EPAPER

Software Surender Kidnap: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Software Surender Kidnap: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Software Surender Kidnap: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ అంశం సంచలనంగా మారింది. ఈ కిడ్నాప్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం సాయంత్రం ఖాజాగూడ చెరువు వద్ద తన చెల్లితో మాట్లాడుతుండగా సురేందర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే.. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కిడ్నాప్ లో బాధితుడి చెల్లెలు పాత్ర ఉందని తేల్చారు.


సురేందర్ ను స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్‌ చేసిన తర్వాత సురేందర్‌ ముఖానికి మాస్క్ వేసి నంద్యాలకు తీసుకెళ్లారు. అయితే నంద్యాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర.. పోలీసులు తనిఖీలు చేసినపుడు సురేందర్ మాస్క్ తొలగించారు. ముఖంపై గాయం ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించారు. కిడ్నాపర్లు పొంతన లేని సమాధానాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీంతో.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయడంతో కిడ్నాప్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. నంద్యాల చెక్ పోస్టు వద్దే ఇద్దరు నిందితులు పట్టుపడ్డారు.

విషయం తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు నంద్యాలకు వెళ్లి వారిని తీసుకొచ్చారు. ఈ దారుణానికి పాల్పడింది సురేష్ అండ్ గ్యాంగ్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నలుగురు కిడ్నాపర్లు ఉన్నారు. కిడ్నాప్‌కు సూత్రధారిగా ఉన్న సురేష్‌ అనేక కిడ్నాప్‌ కేసులలో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అటు.. ఈ తతంగం అంతా నడిపించింది కిడ్నాప్‌కు గురైన సురేందర్ చెల్లెలు అని పోలీసులు తేల్చారు.


.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×