EPAPER
Kirrak Couples Episode 1

CM Revanth Reddy : ప్రజల వద్దకే ప్రభుత్వం.. సీఎం రేవంత్ పాలనపై ప్రశంసలు..

CM Revanth Reddy : ప్రభుత్వం దగ్గరికి ప్రజలు కాదు.. ప్రజల దగ్గరికే ప్రభుత్వం.. ఇదే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తొలి రోజు నుంచి పని చేస్తోంది. ఇది చాలా మందిని ఆకట్టుకుంది. గత పదేళ్లుగా ఎంత తిరిగినా గోడు పట్టించుకునే వారు లేక ఇబ్బంది జనానికి ప్రజా దర్బార్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అందులోనూ ఎక్కడైతే ప్రజలకు ప్రవేశం లేకుండా పోయిందో అక్కడే ప్రజాదర్బార్ పెట్టించారు. అంతే కాదు.. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి చాలా మంచి సంప్రదాయాలను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అందరికీ గుర్తు చేశారు.

CM Revanth Reddy : ప్రజల వద్దకే ప్రభుత్వం.. సీఎం రేవంత్ పాలనపై ప్రశంసలు..

CM Revanth Reddy : ప్రభుత్వం దగ్గరికి ప్రజలు కాదు.. ప్రజల దగ్గరికే ప్రభుత్వం.. ఇదే నినాదంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తొలి రోజు నుంచి పని చేస్తోంది. ఇది చాలా మందిని ఆకట్టుకుంది. గత పదేళ్లుగా ఎంత తిరిగినా గోడు పట్టించుకునే వారు లేక ఇబ్బంది జనానికి ప్రజా దర్బార్ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అందులోనూ ఎక్కడైతే ప్రజలకు ప్రవేశం లేకుండా పోయిందో అక్కడే ప్రజాదర్బార్ పెట్టించారు. అంతే కాదు.. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి చాలా మంచి సంప్రదాయాలను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అందరికీ గుర్తు చేశారు.


సింప్లిసిటీ ఈక్వల్ టు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి కాక ముందు ఎలా ఉన్నారో.. సీఎం అయిన తర్వాత కూడా అదే పలకరింపు. ఆర్భాటాలకు, భేషజాలకు దూరం. అందరితో కలిసిపోయే మనస్తత్వం. కలుపుగోలుతనం ఇదే రేవంత్ ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాయి. జస్ట్ పని చేసుకెళ్తారు.. ఫలితం గురించి ఆలోచించరు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి స్టైల్. ప్రజాభవన్ లో ప్రజా దర్బార్ మొదలైన రోజున జనంతో కలసిపోయి, వారిసమస్యలు వింటూ, వారిని ఓదారుస్తూ, వినతి పత్రాలు స్వీకరిస్తూ ధైర్యం చెప్పారు.

యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ ను పరామర్శించడానికి వెళ్తుంటే, అక్కడే ఉన్న ఓ సోదరి రేవంత్ అన్నా అని పిలవడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి, ఆమె వద్దకు వెళ్లారు. ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇది రేవంత్ సింప్లిసిటీకి ఓ ఉదాహరణ మాత్రమే. ఆ వీడియో వైరల్ గా మారింది. రేవంతన్న మనసు ఎలాంటిదో అందరికీ మరోసారి గుర్తు చేసింది. నిజానికి సీఎం స్థాయి వ్యక్తి అలా వెనక్కు వెళ్లడం.. ఎవరు పిలిచినా పలకడం చేయరు. కానీ రేవంత్ రూటే సపరేటు.


సీఎం అంటే ప్రోటోకాల్.. హడావుడి, సెక్యూరిటీ.. ఒక్కటేమిటి ఎన్నో ఉంటాయి. కానీ అదంతా తనకు కాదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను కాన్వాయ్ లో వెళ్తున్నప్పుడు తన కోసం జనాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఆదేశాలు కూడా ఇచ్చారు. జనంతో పాటే ట్రాఫిక్ లో ప్రయాణిస్తున్నారు. ఇది సాధారణంగా ఏ సీఎం కూడా చేయరు. కానీ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన రెండు, మూడు రోజుల్లోనే రేవంత్ తీసుకున్న నిర్ణయాలను చూస్తే ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో సరిగ్గా అంచనా వేసుకున్నట్లు అర్థమవుతుంది.

తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయిచుకున్న మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు. ఒక సీఎంగా రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయవేత్తలు కూడా రేవంత్ నిర్ణయాన్ని స్వాగతించారు. గోరేటి వెంకన్న సహా చాలా మంది ఇది మంచి సంప్రదాయం అంటూ కొనియాడారు. చాలా మంది అసెంబ్లీలో, మండలిలో ప్రజా ప్రతినిధులు రిలీఫ్ గా కనిపించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అయితే.. మాజీ సీఎం కేసీఆర్ ను 30 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, అదే కొత్త సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం తక్కువ సమయంలో చాలాసార్లు కలిశానన్నారు. ఇదొక్కటి చాలు.. ప్రజాప్రతినిధులకు ఎలాంటి ప్రతిస్పందన ఉందో తెలుసుకోవడానికి.

అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. అందుకే సీఎం రేవంత్ భేషజాలకు పోకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి, ప్రధాని మోడీని కలిసేందుకు సహకరించవలసిందిగా కోరారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు, విభజన హామీల అమలు కోసం ప్రధాని మోడీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి విజ్ఞప్తి చేశారు. అంతే కాదు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోనూ భేటీ అయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయి పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. ఇలా ఒక్కో కేంద్రమంత్రిని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు.. రావాల్సిన ప్రాజెక్టులపై విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. సీఎం అయిన నెలలోపే రెండుసార్లు ఢిల్లీలో పర్యటించడం చూస్తుంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారిలో పెట్టేందుకు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం అర్థం చేసుకోవచ్చు.

అదే పనిగా విమర్శలు చేస్తున్న విపక్షం బీఆర్ఎస్ కు చెక్ పెట్టే పనిలో ఉన్నారు సీఎం రేవంత్. గత పదేళ్లలో ఏం చేశారో ఫైర్ అవుతున్నారు. ఖజానాలో చిల్లి గవ్వలేదని, కేసీఆర్‌ అంతా తుడిచి తీసుకెళ్లారన్నారు. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం వివరించే ప్రయత్నం చేశారు.

ఇక కీలకమైన రియల్ ఎస్టేట్ రంగంపైనా ఫోకస్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మాసిటీని రద్దు చేసి, ఆ భూముల్లో మెగా టౌన్ షిప్పులు నిర్మిస్తామని అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సీఎం ప్రకటించారు. అయితే ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం వేలాది ఎకరాల భూ సేకరణ జరిపింది. కొన్ని ఫార్మా కంపెనీలు ఇప్పటికే పరిశ్రమలు ప్రారంభించాయి. పైగా ఫార్మాసిటీని నమ్ముకుని చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లాది రూపాయల వ్యాపారం సాగిస్తున్నాయి. ఫార్మాసిటీ రద్దయితే, రియల్ ఎస్టేట్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని గ్రహించిన సీఎం రేవంత్… అటు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఇటు కంపెనీలకు సమస్య రాకుండా మంచి ఫార్ములా రెడీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మా సిటీని విడతల వారీగా జీరో కాలుష్యంతో క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. దాంతో మళ్లీ రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది.

జీతాల చెల్లింపును గాడిన పెట్టే ప్రయత్నాన్ని తొలి నెలలోనే సక్సెస్ చేశారు సీఎం రేవంత్. గత ప్రభుత్వ హయాంలో అసలు ఎప్పుడు జీతాలు పడుతాయో తెలియని పరిస్థితి ఉండేది. సకాలంలో జీతాలు అందక ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడ్డారు. కొందరైతే ఈఎంఐలు కూడా టైంకు కట్టలేకపోయారు. గత ప్రభుత్వంలో ప్రతి నెల 20వ తేదీ దాకా జిల్లాల వారీగా జీతాలు పడుతూనే వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే జీతాల చెల్లింపును గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జనవరి నెల ఒకటిన ఇవ్వవలసిన జీతాల చెల్లింపును నాలుగో తేదీనాటికి ముగించేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకటో తేదీనే జీతాలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు కాస్త అటూ ఇటూగా మొదటి నెలలోనే ప్రభుత్వం తాను ఇచ్చిన హామీని నెరవేర్చగలిగింది. ఈ విషయంలో సీఎం రేవంత్ పర్టిక్యులర్ గా కనిపించారు.

పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డిపై అధిష్ఠానం చాలా నమ్మకంగా ఉంది. అందుకే ముఖ్యమంత్రి పదవితోపాటు పీసీసీ పగ్గాలను కూడా ఆయన చేతుల్లోనే ఉంచింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నవారే పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఇప్పటివరకూ తెలుగునాట ఒక్క సందర్భంలోనే అలా జరిగింది. మర్రి చెన్నారెడ్డి తొలిసారి సీఎం అయినప్పుడు కొంతకాలం ఆయన పిసిసి అధ్యక్షుడుగానూ వ్యవహరించారు. ఆ తర్వాత మళ్లీ ఆ ఘనత రేవంత్ రెడ్డికే దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన రేవంత్, లోక్ సభ ఎన్నికల్లోనూ విజయం చేకూరుస్తాడనే నమ్మకంతో పిసిసి అధ్యక్ష పదవినీ అధిష్ఠానం ఆయనకే అప్పగించింది.

అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సరైన డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ తనవాళ్లంటూ ఎవరూ ఉండరనీ, అలా ఆశలు పెట్టుకున్న వారికి పదవులు ఇవ్వబోననీ తెగేసి చెప్పారు. దీనిద్వారా పదవుల భర్తీలో అర్హతలకే పెద్దపీట వేస్తామని చెప్పకనే చెప్పారు.

Related News

Kutami Strategy: ఎన్నికల ప్రచారంలో పవన్ చేసిన ఛాలెంజ్ నిజమవుతోందా ? సీనియర్లు ఏమంటున్నారు ?

BRS BC Plan: బీసీ మంత్రాన్ని జపిస్తోన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ పోస్ట్ తో కేటీఆర్ కామెంట్స్ వైరల్

Young India Skill University: ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ తో స్కిల్ హబ్ గా తెలంగాణ..

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Big Stories

×