EPAPER

Whatsapp : వాట్సాప్ లో కొత్త ఫీచర్లు… ఒకే గ్రూప్ లో 1024 మంది.. ఒకేసారి 32 మంది వీడియోకాల్

Whatsapp : వాట్సాప్ లో కొత్త ఫీచర్లు… ఒకే గ్రూప్ లో 1024 మంది.. ఒకేసారి 32 మంది వీడియోకాల్


Whatsapp: ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్ సరికొత్త ఫీచర్లు తెచ్చింది. మెటాకు చెందిన వాట్సాప్ తాజా అప్ డేట్స్ తో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దూసుకుపోతోంది. వాట్సాప్ లో ఎక్కువ మందికి నచ్చే ఫీచర్లలో ఒకటి గ్రూపులు. ఉద్యోగుల గ్రూప్, విద్యార్థుల గ్రూప్, పొలిటికల్ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూప్, చివరికి ఫ్యామిలీ గ్రూపులు కూడా ఉన్నాయి. అందరూ తమ అభిప్రాయాలను షేర్ చేసుకోడానికి, ఛాటింగ్ చేసుకోడానికి వీలును కల్పిస్తాయి ఈ గ్రూపులు. అయితే వీటికి ఒక లిమిట్ ఉంటుంది. గ్రూపుల ప్రాధాన్యతను గుర్తించిన వాట్సాప్.. మెంబర్స్ సంఖ్యను 1024కు పెంచింది. మొదట 256గా ఈ సంఖ్య ఉండేది. ఆ తర్వాత దాన్ని రెట్టింపు చేసి 512కు పెంచింది. ఇప్పుడు దీన్ని కూడా రెట్టింపు చేసి 1024కు పెంచింది.
ఇక గ్రూప్ వీడియో కాల్ లో ఒకేసారి 32 మంది పాల్గొనేలా ఫీచర్ ని అప్ గ్రేడ్ చేసింది. ఇంతకుముందు ఈ సంఖ్య 16 మాత్రమే. మొదట ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండేది. ఈ ఫీచర్ ని కూడా వాట్సాప్ డబుల్ చేస్తూ వస్తోంది. వీటితోపాటు కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్ ని పరిచయం చేసింది.
కమ్యూనిటీస్ ప్రత్యేకత ఏంటంటే… ఇప్పుడు వేర్వేరు గ్రూపులు ఉన్నాయి కదా… అవన్నీ అలా ఉంటూనే ఆ గ్రూపులన్నీ కమ్యూనిటీస్ లో భాగం కావచ్చు. గ్రూపులకు అడ్మిన్ ఉన్నట్లుగానే కమ్యూనిటీస్ కు కూడా అడ్మిన్ ఉంటారు. అడ్మిన్ షేర్ చేసే సమాచారం ఏదైనా సరే అన్ని గ్రూపుల్లో ప్రత్యక్షమవుతుంది. ఇక యూజర్ తమ గ్రూప్ లో షేర్ చేసిన సమాచారాన్ని, కమ్యూనిటీస్ లోని ఇతర గ్రూపుల సభ్యులు కూడా చూసే వీలుంటుంది.
వాట్సాప్ తెచ్చిన కొత్త ఫీచర్లలో మరోటి వాట్సాప్ చాట్ పోల్. గ్రూపులలో పెట్టే పోస్టులపై కొన్నిసార్లు అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. కొందరు అవునంటే… మరికొందరు కాదంటారు. అలాంటప్పుడు ఎక్కువ మంది ఎస్ అంటున్నారా నో అంటున్నారా అనేది తెలుసుకోవాలంటే వాట్సాప్ ఇన్ చాట్ పోల్స్ పనికొస్తాయి. ఇందులో ప్రధానంగా 12 ఆప్షన్లు ఉంటాయి. గ్రూప్ అడ్మిన్ పోల్ క్రియేట్ చేసి షేర్ చేయగానే… సభ్యులంతా తమకు నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకుని ఓట్ చేయొచ్చు. మెజార్టీ అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోడానికి వీలు కలుగుతుంది.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×