EPAPER

CM Revanth Reddy : గడీల నుంచి గ్రామాలకు .. రేవంత్ సర్కార్ నెల రోజుల పాలన సాగిందిలా..!

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సర్కార్ నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. మార్పు అంటే ఇదీ అని నిరూపించుకున్నారు. వస్తూనే ప్రజా పాలన అంటే ఏంటో చూపించారు. ప్రభుత్వానికి పబ్లిక్ మధ్య అంతరాలన్నీ తొలగించేశారు. మేమున్నామనే భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి మిస్ అయ్యారో.. వాటిని నెల రోజుల్లోనే అందించారు సీఎం రేవంత్ రెడ్డి. జనానికి, సర్కార్ కు మధ్య ఉన్న బారియర్స్ ను తొలగించి స్వేచ్ఛ కల్పించారు.

CM Revanth Reddy : గడీల నుంచి గ్రామాలకు .. రేవంత్ సర్కార్ నెల రోజుల పాలన సాగిందిలా..!

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సర్కార్ నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. మార్పు అంటే ఇదీ అని నిరూపించుకున్నారు. వస్తూనే ప్రజా పాలన అంటే ఏంటో చూపించారు. ప్రభుత్వానికి పబ్లిక్ మధ్య అంతరాలన్నీ తొలగించేశారు. మేమున్నామనే భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి మిస్ అయ్యారో.. వాటిని నెల రోజుల్లోనే అందించారు సీఎం రేవంత్ రెడ్డి. జనానికి, సర్కార్ కు మధ్య ఉన్న బారియర్స్ ను తొలగించి స్వేచ్ఛ కల్పించారు.


పాలనలో దూకుడు..చేయాల్సిన పనులపై క్లారిటీ.. ఎక్కడ తగ్గాలో తెలుసు..జనం మనసెరిగిన నేత.. ఇదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరీఖ. సింపుల్ గా, స్మూత్ గా, ఫాస్ట్ గా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో.. ప్రజలకు మరింత దగ్గర ఎలా అవ్వాలో తెలిసిన నేత. అందుకే నెల రోజుల పాలనలోనే తన మార్క్ ఏంటో చూపించుకోగలిగారు. పాలకులం కాదు.. సేవకులం అంటూ ప్రమాణస్వీకారం రోజే సరికొత్తగా ఆకట్టుకున్నారు. సీనియర్ మంత్రులను కలుపుకొని వెళ్తూ.. ఆరు గ్యారెంటీల అమలుపై దూకుడు పెంచుతూ పాలనలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో గత పదేళ్లుగా గత ప్రభుత్వం చేసిన తప్పులను రిపీట్ కాకుండా.. రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి పైసాను తిరిగి తీసుకొచ్చే దక్షతతో ఉన్నారు.

వస్తూనే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఖజానాను ఖాళీ చేసిన పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వివరించడంతో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రతిపక్షం బీఆర్ఎస్ మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేసింది. అయితే వీటిని తిప్పి కొడుతూ.. గ్యారెంటీ హామీలు వంద రోజుల్లో కచ్చితంగా అమలు అవుతాయన్న భరోసా ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కార్ సఫలమైంది.


ఓ వైపు పదవీ ప్రమాణస్వీకారం చేస్తూనే ఇంకోవైపు గడీల గోడలు బద్దలు కొట్టించారు సీఎం రేవంత్. ప్రజా పాలనకు, స్వేచ్ఛకు అదొక సూచికగా మార్చేశారు. అప్పటి వరకు పెద్ద గోడలు, ఫెన్సింగ్ లు, ఇనుప కంచెలతో దుర్బేధ్యంగా ఉన్న ప్రగతి భవన్ ను ప్రజలకు అంకితం చేశారు. జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చేశారు. ఇక అక్కడి నుంచి మొదలు రూట్ మారిపోయింది. స్పీడ్ పెరిగింది. తొలి సంతకం ఆరు గ్యారెంటీల అమలు.. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇచ్చారు. ఇదీ రేవంత్ ప్రమాణస్వీకారం రోజున చేసిన పని.

గడీల నుంచి గ్రామాల్లోకి పాలనను తీసుకెళ్లారు. ఇన్నాళ్లూ ఆఫీసుల చుట్టూ పనుల కోసం తిరిగి తిరిగి అలసిపోయిన జనానికి ఈ చర్యలు చాలా ఉపశమనం అందించాయి. మార్పు మంచికే జరిగింది అనుకునేలా ఈ చర్యలు కారణమయ్యాయి. వీటికి తోడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీ హామీలను పట్టాలెక్కించారు. నిజానికి ఇదో సాహసం. రెండు రోజుల్లోనే హామీల అమలు ఇది వరకు ఎవరూ చేసిన దాఖలాలు లేవు. అలాంటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలాగే ఆరోగ్య శ్రీ కవరేజ్ పది లక్షలకు పెంచే ఫైల్ పై సంతకం చేశారు.

మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో ఉన్నామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ రెండో రోజే క్లారిటీ ఇచ్చింది. కారణం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆలస్యం చేయకుండా డిసెంబర్ 9న సోనియా జన్మదినం సందర్భంగా అందుబాటులోకి తేవడమే. ఈ పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు చాలా కీలకంగా మారింది. ప్రతి మహిళ జీవితాంతం గుర్తుంచుకునే స్కీం ఇది. బస్సు ఎక్కితే రూపాయి ఖర్చు లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వెసులుబాటు ఇది. ప్రతి రోజూ 27 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రోజూ 10 కోట్ల రూపాయల విలువైన జీరో టిక్కెట్లను ఆర్టీసీ జారీ చేస్తోంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేస్తోంది.

గత పదేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం ఎలా జరిగిందో అసెంబ్లీ సాక్షిగా వివరించే ప్రయత్నం చేసింది రేవంత్ సర్కారు. ఎందుకంటే అన్ని శాఖలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి. నష్టాల్లో ఉండిపోయాయి. కరెంట్ బాగోతాలపై న్యాయవిచారణ చేస్తామన్నారు. అటు కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపైనా విచారణ జరుగుతోంది. అసెంబ్లీలో మాజీ మంత్రులను రేవంత్ రెడ్డి ఫిక్స్ చేశారు. చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ ఘాటుగానే చెప్పారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు. 6 లక్షల 71 వేల కోట్ల అప్పుల కుప్ప తెలంగాణపై ఉందన్న విషయాన్ని జనానికి చెప్పడంలో సఫలమయ్యారు. దీంతో ప్రజలు కూడా కొత్త ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు అవకాశం దొరికింది.

ఒక రాష్ట్రాన్ని ఎలా పాలించాలో అప్ కమింగ్ లీడర్లకు ఇదో కేస్ స్టడీగా కచ్చితంగా పని చేస్తుంది. ఇదో పొలిటికల్ పాఠమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అలా పగ్గాలు చేపట్టగానే.. యాక్షన్ ప్లాన్ లోకి దిగేశారు. ఎక్కడా ఆలస్యం చేయలేదు. సూటిగా ధాటిగా పని చేస్తూ వెళ్లారు. పదేళ్లలో తిష్టవేసిన సమస్యలపై ఫోకస్ పెట్టారు. నిద్రాణంగా ఉన్న వివిధ శాఖలను తట్టి లేపారు. దుమ్ము పట్టిన పెండింగ్ ఫైళ్లకు బూజు దులిపారు. అధికారులను అలర్ట్ చేశారు. శాఖల వారీగా రోజూ సమీక్షలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల రోజులు క్షణం తీరిక లేకుండా పని చేశారు. ఇప్పుడిప్పుడే పాలనా వ్యవస్థ అంతా గాడిలోకి వస్తోంది. ప్రజాభవన్ గేట్లు ఖుల్లా చేసినట్లుగానే.. సెక్రటేరియట్ ద్వారాలు కూడా అందరికీ తెరిచేశారు. ఇన్ని రోజుల నిర్బంధానికి చరమగీతం పాడారు. నిజానికి నెల రోజుల్లోనే అందరినీ సెట్ రైట్ చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×