EPAPER

CM Jagan Mohan Reddy : రాజకీయాల కోసం కుటుంబాలని చీలుస్తారు.. చంద్రబాబుపై జగన్ ఫైర్..

CM Jagan : రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుని కుట్రలకు దారి తీస్తాయని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పొత్తుల కోసం కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారన్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జగన్ సూచించారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనని జగన్ అన్నారు. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

CM Jagan Mohan Reddy : రాజకీయాల కోసం కుటుంబాలని చీలుస్తారు.. చంద్రబాబుపై జగన్ ఫైర్..

CM Jagan Mohan Reddy : రాబోయే రోజుల్లో పొత్తులు కుట్రలకు దారి తీస్తాయని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. పొత్తుల కోసం కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారన్నారు వైఎస్ జగన్. మీరందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జగన్ సూచించారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదన్నారు. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు.


చంద్రబాబు హయాంలో పెన్షన్‌ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదన్నారు. జన్మ భూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని సీఎం జగన్‌ దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇ‍వ్వలేదని మండిపడ్డారు. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేకపోయాడన్నారు.

చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కూడా పార్ట్‌నరే అని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడు దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నాడని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు పార్టనర్ కాబట్టే ప్రశ్నించడని జగన్ ధ్వజమెత్తారు.


మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ రూ.3వేలకు పెంచామని జగన్ తెలిపారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలన్నారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్‌ అందిస్తున్నామన్నారు. పెన్షన్‌ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నామని జగన్ తెలిపారు.

చంద్రబాబు పాలనలో పెన్షన్‌ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉండేదన్నారు. ఎన్నికల ముందు తాను హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్‌ పెంచేవారా? అని జగన్ ప్రశ్నించారు. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్‌ ఇస్తున్నామన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్‌ రూ.58వేలు మాత్రమే ఇచ్చారన్నారు. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను అందరు గమనించాలని జగన్ సూచించారు.

గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ ఇచ్చారని జగన్ తెలిపారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్‌ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్‌ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నామని జగన్ తెలిపారు. బాబు పెన్షన్ల కోసం నెలకు రూ.400కోట్లు ఇచ్చారన్నారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు అందజేస్తున్నామని జగన్ తెలిపారు .

పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్‌ అందజేస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే అని జగన్ తెలిపారు. రాష్ట్రంలో 53 లక్షల 52వేల మందికి రైతు భరోసా అందిస్తున్నామని జగన్ తలెపారు. రైతన్నలకు ప్రతీ ఏటా రూ.13,500 అందిస్తున్నామన్నారు. రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.33,300 కోట్లు జమ చేశామని తెలిపారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా రూ.19,179కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించామన్నారు. 78 లక్షల 94వేల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా అందిజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

అంతకు ముందు సీఎం జగన్ కాకినాడలో ఆర్వోబీని, రూ.94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పింఛన్లకు సంబంధించిన మొత్తం రూ.1,967.34కోట్ల మెగా చెక్‌ను ఆవిష్కరణ చేశారు. జగన్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతాలు స్వాగతం పలికారు.

Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×