EPAPER
Kirrak Couples Episode 1

YSRCP Disgruntled | ఇంఛార్జ్‌ల మార్పుతో వైసీపీలో అసంతృప్తి సెగ.. జగన్ నిర్ణయాలతో తలలు పట్టుకుంటున్న నేతలు

YSRCP Disgruntled | నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వైసీపీకి ఎంత లాభం చేకూరుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. సర్వేలు, చర్చోపచర్చలు, బుజ్జగింపులు చేసినా అసమ్మతి రాగం తగ్గడం లేదు. టిక్కెట్లు దక్కని వారికి సర్ది చెబుతామని వైసీపీ నేతలు అంటున్నారు. అయినా తమ దారి తాము చూసుకునే పనిలో అసంతృప్త నేతలున్నట్లు చెబుతున్నారు.

YSRCP Disgruntled | ఇంఛార్జ్‌ల మార్పుతో వైసీపీలో అసంతృప్తి సెగ.. జగన్ నిర్ణయాలతో తలలు పట్టుకుంటున్న నేతలు

YSRCP Disgruntled | నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వైసీపీకి ఎంత లాభం చేకూరుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. సర్వేలు, చర్చోపచర్చలు, బుజ్జగింపులు చేసినా అసమ్మతి రాగం తగ్గడం లేదు. టిక్కెట్లు దక్కని వారికి సర్ది చెబుతామని వైసీపీ నేతలు అంటున్నారు. అయినా తమ దారి తాము చూసుకునే పనిలో అసంతృప్త నేతలున్నట్లు చెబుతున్నారు.


రెండు విడతల్లో వైసీపీ సెగ్మెంట్ ఇంఛార్జ్ లను మార్చడంతో ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. ఇప్పటి వరకు ప్రకటించింది 35 స్థానాలే. ఇంకా 140 స్థానాలను ప్రకటించారు. అందులో ఎందర్ని కంటిన్యూ చేస్తారు.. ఇంకెందర్ని మారుస్తారు అన్నది కీలకంగా మారుతోంది. దీంతో గ్రౌండ్ రియాల్టీ ఏంటన్నది చర్చనీయాంశమవుతోంది. టిక్కెట్ ఇక రాదు అనుకున్న వారు వైసీపీ నుంచి ముందస్తుగానే గుడ్ బై చెబుతున్నారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఉన్న విభేదాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. అటు పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. టిక్కెట్ దక్కదని తేలడంతో బ్లో అవుట్ అయ్యారు. వైసీపీలో కేవలం దళితుల సీట్లు మాత్రమే మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదన్నారు. ఇప్పుడు తన పనితీరు బాగోలేదని, సర్వే రిపోర్టులు అనుకూలంగా లేవని చెబుతున్నారని, 2019 ఎన్నికల్లో ఏ సర్వే చూసి తనకు టికెట్‌ ఇచ్చారని ప్రశ్నించేదాకా పరిస్థితి వచ్చింది. సొంతంగా చేయాలంటే తమకు పవర్‌ ఇవ్వాలి కదా అని అంటున్నారు పూతలపట్టు ఎమ్మెల్యే బాబు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని తెగేసి ప్రశ్నిస్తున్నారాయ. డబ్బులిస్తే సర్వే సంస్థలు ఏదైనా చేస్తారంటున్నారు.


అనకాపల్లి ఎమ్మెల్యే, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు టికెట్‌ నిరాకరించారు. ఇన్ని రోజులు.. టిక్కెట్ ఇస్తేనే పార్టీలో ఉంటామనే వారు వెళ్లిపోవడమే మంచిదని గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు. అయితే తాజా సెకండ్ లిస్టులో ఆయన పేరే గల్లంతైంది. అనకాపల్లి ఇంఛార్జ్ గా అమర్నాథ్ ను తప్పించి… మలసాల భరత్ కుమార్ కు అప్పగించారు. నిన్నటికి నిన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీని వీడడంపై.. సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పార్టీకి వెన్నుపోటు పొడిచే కొంతమంది నేతలు వెళ్లిపోవడమే మంచిదన్నారు. వైసీపీలో గెలిచే వారికే టికెట్స్ ఉంటాయన్నారు. సీన్ కట్ చేస్తే ఆయన సీటే గల్లంతైంది.

అటు విజయవాడ సెంట్రల్‌ ఇంచార్జ్‌గా వెల్లంపల్లిని నియమించడంతో మల్లాది విష్ణు అనుచరులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు వెల్లంపల్లి, ఇటు మల్లాది విష్ణు ఇద్దరూ అలకబూనారా అన్న చర్చ జరుగుతోంది. మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తుంటే… వెల్లంపల్లి మాత్రం తనకు అక్కడ సీటు వద్దంటున్నారు. బెజవాడ సెంట్రల్‌ ఇన్‌ఛార్జిగా వెల్లంపల్లి నియామకాన్ని మల్లాది అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి విష్ణును తప్పించడానికి నిరసనగా సచివాలయ కన్వీనర్లు, కార్పొరేటర్లు, బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు, పార్టీ సమన్వయకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అసలు మల్లాదిని తప్పించి వెల్లంపల్లికి బాధ్యతలు ఎందుకిచ్చారన్నదే హాట్ టాపిక్ అవుతోంది. మల్లాది అనుచరులైతే కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ల నిరాకరణ.. నియోజకవర్గాల మార్పు.. వివిధ సెగ్మెంట్లకు కొత్త ఇన్‌చార్జ్‌ల నియామకాలతో వైసీపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. వాటిని కొలిక్కి తేవడానికి పార్టీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. అదే సమయంలో సెగ్మెంట్ల మార్పుతో కొందరు అడ్జస్ట్ అవలేకపోతున్నారు. కొత్త నేతలను వైసీపీ ద్వితియశ్రేణి నాయకులు ఆహ్వానించే పరిస్థితి లేకుండా పోతోంది. ఇటీవల గుంటూరులో మంత్రి విడుదల తీరు కారణంగా పాత వివాదం మళ్లీ తెర మీదకు వచ్చిందంటున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా షిఫ్ట్ అయిన ఆమె పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఫ్లెక్సీల్లో అక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న మర్రి రాజశేఖర్‌ ఫోటో పెట్టకపోవడంతో పాటు ఆయనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం వివాదాస్పదైంది. గతంలో మంత్రి విడుదల రజినికి రాజశేఖర్ వర్గాలకు చాలా సార్లు చిలకలూరిపేటలో గొడవలు జరిగాయి. అప్పుడు రెండు వర్గాలు పోలీసు స్టేషన్ల కెక్కి పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. అటు పెనుగొండలో ఉషశ్రీ చరణ్ కు టిక్కెట్ ఇవ్వొద్దని, శంకర్ నారాయణకే ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. 2014 నుంచి శంకర్ నారాయణ కష్టపడి పార్టీ కోసం పని చేస్తున్నారంటున్నారు.

అటు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవలే తన అసంతృప్తిని బహిరంగ సభలోనే వ్యక్తం చేశారు. సామాజిక సాధికార బస్ యాత్రలో..ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించలేకపోయినా.. నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను గుర్తించారని కామెంట్ చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది.

సెగ్మెంట్ల మార్పుపై చాలా మంది అసంతృప్తితో ఉంటే… కొందరు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం వైసీపీ ఇంఛార్జ్‌గా అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను సీఎం జగన్ నియమించడంతో… పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానంటున్నారు. టికెట్ రాని నేతల్లో అసంతృప్తి సహజమని.. అందరినీ కలుపుకొపోతామన్నారు తలారి. ఇంచార్జుల మార్పు మంచిదేనంటున్నారు.

మొత్తంగా వైసీపీలో పరిస్థితులు రోజురోజుకూ ఎటు టర్న్ తీసుకుంటాయన్నది కీలకంగా మారుతోంది.

Related News

Sajjala Arrest: బిగిస్తున్న ఉచ్చు.. జైలుకి సజ్జల రామకృష్ణా రెడ్డి?

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

Bhimili red sand hills: భీమిలి ఎర్రమట్టి దిబ్బలు, పనులు ఆపాలంటూ హైకోర్టు ఆదేశం

CM Chandrababu: సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి

Durga temple: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..

Bigtv Free Medical Camp: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో

AP Politics: ఢిల్లీలో జగన్ ప్లాన్ రివర్స్, ఎంపీ సీటు ఖాళీ.. బీజేపీకే ఛాన్స్!

Big Stories

×