EPAPER

Golden Gate Bridge : ఆత్మహత్యల బ్రిడ్జికి ‘రక్షణ వల’

Golden Gate Bridge : ఆత్మహత్యల బ్రిడ్జికి ‘రక్షణ వల’

Golden Gate Bridge : ఆ బ్రిడ్జి నిర్మించి 87 ఏళ్లు. దానిపై నుంచి దూకి ఇప్పటివరకు 2 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు. మృత్యువును తప్పించుకుని బయటపడింది మాత్రం 40 మందే. ఆత్మహత్యల నివారణ కోసం రెండు దశాబ్దాలుగా బాధిత కుటుంబాలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. దాని చుట్టూ ఓ రక్షణ వలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆ బ్రిడ్జి ఎక్కడుందనే కదూ మీ ప్రశ్న.


కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ప్రాన్సిస్కో నగరానికి వెళ్లిన వారు దానిని చూడకుండా ఉండరు. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన గోల్డెన్ గేట్ బ్రిడ్జి దాదాపు 25 అంతస్తుల ఎత్తు ఉంటుంది. శాన్‌ఫ్రాన్సిస్కో బేను, పసిఫిక్ సముద్రాన్ని కలిపే ఈ సస్పెన్షన్ బ్రిడ్జిని 1937‌లో ప్రారంభించారు. 2.7 కిలోమీటర్ల పొడవు ఉంటుందీ బ్రిడ్జి. దీనిపై నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడకుండా అధికారులు బ్రిడ్జి చుట్టూ ఇనుప వలను ఏర్పాటు చేశారు.

ఈ స్టెయిన్ లెస్ స్టీల్ నెట్ ఏర్పాటుకు 2014లో ఆమోదం లభించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 76 మిలియన్ డాలరు. అయితే పని ఆరంభమైంది మాత్రం నాలుగేళ్ల క్రితమే. దాంతో వ్యయం 224 మిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. నెట్ ఏర్పాటు చేయాలంటూ కోరుతున్న వారిలో కెవిన్ హైన్స్ కూడా ఉన్నారు. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న అతను 19 ఏళ్ల వయసులో.. 2000 సెప్టెంబర్‌లో ఈ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెన్నెముక విరిగినా అదృష్టవశాత్తు మరణం తప్పింది.


ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ హైన్స్, అతని తండ్రి, ఇతర బాధితులు 20 ఏళ్లుగా కోరుతున్నారు. నెట్ ఏర్పాటు చేసి ఉంటే తనకు వెన్నెముక విరిగే అవకాశమే ఉండేది కాదని, ప్రస్తుత అవస్థలూ తప్పేవని హైన్స్ చెప్పాడు. తాజాగా నెట్ ఏర్పాటు చేయడంతో ఏటా సగటున 30 ఆత్మహత్యలను నివారించే అవకాశం చిక్కిందని అధికారులు చెబుతున్నారు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×