అసెంబ్లీకి మార్చి.. ఆస్థానంలో పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు కేటాయించారు. ఇక్కడే చిక్కులు వచ్చిపడ్డాయి. ప్రకటించిన రెండు ఎంపీ స్థానాల అభ్యర్థులనూ మార్చాలని ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలు.. అధిష్టానాన్ని కోరుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం ఎంపీ స్థానాన్ని 2019 ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి, హిందూపురం ఎంపీ స్థానాన్ని కురుబా సామాజిక వర్గానికి కేటాయించి.. అదిరిపోయే రిజల్ట్ సాధించింది వైసీపీ. ఇప్పుడు మాత్రం ప్రయోగాత్మకంగా అనంతపురం ఎంపీ స్థానాన్ని కురుబలకు, హిందూపురం ఎంపీ స్థానాన్ని వాల్మీకులకు కేటాయించింది.

సరిగ్గా ఇక్కడే ఉమ్మడి అనంత వైసీపీలో కొత్త తలనొప్పి వచ్చిపడింది. జిల్లా వైసీపీ నేతలంతా కలిసి.. అనంత ఎంపీ టికెట్‌ను వాల్మీకిలకు కేటాయించాలని.. అంటే శాంతాకు ఇవ్వాలని, హిందూపురం స్థానాన్ని శంకర్ నారాయణ ఇవ్వాలని కోరుతున్నారని టాక్. ఎందుకంటే హిందూపురం ఎంపీస్థానంలో నిర్ణయాత్మక శక్తిగా కురబ ఓట్లు ఉన్నాయి. అవన్నీ గంపగుత్తగా వైసీపీకి పడాలంటే ఎంపీ అభ్యర్థి కూడా ఆ వర్గాలకు చెందినవారే ఉండాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదే విధంగా అనంతపురం ఎంపీ స్థానంలో వాల్మీకులు అధికంగా ఉంటారు. వారి ఓట్లు పడాలంటే ఎంపీ అభ్యర్థి ఆ వర్గానికి చెందిన నేత అయితే బాగుంటుదనే వాదనలూ ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే.. ఉమ్మడి జిల్లా నేతలంతా హైకమాండ్‌ను ఒప్పించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మాట్లాడేందుకు.. పార్టీ అధిష్టానం.. ఉమ్మడి అనంత వైసీపీ నేతలను పిలిచింది.

మార్పులు చేర్పులు అంశం అటు వైసీపీ పార్టీతో పాటు నేతలకూ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా తయారైందని కార్యకర్తలు వాపోతున్నారు. సర్వేలు, సామాజికవర్గ అంశాలు… ఆయా నేతలు కార్యకర్తలుకు తలబొప్పి కట్టిస్తున్నాయట.

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×