EPAPER
Kirrak Couples Episode 1

KCR Schemes: ప్రభుత్వ పథకాల నుంచి కేసీఆర్‌ ఔట్‌.. హెల్త్‌, వెల్ఫేర్‌ శాఖలకు CMO ఆదేశాలు

KCR Schemes: ప్రభుత్వ పథకాల నుంచి కేసీఆర్‌ ఔట్‌.. హెల్త్‌, వెల్ఫేర్‌ శాఖలకు CMO ఆదేశాలు

KCR Schemes: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై ఇక నుంచి కేసీఆర్ పేరు కనిపించకూడదని నిర్ణయం తీసుకున్నారు. స్కీమ్ లలో కేసీఆర్ పేరుతో పాటు, పథకాల పంపిణీలో కేసీఆర్ ఫోటోలను కూడా తొలగించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా హెల్త్, వెల్ఫేర్ శాఖలకు CMO ఆదేశాలు జారీ చేసింది. ఏయే స్కీమ్ లలో కేసీఆర్ వాడుతున్నారు..? ఏఏ పంపిణీ వస్తువులపై ఫోటోలు వినియోగిస్తున్నారు..? వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పథకాలకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని సంబంధిత డిపార్ట్‌మెంట్లకు ఉన్నతాధికారులు సూచించారు. వివిధ డిపార్ట్‌మెంట్ల నుంచి వచ్చిన నివేదికను ముఖ్యమంత్రికి వివరించిన తర్వాత అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది.


ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ విభాగంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ అమ్మవడి వాహనాలు, కేసీఆర్ కంటి వెలుగు పథకాలు అమలవుతున్నాయి. ఈ పతకాల నుంచి వెంటనే కేసీఆర్ పేరుతో తొలగించాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.వెల్ఫేర్ లోనూ కొన్ని పథకాలకు కేసీఆర్ బొమ్మలను ప్రచురించడమే కాకుండా సంబంధిత విభాగాల ఆన్ లైన్ పోర్టల్ లోనూ కేసీఆర్ పేరు, ఫోటోలు ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేసీఆర్ పేరు తొలగించిన తర్వాత కొత్త పేర్లను పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన పేర్లను ఆ స్కీమ్ లకు వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

.


.

Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×