EPAPER

90’s Web Series Review: శివాజీ-వాసుకి #90’s.. లెక్కల మాస్టార్ లెక్కలు ఎలా ఉన్నాయ్ ?

90’s Web Series Review: శివాజీ-వాసుకి #90’s.. లెక్కల మాస్టార్ లెక్కలు ఎలా ఉన్నాయ్ ?

90’s Web Series Review: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టంట్, సీనియర్ నటుడు శివాజీ, తొలిప్రేమలో పవన్ కల్యాణ్ కు చెల్లెలుగా నటించిన వాసుకి కలిసి చేసిన వెబ్ సిరీస్ #90’s A Middle Class Biopic. ఈ వెబ్ సిరీస్ ను ఈటీవీ విన్ లో దీనిని రిలీజ్ చేశారు. ప్రేక్షకులను ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా ? స్టోరీ ఏంటి ? ఎవరెలా నటించారన్న వివరాలు తెలుసుకుందాం.


వెబ్ సిరీస్ : #90’s A Middle Class Biopic

నటీనటులు : శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు


సంగీతం : సురేష్ బొబ్బలి

ఎడిటింగ్ : శ్రీధర్ సోంపల్లి

సినిమాటోగ్రఫీ : అజాజ్ మహ్మద్

నిర్మాత : రాజశేఖర్ మేడారం

రచన, దర్శకుడు : ఆదిత్య హాసన్

కథ

చంద్రశేఖర్ (శివాజీ)ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్ గా పనిచేస్తుంటాడు. ఆయనకు భార్య రాణి (వాసుకీ ఆనంద్ సాయి), పిల్లలు రఘుతేజ (మౌళి తనూజ్ ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్ రాయ్) ఉన్నారు. సాటి మధ్యతరగతి వ్యక్తిలాగే ఉంటాడు చంద్రశేఖర్. ప్రతిదీ లెక్క పెట్టుకుని ఖర్చుచేసే మనస్తత్వం. పిల్లల చదువుల విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. పిల్లలు బాగానే చదివినా.. నూటికి నూరు మార్కులు రావాలంటాడు. ఆదిత్యకు చదువుపై ఇంట్రస్ట్ ఉండదు. 10వ తరగతి చదువుతున్న రఘు.. జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడని ఆశిస్తాడు.

తండ్రి ఆశలను రఘు నిజం చేశాడా ? అతని క్లాస్ మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? ర్యాంకుల కోసం ప్రైవేట్ స్కూళ్లు పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయి ? ఆ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు పడే మనో వేదన ఎలా ఉంటుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

ఎలా ఉంది ?

ఆడపిల్లలైనా, మగపిల్లలైనా.. వారి బాల్యం, కౌమార దశల్లో జరిగే సంఘటనలు మరచిపోలేని అనుభూతులుగా ఉంటాయి. స్మార్ట్ ఫోన్ రాకముందు.. ఒకరితో ఒకరు మాట్లాడాలంటే ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు, ల్యాండ్ ఫోన్లు తప్ప.. మరో మార్గం లేదు. ఇంటికి చుట్టాలొస్తే పిల్లలకు ఎంత పండుగలా ఉంటుందో.. ఖర్చు పెరుగుతుందని ఇంటి పెద్ద అంతే గాబరా పడుతుంటాడు. అలాంటి అనుభూతులను తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ ఆదిత్య హాసన్ సక్సెస్ అయ్యారు. 6 ఎపిసోడ్స్ తో రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను చూసే ప్రేక్షకులను.. ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్తుంది. 90’s కిడ్స్ అయితే దానికి త్వరగా కనెక్ట్ అవుతారు.

ఎవరెలా చేశారంటే..

లెక్కల మాస్టర్ గా శివాజీ.. చంద్రశేఖర్ క్యారెక్టర్లో జీవించాడు. బిగ్ బాస్ 7తో కొత్త జర్నీ స్టార్ట్ చేసిన అతను.. హౌస్ నుంచి బయటికొచ్చాక ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక వాసుకిని చూస్తే.. 90’sలో పిల్లలకు వారి తల్లే గుర్తొస్తుంటుంది. ఆదిత్యగా నటించిన రోహన్ డైలాగ్స్.. నవ్వులు పూయిస్తాయి.

ప్లస్ పాయింట్స్

నటీనటులు
కథ, దర్శకత్వం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

కొన్ని ఎపిసోడ్స్ లో స్లో గా సాగే స్టోరీ

చివరిగా.. #90’s వెబ్ సిరీస్.. 90’s కిడ్స్ కు జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది.

Tags

Related News

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Big Stories

×