EPAPER

Rohit Sharma : పిచ్‌లపై ప్రశ్నలు.. రోహిత్ శర్మకు కోపం వచ్చింది..

Rohit Sharma : పిచ్‌లపై ప్రశ్నలు.. రోహిత్ శర్మకు కోపం వచ్చింది..
Rohit Sharma

Rohit Sharma : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల సీరియస్ అవుతున్నాడు. ఇన్నేళ్లూ మౌనంగా ఉన్న కెప్టెన్ ఇప్పుడు ప్రతీ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే, ఏదో తేడా కొడుతోందే, అని అంతా అనుకుంటున్నారు.


తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఘోరంగా ఓడినప్పుడు కూడా ఇలాగే నోరు పారేసుకున్నాడు. విదేశీ పిచ్ లపై టీమ్ ఇండియా బ్యాటర్లకు ఆడటం తెలీదనే అంశంపై మాట్లాడుతూ ‘ఎలా ఆడాలో మాకు తెలుసు’ అని అంటూనే.. ఇప్పుడు విమర్శించే వాళ్లు గతాన్ని మరిచిపోకూడదని కూడా అన్నాడు.

కేప్ టౌన్ లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ ఐదురోజులు జరగాల్సింది…ఒకటిన్నర రోజులోనే అయిపోయింది.దీంతో పిచ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మని ఈ టెస్ట్ మ్యాచ్ పై మాట్లాడమని మీడియా ప్రతినిధులు అడిగారు. దాంతో తను చాలా సీరియస్ గా స్పందించాడు.


ఎప్పుడు కూడా భారత్ లో పిచ్ లపై ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మీడియా మాట్లాడుతుంటుంది. అలాగే ఇతర దేశాల ఆటగాళ్లు విమర్శిస్తుంటారు, మరి సౌతాఫ్రికా పిచ్ పై ఎందుకు స్పందించరని ప్రశ్నించాడు. ఎప్పుడూ భారత్ లో పిచ్ లన్నీ స్పిన్ పిచ్ లని, వారికి అనుగుణంగా చేసుకుంటారని అంటుంటారు. మరిప్పుడు విదేశీ పిచ్ లు పేస్ కు అనుకూలంగా ఉన్నాయి కదా.. మరి దీనికేమని అంటారని అన్నాడు.

సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటివన్నీ   విదేశీ పిచ్ లుగా మేం పరిగణిస్తాం. అలాగే ఇతర దేశాల నుంచి భారత్ కి వచ్చేవాళ్లకి, మా దేశంలో  పిచ్ లను కూడా విదేశీ పిచ్ లు గా ఎందుకు చూడరని ప్రశ్నించాడు. మా దగ్గరేదో కావాలని జరుగుతుందన్నట్టు మాట్లాడతారని మండిపడ్డాడు.

నా దృష్టిలో ఏ పిచ్ మీదైనా ఆడే సామర్థ్యం ఉన్నవాడే నిజమైన ఆటగాడని అన్నాడు.  అహ్మదాబాద్ లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ పిచ్ పై కూడా విమర్శలు వచ్చాయి. అందులో ఒక బ్యాటర్ సెంచరీ చేశాడు. అలాంటప్పుడు అది చెత్త పిచ్ ఎందుకవుతుంది? అని అన్నాడు.

భారతదేశ పిచ్ లను విమర్శించేటప్పుడు అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నాడు. వాళ్లు మా దేశంలో బాగా ఆడాలి. మేం వేరే దేశాల్లో బాగా ఆడాలి. ఇలా సుదీర్ఘ ప్రయాణాలు చేసి వచ్చేది, ఆటలో అనుభవం కోసమే తప్ప, పిచ్ ల మీద నిందలు వేయడానికి కాదని అన్నాడు.

ఏ వంకా లేనమ్మా.. డొంకట్టుకుని ఏడ్చిందన్నట్టు ఆడలేనివాడు, ఓడిపోయిన వాడు మాత్రమే పిచ్ ను పట్టుకుని విమర్శిస్తారని చాలా ఘాటుగా విమర్శించాడు. భారత్ పిచ్ లపై ఎవరూ నోరు విప్పకపోతే, నేనూ ఇక్కడ మాట్లాడేవాడిని కాదని రోహిత్ శర్మ అన్నాడు. మొత్తానికి అందరికీ కలిపి లాగిపెట్టి ఒకే ఒక్క సిక్సర్ కొట్టాడని అంతా అనుకుంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×