EPAPER

Kesineni Nani : కేశినేనిపై మరోసారి పీవీపీ ఫైర్.. హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్..

Kesineni Nani : కేశినేనిపై మరోసారి పీవీపీ ఫైర్.. హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్..

Kesineni Nani : కేశినేని నానిపై మరోసారి పీవీపీ తీవ్ర విమర్శలు చేశారు. కేశినేనిని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న గొడవలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు టీడీపీ విజయవాడ ఎంపీ టిక్కట్ ను నానికి ఇవ్వడంలేదని స్పష్టంగా తేలిపోయింది. అటు సొంత పార్టీ నేతలను నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. అటు ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.


కేశినేని నానిపై పీవీపీ తీవ్ర విమర్శలు చేయడం బెజవాడలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. ఈ ఇద్దరి నేతల మధ్య 2014 నుంచి విభేదాలున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ను పీవీపీ ఆశించారు. ఆ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా ఉన్నారు. దీంతో పవన్ తో రాయబారం నడింపించారు పీవీపీ. పీవీపీకే విజయవాడ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని జనసేనాని కోరారు. కానీ టీడీపీ టిక్కెట్ ఆయనకు దక్కలేదు.

కేశినేని గట్టిగా పట్టుబట్టడంతో పీవీపీకి ఎంపీ టికెట్ ను చంద్రబాబు ఇవ్వలేదు. తన సీటును లాక్కున్నారని నాడు కేశినేనిపై పీవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీపీ ఇంటర్నేషనల్ క్రిమినల్ అని అప్పట్లో కేశినేని నాని తిరిగి కౌంటర్లు వేశారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన వ్యక్తి కేశినేని అని పీవీపీ ప్రతివిమర్శలు చేశారు. ఆ తర్వాత అడపాదడపా ఈ ఇద్దర నేతల మధ్య డైలాగ్ నడిచింది. అయితే కొన్నాళ్లుగా ఎలాంటి వివాదాలు మళ్లీ రేగలేదు.


తాజాగా బెజవాడ పాలిటిక్స్ లో కేశినేని నాని హాట్ టాపిక్ గా మారారు. సోదురుడి చిన్నితో వివాదంతో ముదిరి పాకాన పడింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచినా టిక్కెట్ దక్కని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలోనే మరోసారి కేశినేని నాని తాజా ఎపిసోడ్‌లోకి పీవీపీ ఎంట్రీ ఇవ్వడం బెజవాడ పాలిటిక్స్ లో మరింత హీట్ ను పెంచింది.

Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×