EPAPER

Japan Earthquakes | భూకంప నష్టాలను నియంత్రిచేదెలా?.. భారత్‌లో తీవ్రత ఎంత?

Japan Earthquakes | భూకంపాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కాలుష్యంతో వాతావరణం చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు భూమి లోపలి పొరల్లోనూ చాలా మార్పులు జరుగుతూ పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రకృతి సహజ ప్రక్రియకు తోడు.. మానవ చర్యలతోనూ విపత్తుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచం చాలా రూపాల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఈ భూకంపాలు.

Japan Earthquakes | భూకంప నష్టాలను నియంత్రిచేదెలా?.. భారత్‌లో తీవ్రత ఎంత?

Japan Earthquakes | భూకంపాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కాలుష్యంతో వాతావరణం చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు భూమి లోపలి పొరల్లోనూ చాలా మార్పులు జరుగుతూ పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రకృతి సహజ ప్రక్రియకు తోడు.. మానవ చర్యలతోనూ విపత్తుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచం చాలా రూపాల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఈ భూకంపాలు.


భూకంపాలకు చాలా కారణాలు ఉన్నాయి. భూ ఉపరితలం భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉంటాయి. రెండు ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్‌ అని పిలుస్తారు. అంటే ఒక వైపు ఉన్న భూఫలకం ఒక దిశలో మరోవైపు ఉన్న భూఫలకం మరొక దిశలో కదులుతూ ఉంటాయి. నిజానికి ఈ ఫలకాలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. అయితే, ఒక్కోసారి రెండిటిలో ఒక ఫలకం వేగంగా కదలడం, లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుంది. దాని ఫలితంగా భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇవన్నీ భూమి ఉపరితలం లేదా పైపొరల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే భూమి లోపలి పొరల్లోని రాళ్లు ద్రవ రూపంలో ఉంటాయి.

భూపటలం అంతర్భాగంలో ఎక్కువ శక్తితో ఏర్పడే అలజడితో భూకంపాలు ఏర్పడుతాయి. భూకంపాలు వచ్చే చోట ఆ ప్రాంత ఉపరితలాన్ని బలహీనం చేస్తాయి. వీటిని సిస్మిక్ జోన్లుగా చెబుతారు. ఇవి ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలాగే హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి.


అగ్ని పర్వతాల విస్ఫోటనం, కొండచరియలు విరిగి పడటం, గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం, భూ అంతర్భాగంలో కేంద్రక విస్పోటనం, టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల భూకంపాలు వస్తుంటాయి. ఇలాంటి కారణాలతో భూఅంతర్భాగంలో విపరీతమైన ఒత్తిడితో ప్రకంపనాలు మొదలై భూ ఉపరితలానికి చేరుకుంటాయి. అలాంటి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తిస్తారు. అగ్నిపర్వత ప్రాంతాలు, ముడుత పర్వతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. వీటిని పిల్లులు, పాములు, పశువులు తరంగాల రూపంలో ముందుగా గుర్తిస్తాయి. ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు 68 శాతం పసిఫిక్ మహాసముద్రం, 21 శాతం మధ్యదరా ప్రాంతాలు, 11 శాతం ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి.

భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ లో ట్రై నైట్రో టొలీన్ అనే కెమికల్ కాంపౌండ్ తో గుర్తిస్తారు. ఈ స్కేల్ పై 9 పాయింట్లు ఉంటాయి. రిక్టర్ స్కేలును అమెరికన్ సైంటిస్ట్ చార్లెస్ రిక్టర్ 1935లో రూపొందించాడు. ఈ రిక్టర్ స్కేల్ పై 7 అంతకంటే ఎక్కువ తీవ్రత నమోదైతే పెను విధ్వంసం జరుగుతుంది. అంతకు తక్కువగా నమోదైతే మాత్రం కొంత వరకే ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. రిక్టర్ స్కేల్ పై 3.5 అంతకంటే తక్కువ తీవ్రతతో రోజూ దాదాపు వెయ్యి వరకు ప్రకంపనలు సంభవిస్తుంటాయి. వీటిని మనుషులు గుర్తించలేరు. 3.5 నుంచి 5.4 మధ్య తీవ్రత రికార్డయితే… కిటికీలు, ఫ్యాన్లు, కిచెన్ వస్తువులు కదులుతాయి. ఇలాంటివి ఏడాదికి 49 వేల సార్లు వస్తుంటాయి. అయితే బిల్డింగ్ లు కూలడం వంటి విధ్వంసం ఉండదు. 5.5 నుంచి 6.0 మధ్య వస్తే క్వాలిటీ లేని బిల్డింగ్ లు దెబ్బతింటాయి. ఇవి ఏడాదికి 6,200 సార్లు వస్తాయి. ఇక 6.1 నుంచి 6.9 తీవ్రతతో భూకంపం వస్తే 100 కిలోమీటర్ల వైశాల్యంతో ఎఫెక్ట్ చూపుతుంది. ఇక రిక్టర్ స్కేల్ పై 8.0 కంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపిస్తే తీవ్ర విధ్వంసం జరుగుతుంది. ఇది ఏడాదిలో ఒకసారి వస్తుంటుంది.

భూకంపాలు వచ్చినప్పుడు వాటి తీవ్రత ఒక నిమిషంలోపే ఉంటుంది కానీ నష్టం మాత్రం భారీగానే కలిగిస్తుంటుంది. అలాగే పగలు, రాత్రి అన్న తేడా ఉండదు. ఎర్త్ క్వేక్ ఎప్పుడైనా రావొచ్చు. మనదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల చుట్టూ భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తరచూ ప్రకంపనలతో జనం భయపడుతున్నారు. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ వంటి చోట్ల ఎక్కువగా ప్రకంపనలు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఉన్న జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ మనదేశంలో భూకంపాలను 5 జోన్లుగా విభజించింది. జోన్ 5 అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, బిహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ జోన్ 5లో ఉన్నాయి. ఢిల్లీ జోన్ 4లో ఉంది. ఇవన్నీ భూకంప డేంజర్ జోన్ లే.

జోన్ 1 అండ్ 2లో తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యభారత్, గుజరాత్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దక్కన్ ప్రాంతం, రాయపూర్, రాంచీ, జైపూర్ వంటివి ఉన్నాయి. అంటే ఇక్కడ భూకంపాలు వచ్చే సమస్య చాలా తక్కువగా ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ రూపొందించిన భూకంప మండల మ్యాప్ ప్రకారం దేశంలో 65 శాతానికి పైగా భూభాగం 7, అంతకు మించిన తీవ్రతతో భూకంపాలు సంభవించే ముప్పును కలిగి ఉంది.

అంతర్జాతీయ భూకంప అధ్యయన కేంద్రం లండన్ లో ఉంది. ఇక్కడి నుంచే భూకంపాలకు సంబంధించిన సమాచారం ప్రపంచదేశాలకు షేర్ అవుతుంటుంది. ఇక్కడి సైంటిస్టుల బృందం బ్రిటీష్ జియోలాజికల్ సర్వే పేరుతో భూకంపాలపై పర్యవేక్షణ చేస్తుంది. వీరు దీవులలో, ప్రపంచవ్యాప్తంగా భూకంపాలను కొలవడానికి సెన్సార్ల నెట్ వర్క్ ను నిర్వహిస్తారు. భూకంపం స్వభావం, దానిని పరిశోధించడం, భూకంప ప్రమాదాల గురించి అవగాహనను మెరుగుపర్చడం లాంటి పనులను ఈ సంస్థ నిర్వహిస్తుంది.

భూకంప తరంగాలు మూడు రకాలు. అవి.. P తరంగాలు, రెండోది ఎస్ తరంగాలు, మూడోది ఎల్ తరంగాలు. లోతు ఆధారంగానూ భూకంపాలను విభజిస్తారు. ఉపరితల కారణాల్లో ముఖ్యమైనవి కొండచరియలు జారడం, హిమ పాతాలు, సొరంగ పైకప్పులు కూలడం, భూగర్భంలో అణుపరీక్షల వల్ల భూకంపాలు వస్తాయి. అలాగే అగ్ని పర్వతాలు పేలడానికి ముందుగా లేదా పేలిన తర్వాత భూ కంపాలు సంభవిస్తాయి. భూ అంతర్భాగంలో జరిగే రసాయనిక మార్పులు, రేడియోధార్మిక విచ్ఛిత్తి వల్ల ప్రకంపనలకు ఆస్కారం ఉంటుంది. ఇవి 24 కిలోమీటర్ల నుంచి 640 కిలోమీటర్ల లోతులో సంభవిస్తాయి. భూకంపాల వల్ల ఏర్పడే శక్తి తరంగ రూపంలో ఉంటుంది. భూకంపానికి ముందు పాములు, ఎలుకలు భూమి లోపలి నుంచి బయటకు వస్తాయి. భారీ భూకంపాలు ఒక నిమిషం పాటు వస్తాయి.

ప్రపంచంలో సంవత్సరానికి 10 లక్షల భూ కంపాలు సంభవిస్తున్నట్లు అంచనా. ఇవి ఎక్కువ శాతం సముద్ర గర్భాల్లోనే సంభవిస్తున్నాయి. ప్రపంచంలో భూకంప ప్రమాదాలు లేని ఖండం ఆస్ట్రేలియానే. అక్కడ ఇప్పటి వరకు ప్రకంపనలు గుర్తించలేదు. ప్రపంచ మధ్య పర్వత ప్రాంతంలో 21% భూకంపాలు వస్తున్నాయి. ఆల్ఫ్స్ పర్వతాల నుంచి కాకసస్ పర్వతాలు, హిమాలయాల వరకు ఈ ప్రాంతం విస్తరించి ఉంది. 1961లో హైదరాబాద్‌లో జాతీయ భూ భౌతిక సంస్థ – NGRI ను ఏర్పాటు చేశారు. దీనిలో డిజిటల్ టెలీ వ్యవస్థతో పాటు జియోస్కోప్ వ్యవస్థ కూడా ఉంది. దీన్ని ప్రపంచ భూకంప అధ్యన కేంద్రాలతో లింక్ చేశారు. హిమాలయ ప్రాంతాల్లో వచ్చే భూకంపాల అధ్యయనానికి ఉత్తరాఖండ్‌లో రూర్కి వర్సిటీలో భూకంప అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భూకంపాలను తట్టుకునే ఇళ్లు, భవనాల నిర్మాణాలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. మరోవైపు 2007 అక్టోబర్‌లో జాతీయ సముద్ర సమాచార కేంద్రాన్ని హైదరాబాద్‌లోనే నెలకొల్పారు. ఈ కేంద్రంలో ముందస్తు భూకంప, సునామీ హెచ్చరిక కేంద్రం వ్యవస్థలు ఉన్నాయి.

భూకంపాల్లో ప్రాణనష్టం తక్కువగా ఉండాలంటే.. వాటిని తట్టుకునేలా బిల్డింగ్ లు నిర్మించారు. ప్రజల్లో అవగాహన పెరగాలి. భూకంపాల నుంచి రక్షించుకోవటంలో డ్రాప్-కవర్-హోల్డ్ విధానం ఎంతో ఎఫెక్టివ్ అన్నది ఇప్పటికే నిరూపితమైంది. భవనాలు దీర్ఘ చతురస్రాకార ప్రణాళిక కలిగి ఉండాలి. పొడవైన గోడలు, పటిష్ట కాంక్రీట్ పిల్లర్స్ ఉండాలి. కిటికీలు, తలుపులు చిన్నవిగా గోడల మధ్యలో ఉండడంతో పాటే.. మూలలు, గోడలు కలిసే చోట నిలువు పిల్లర్స్ ఉండాలి.

ఎక్కువ ఎఫెక్ట్ చూపిన భూకంపాలు చాలానే ఉన్నాయి. జూన్ 2022లో అఫ్గనిస్తాన్ లో వచ్చిన భూకంపంలో 1,100మంది జనం చనిపోయారు. 2015 ఏప్రిల్ లో నేపాల్ లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇందులో 8,800మందికి పైగా మరణించారు. అలాగే 2011 మార్చిలో జపాన్ లో 9.0 తీవ్రతతో ఎర్త్ క్వేక్ వచ్చింది. ఆ తర్వాత సునామీగా మారింది. ఆ ప్రకృతి విపత్తులో 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇక 2004 డిసెంబర్ లో ఇండోనేషియా తీరంలో వచ్చిన భూకంపం… 12కు పైగా దేశాల్లో సునామీ ప్రభావం చూపించింది. 9.1తీవ్రతతో అప్పుడు భూకంపం సంభవించింది. దాదాపు 2.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణనష్టం పరంగా ఇదే అతిపెద్ద ఎర్త్ క్వేక్.

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×