EPAPER

AP CM Meet KCR : కేసీఆర్ కు జగన్ పరామర్శ.. ఏకాంతంగా చర్చలు..!

AP CM Meet KCR : కేసీఆర్ కు జగన్ పరామర్శ.. ఏకాంతంగా చర్చలు..!
AP CM Meet KCR

AP CM Meet KCR(Latest news in Andhra Pradesh):

ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌ను జగన్‌ కలిశారు.
గత నెలలో ఇంట్లో ప్రమాదవశాత్తు కేసీఆర్‌ జారిపడ్డారు. దీంతో ఆయన ఎడమ తుంటికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆయన ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్లి ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు.


అంతకుముందు హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయానికి జగన్‌ చేరుకోగానే మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. ఆయన వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారు.

2023 డిసెంబర్ 8న ఫామ్‌హౌస్‌లో జారి పడటంతో కేసీఆర్‌ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. డిసెంబర్ 15న చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. తెలంగాణ మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నాయకుల ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సీఎం జగన్ కూడా గత నెలలోనే కేసీఆర్ ను పరామర్శించాల్సి ఉంది. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కలవలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×