EPAPER

YS Sharmila: అన్నకు ప్రత్యర్థిగా చెల్లెలు.. షర్మిల చుట్టూ ఏపీ రాజకీయాలు

YS Sharmila: అన్నకు ప్రత్యర్థిగా చెల్లెలు.. షర్మిల చుట్టూ ఏపీ రాజకీయాలు

YS Sharmila: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్‌ షర్మిల హాట్‌ టాపిక్‌గా మారారు. సొంత అన్న సీఎం జగన్‌పై ఎన్నికల ఫైట్‌కు సిద్ధమైంది. ఒకప్పుడు జగన్‌ వదిలిన బాణాన్ని అంటూ ప్రచారాన్ని హోరెత్తించిన షర్మిల.. ఇప్పుడు అదే బాణాన్ని అన్నకు గురి పెడుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడటంతో.. ఇదే సమయంలో జగన్‌ ప్రత్యర్థిగా షర్మిల ఎంట్రీ వ్యవహారం గజగజ వణికించే చలిలోనూ పొలిటికల్‌ కాక రేపుతోంది.


ఇదిలా ఉంటే.. వైఎస్‌ఆర్‌ బిడ్డగా షర్మిలను ఏపీలో దించిన కాంగ్రెస్‌ తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వైఎస్‌ఆర్‌ మరణానికి ముందు ఏపీలో కాంగ్రెస్‌ హవా నడిచింది. ఆయన మరణానంతరం డీలా పడిన పార్టీని బలోపేతం చేసి.. విజయతీరాలకు నడిపించేందుకు షర్మిలను ఏపీలో దించింది హస్తం హైకమాండ్‌. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆంధ్రా పగ్గాలు అప్పగిస్తార్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు రాహుల్‌ మనసులో కూడా ఇదే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో ఏపీ నేతలతో జరిగిన సమావేశంలో షర్మిలపై ప్రస్తావన సందర్భంగా షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం. అటు ఏపీలోనూ పార్టీ నాయకులందరూ షర్మిల రాకను స్వాగతించడంతో పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశముందున్న టాక్‌ వినిపిస్తోంది.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×