EPAPER
Kirrak Couples Episode 1

Free Journey : మహిళలకు ఉచిత ప్రయాణం.. వైసీపీ కసరత్తు..

Free Journey : మహిళలకు ఉచిత ప్రయాణం.. వైసీపీ కసరత్తు..

Free Journey : ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హామీ ఇచ్చింది టీడీపీ.. ఇప్పటికే విడుదల చేసిన పార్టీ మినీ మానిఫెస్టోలో ఆ విషయాన్ని ప్రకటించింది. అయితే రేపు ఎన్నికల్లో ఫలితాలు అటూఇటూ అయినా టీడీపీకి ఆ ఘనత దక్కుకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందంట. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని జగన్ సర్కార్‌ తహతహలాడుతోందట. ఇప్పటికే ఆ ఫ్రీ జర్నీపై ఆదేశాలు అందడంతో దానికి సంబంధించిన నివేదిక అందజేశారంట ఆర్టీసీ అధికారులు. ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు.


తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలో భాగంగా ఇచ్చిన ఆ హామీ.. కార్యరూపం దాల్చి విశేష ఆదరణ పొందుతోంది. ఇటు ఏపీలో చూస్తే టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు గతేడాది మే లో జరిగిన మహానాడులో ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమై.. ముందుగా తామే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ఆరాటపడుతోంది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని, టీడీపీకి ఆ ఘనత దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందంట. అందుకు ఎంత వ్యయమవుతుంది? ఎలా అమలు చేస్తారు? పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? తదితర వివరాలను అందించాలని ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం.. ఆర్టీసీ అధికారులను ఆదేశించిందంట. అందులో భాగంగా దీనికి సంబంధించి కొందరు ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులను నివేదిక ఇవ్వాలని కోరడంతో.. అన్ని వివరాలు క్రోడీకరించి ఇటీవల వారు నివేదిక అందజేశారట.


ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎలాగోలా అమలు చేయాలని, టీడీపీకి ఆ ఘనత దక్కకుండా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందంట. అందుకు ఎంత వ్యయమవుతుంది? ఎలా అమలు చేస్తారు? పక్క రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? తదితర వివరాలను అందించాలని ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం.. ఆర్టీసీ అధికారులను ఆదేశించిందంట. అందులో భాగంగా దీనికి సంబంధించి కొందరు ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులను నివేదిక ఇవ్వాలని కోరడంతో.. అన్ని వివరాలు క్రోడీకరించి ఇటీవల వారు నివేదిక అందజేశారట.

ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున 40 లక్షల మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఇందులో 15 లక్షలకు పైగా మహిళలు ఉంటారని అంచనా.. ఆర్టీసీకి టికెట్ల విక్రయాల రూపంలో రోజుకు సగటున 16 నుంచి 17 కోట్ల రూపాయల చొప్పున నెలకు 500 కోట్ల వరకు వస్తోంది. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు 150 నుంచి 180 కోట్ల రూపాయల వరకు రాబడి కోల్పోతామని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆర్టీసీ ఉద్యోగులకు తాము జీతాలు ఇస్తున్నందున.. సంస్థ రాబడిలో 25 శాతం ఇవ్వాలని చెబుతూ ప్రతినెలా సగటున 125 కోట్ల వరకు జగన్ ప్రభుత్వం తీసుకుంటోంది. 2022, ఆగస్టు నుంచి ఇలా ప్రతి నెలా 25 శాతం రాబడిని ఆర్టీసీ.. ప్రభుత్వ ఖజానాకు జమచేస్తోంది. ఇప్పుడు మహిళలకు రాయితీ భరించడంతో పాటు, ప్రభుత్వానికి సొమ్ము చెల్లింపు కూడా కొనసాగిస్తే.. ప్రతి నెలా దాదాపు రూ.300 కోట్ల వరకు ఆర్టీసీ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంత మొత్తం లేకపోతే డీజిల్‌, విడిపరికరాలు కొనుగోళ్లు, బస్సులు, బస్టాండ్ల నిర్వహణ కూడా సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బాకాయిలతో పాటు కొత్తగా కొనుగోలు చేస్తున్న బస్సులకు చెందిన రుణ వాయిదాలూ చెల్లించే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు. మరి ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకు పోయి ఉన్న వైసీపీ ప్రభుత్వం. ఆర్టీసీ లెక్కలు ఎలా తేలుస్తుందో?… మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా అమలు చేస్తుందో చూడాలి.

Related News

Ys Sharmila: మా అన్న ముంచాడు.. మీరైనా ఆ పని చేయండి.. షర్మిళ కామెంట్స్

Political Heat: కూటమికి తలనొప్పిగా మారిన ఆ జిల్లా.. తన్నుకుంటున్న తమ్ముళ్ళు.. సైనికులు ?

Tirumala Laddu: సెటైరికల్ ట్వీట్ తో డిప్యూటీ సీఎం పవన్ కి షాక్.. రిప్లై కూడా అదిరింది

Payyavula Keshav: మీరు చేసిన పాపాలు చాలు.. మళ్లీ మీ పూజలెందుకు?.. వైసీపీపై పయ్యావుల సీరియస్

Perni Nani: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?

Sajjala Arrest: బిగిస్తున్న ఉచ్చు.. జైలుకి సజ్జల రామకృష్ణా రెడ్డి?

TTD Complaint to Police: నెయ్యి కల్తీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ

Big Stories

×