EPAPER

Shahid Afridi : గొప్ప మామగారు.. సొంత అల్లుడికి కెప్టెన్సీ కరెక్ట్ కాదన్న షాహిద్ ఆఫ్రిదీ..

Shahid Afridi : గొప్ప మామగారు.. సొంత అల్లుడికి కెప్టెన్సీ కరెక్ట్ కాదన్న షాహిద్ ఆఫ్రిదీ..

Shahid Afridi : పాకిస్తాన్ క్రికెటర్లలో షాహిద్ ఆఫ్రిదీ అంటే క్రీడాభిమానులు అందరికీ ఆదర్శమే. తన ఆట తీరుతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. క్రీజులోకి వచ్చాక ఎక్కువ సేపు అక్కడ ఉండలేడు. అవతల బౌలర్ ఎవరనేది అస్సలు పట్టించుకోడు.


ఏ బౌలర్ అయినా సరే, ముందుకొచ్చి పడీపడీమని సిక్సర్లు కొట్టడమే తెలుసు. అలా ఎన్నిసార్లు అవుట్ అయినా, తన సహజమైన ఆటతీరుని ఆఫ్రిదీ ఎప్పుడూ మార్చుకోలేదు. జట్టులో చోటు ప్రశ్నార్థకమైనా సరే, చివరి వరకు అలాగే ఆడి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఆడే… టీ 20 ఆటను తనెప్పుడో అందరికీ రుచి చూపించాడు.

అయితే లెగ్ స్పిన్నర్ కావడమే ఆఫ్రిదీకి కలిసివచ్చింది. అందుకే బౌలింగ్ కోటాలో తప్పనిసరిగా బౌలర్ గా జట్టులోకి తీసుకునేవారు. అంతేకాదు జట్టులో ఆల్ రౌండర్ ఆవశ్యకత ఉండేది. అది కూడా తనకి వరం అయ్యింది. పాకిస్తాన్ బోర్డుకి తనని తప్పించడం సాధ్యమయ్యేది కాదు. క్లిక్ అయితే సెంచరీ లేదంటే ఆఫ్ సెంచరీ తక్కువ బాల్స్ లో స్కోర్ ని పెంచి, చకచకా స్టాండ్ లోకి వెళ్లిపోయేవాడు.


ఇంతకీ విషయం ఏమిటంటే… అలాంటి షాహిద్ ఆఫ్రిదీ తన కుమార్తెకు పెళ్లి చేశాడు. అది మరెవరో కాదు పాకిస్తాన్ యువ ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదీకి ఇచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఘోర వైఫల్యం తర్వాత కెప్టెన్ బాబర్ ఆజామ్ కి కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలికారు. అనూహ్యంగా టీ 20 కెప్టెన్సీని ఆఫ్రిదీ అల్లుడు షాహిన్ కి ఇచ్చారు.

అయితే షాహిద్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్, సర్ఫరాజ్, షాహిన్ అఫ్రిదీ, మహమ్మద్ రిజ్వాన్‌లు అంతా కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాహిద్ ఆఫ్రిది వేదికపై మాట్లాడుతూ టీ20 కెప్టెన్సీని రిజ్వాన్ కి ఇవ్వకుండా షాహిన్ కి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇదేంట్రా బాబూ, పదిమందిలో సొంత అల్లుడిని పట్టుకుని ఇలా అనేశాడని అంతా అనుకున్నారు. వేదికపై అందరూ నవ్వుకున్నారు.

రిజ్వాన్ ఎంతో కష్టపడి, ఈ స్థాయికి వచ్చాడని, తనంటే నాకెంతో ఇష్టమని, తన ఆటని కూడా ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. దీంతో షాహిద్ ఆఫ్రిది చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. గొప్ప మామగారు రా బాబూ…అని అంతా అనుకున్నారు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×