EPAPER

2023 Top 10 Crimes | ముక్కలుగా నరికేసిన శవం.. అతిపెద్ద చోరి.. 2023 టాప్ 10 నేరాలు ఇవే

2023 Top 10 Crimes | 2023 సంవత్సరం కొంతమందికి సంతోషాలను ఇస్తే.. మరికొందరికి మరుపురాని దుఖాలను మిగిల్చింది. గత సంవత్సరంలో దారుణమైన నేరాలు జరిగాయి. వీటిలో జాతీయ స్థాయిలో టాప్ 10.. అంటే దేశవ్యాప్తంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచిన 10 ఘోరమైన నేరాలు ఇవే..

2023 Top 10 Crimes | ముక్కలుగా నరికేసిన శవం.. అతిపెద్ద చోరి.. 2023 టాప్ 10 నేరాలు ఇవే

2023 Top 10 Crimes | 2023 సంవత్సరం కొంతమందికి సంతోషాలను ఇస్తే.. మరికొందరికి మరుపురాని దుఖాలను మిగిల్చింది. గత సంవత్సరంలో దారుణమైన నేరాలు జరిగాయి. వీటిలో జాతీయ స్థాయిలో టాప్ 10.. అంటే దేశవ్యాప్తంగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచిన 10 ఘోరమైన నేరాలు ఇవే..


10. జనవరి 1 2023.. అంజలి మర్డర్ కేసు

జనవరి 1 2023 అంటే సంవత్సరం మొదలైన తొలి రోజే దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై ఒక యువతి ప్రమాదవశాత్తు ఒక కారుకున్న తాడులో ఇరుక్కుంది. అలా ఆ కారు 12 కిలోమీటర్ల వరకు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ సంఘటన డిసెంబర్ 31 అర్ధరాత్రి దాటాక జరిగింది. అంటే జనవరి 1 2023 ఉదయం జరిగింది.


కారులో నలుగురు యువకులు మద్యం మత్తులో ఉండడంతో అంజలి అనే యువతి తమ కారు వెనుక ఒక తాడులో ప్రమాదవశాత్తు ఇరుక్కొని ఉందని గమనించలేదు. అలా ఢిల్లీలోని రాళ్లతో నిండిన రోడ్డుపై ఆమెను 12 కిలోమీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు. ఆమె శరీరంలోని ఎముకలు సైతం బయటికి కనిపించాయి. చివరికి అంజలి చనిపోవడంతో పోలీసులు వారిని హత్య కేసులో అరెస్టు చేశారు. ఇప్పటికీ ఈ కేసు కోర్టులో విచారణ దశలోనే ఉంది.


9. నిక్కీ యాదవ్ మర్డర్ కేసు


గుజారత్ రాష్ట్రంలోని నిక్కీ యాదవ్ అనే అమ్మాయి ఒక యువకుడితో సహజీవనం చేస్తూ ఉండేది. కానీ పెళ్లి చేసుకోవాలని ఆమె ఆ యువకుడిపై ఒత్తిడి చేయడంతో అతను నిక్కీని హత్య చేసి ఒక ఢాబాలోని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అయితే పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకొని పరిష్కరించారు. నిక్కీ యాదవ్ శవం దొరకకపోవడంతో హంతకుడు తప్పించుకుందామని చూశాడు. కానీ పోలీసులు శవాన్ని వెలికితీసి హంతకుడిని శిక్ష పడేటట్లు చేశారు.

ఇలాంటిదే 2022లో ఒక కేసు జరిగింది. ఆఫ్తాబ్ అనే యువకుడు తనతో సహజీవనం చేసిన శ్రద్ధా అనే యువతిని హత్య చేసి.. ఆమె శవాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు.


8. సరస్వతి మర్డర్ కేసు – ముంబై


ముంబైకి చెందిన మనోజ్ సహని అనే యువకుడు కూడా తనతో సహజీవనం చేస్తున్న సరస్వతి అనే అమ్మాయిని చంపేసి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు నరికేశాడు. ఆ తరువాత ఆ ముక్కలను మూడు బకెట్లలో, ఒక టబ్‌లో దాచి పెట్టాడు.

ఆ తరువత ఆ ముక్కలను పలుమార్లు కుక్కర్‌లో ఉడికించి కుక్కలకు ఆహారంగా వేసేవాడు. సరస్వతి మిస్సింగ్ కేసుని విచారణ మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ తరువాత హంతకుడు ఉంటున్న బిల్డింగ్, గేటెడ్ సొసైటీలో అందరినీ ప్రశించగా కొందరు మనోజ్.. కుక్కలకు మాంసం తినిపించం చూశామని తెలిపారు. దీంతో పోలీసులకు నిజం తెలిసింది. చుట్టు పక్కల నివసించే వారంతా విషయం తెలిసి వాంతులు చేసుకున్న పరిస్థితి.


7. దేశం సిగ్గుతో తలదించుకున్న మణిపూర్ ఘటన

2023 సంవత్సరంలో మణిపూర్‌లో జరిగిన హింస, దారుణమైన ఘటనను భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా తలవంపులు తెచ్చిపెట్టింది. ఒకే రాష్ట్రంలో నివసించే రెండు తెగలు.. భూమి కోసం కొట్టుకుచచ్చారు. ఈ హింసలో మణిపూర్ తగలబడిపోయింది. ఎన్నో ఇల్లు దగ్ధమైపోయాయి. 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయాలపాలయ్యారు. వేల మంది నిరాశ్రులయ్యారు.

ఎప్పుడో చేసిన చట్టంతో ఇప్పుడు ఓ తెగ ప్రజలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది అన్యాయమని.. చట్టం మార్చాలని మొదలైన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ హింసలో రెండు తెగల ప్రజలు ఒకరిపై మరొకరో ద్వేషంతో మానవత్వం మరిచి నీచంగా ప్రవర్తించారు.

ఈ నేపథ్యంలో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో దేశమంతా సంచలనంగా మారింది. అందులో నిరసనకారులు.. శత్రువు తెగకు సంబంధించిన ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరంతా తిప్పారు. వాళ్లను చితకబాదారు. ఆ మహిళల శరీరాలు రక్త సిక్తంగా ఉన్నాయి. మణిపూర్ ఒక ప్రశాంత రాష్ట్రమని అంతవరకూ అనుకున్నారంతా.. కానీ ఈ వీడియోలోని దృశ్యాలు మణిపూర్‌లో మానవ మృగాలు నివసిస్తున్నారని తెలిపింది. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతకానితనం మరోసారి బయటపడింది.


6. ఢిల్లీలో పట్టపగలు రోడ్డుపై యువతి హత్య

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు, ప్రజలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారనేందుకు ఈ హత్య కేసు ఉదాహరణ. సాక్షి అనే 16 ఏళ్ల బాలిక.. ఢిల్లీలోని ఒక ప్రాంతంలో కాలినడకన వెళుతుండగా.. ఒక యువకుడు వచ్చి అందరి ముందు ఆమెను పలు మార్లు కత్తితో పొడిచాడు. ఆ తరువాత ఒక బండరాయి తీసుకొని ఆమె తలపై దాడి చేశాడు. కాసేపటి తరువాత అలసిపోయి కూర్చున్నాడు.

అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ ముందుకు వచ్చి అతడిని ఆపడానికి ప్రయత్నించలేదు. ఆ సమయంలో సాక్షి ఇంకా కొనఊపిరితోనే ఉంది. అందరివైపు సహాయం కోసం చూస్తోంది. కానీ ఎవరూ ధైర్యం చేయలేదు. కొందరు ఇంటి లోపలికి వెళ్లిపోయి కిటికీల నుంచి చూస్తూ కూర్చున్నారు. ఆ హంతకుడు మళ్లీ లేచి సాక్షి తలపై రాయితో కొట్టి కొట్టి చంపాడు. ఆ తరువాత ఆ యువకుడు పైశాచిక ఆనందంతో శవం ముందు డాన్స్ చేశాడు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీయడంతో పోలీసులు ఆ హంతకుడిని అరెస్టు చేశారు. ఈ హత్య ఘటన నగరంలో నివసించే బిజీ బిజీ ప్రజల జీవనానికి అద్దం పడుతోంది.


5. తీహార్ జైలులో మర్డర్


నేరం చేస్తే జైలుకెళ్తారు. కానీ ఆ జైలు ఎంత కఠినంగా ఉన్నా సురక్షితంగా ఉంటుందని అందరూ భావిస్తారు. ఆ భావన భ్రమ అని 2023 టిల్లూ తాజ్ పురియా మర్డర్ కేసు నిరూపించింది. తీహార్ జైలులో ఒక వ్యక్తి కత్తితో టిల్లూ తాజ్ పురియా అనే గ్యాంగ్ స్టర్‌ని దాడి చేసి చంపేశాడు.

ఆ సమయంలో జైలు సెక్యూరిటీ సిబ్బంది కూడా పక్కనే ఉంది. అయినా హత్య జరిగింది. ఈ కేసులో జైలు అధికారులు లంచం తీసుకొని హత్య చేయించారనే ఆరోపణలున్నాయి. ఈ మర్డర్ కేసు కోర్టులో విచారణ దశలోనే ఉంది.


4. పార్లమెంటుపై దాడి

2023లో పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ దాడి 94 ఏళ్ల క్రితం స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుడు భగత్ సింగ్ జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని చేశామని నిందితులు తెలిపారు. దేశంలో జరుగుతున్న అన్యాయం, నియంత పాలనకు నిరసనగా ఈ దాడి చేశామని నిందితులు అన్నారు. 94 ఏళ్ల క్రితం కేవలం 24 ఏళ్ల భగత్ సింగ్ తన ఇద్దరు మిత్రులతో కలిసి బ్రిటీష్ ఇండియా పార్లమెంటుపై పొగ బాంబులతో దాడి చేశాడు. ఈ దాడిలో వారు ఎవరికీ హాని కలిగించలేదు. కేవలం తమ నిరసన తెలిపేందుకే అలా చేశారు.

అయితే 2023లో జరిగిన పార్లమెంటుపై దాడి.. అక్కడ సెక్యూరిటీ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. సాధారణ వ్యక్తులు కూడా ఎలా లోపలికి ప్రవేశించగలరో అందరికీ తెలిసిపోయింది. దాడి చేసిన వారు ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదు. కానీ దేశమంతా ఒకసారి 2001లో జరిగిన పార్లమెంటు దాడి గుర్తు చేసుకుంది.

3. 25 కోట్ల నగలు చోరీ చేసిన జెంటిల్ మెన్

దొంగతనం ఎలా చేయాలో ఓటిటిలో ఉన్న మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ చూసి ఒక వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఒక గ్రామంలో నివసించే అతను నగరానికి వెళతాడు. రెండు రోజులపాటు ఆ నగరంలోని ఒక పెద్ద నగల దుకాణం గురించి రెక్కీ చేస్తాడు. ఒక రోజు బస్టాప్ వెళ్లి తన గ్రామానికి తిరిగి వెళ్లేందుకు టికెట్ తీసుకుంటాడు.

అదే రోజు రాత్రి బాగా ప్లాన్ చేసుకొని నగల దుకాణం పైకప్పు నుంచి లోపలికి ప్రవేశిస్తాడు. కానీ తొందరపడి దొంగతనం చేయడు. తనతో తెచ్చుకున్న డిన్నర్ చేసి బాగా నిద్రపోతాడు. ఎందుకంటే తరువాతి రోజు కూడా దుకాణం బంద్ ఉంటుందని అతనికి తెలుసు. ఉదయం లేచి చల్లగా టిఫిన్ చేసి.. ఆ తరువాత పని మొదలుపెడతాడు. 25 కోట్లు విలువ చేసే నగలు దొచుకొని రాత్రి వేళ వచ్చిన దాడి వెళ్లిపోతాడు. బస్టాండు చేరుకొని తన గ్రామానికి వెళ్లే బస్ ఎక్కుతాడు. అంతా కూల్‌గా జరిగిపోతుంది. దేశ చరిత్రలో ఒకే వ్యక్తి ఎవరి సహాయం లేకుండా.. 25 కోట్ల చోరీ చేయడం ఇదే తొలిసారి. కానీ ఈ జెంటిల్ మెన్ దొంగను పోలీసులు సిసిటీవి వీడియా ఆధారంగా పట్టుకున్నారు.


2. సుఖ్ దేవ్ సింగ్ గోగామెడీ మర్డర్ కేసు

ఇంట్లో కూర్చున్నా చావు వెతుక్కుంటూ వస్తుంది. ఈ విధంగానే రాజస్థాన్‌కు చెందిన శ్రీ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగామెడీ మరణించాడు. సుఖ్ దేవ్ సింగ్ తన ఇంట్లో ఉండగా.. అక్కడికి ముగ్గురు వ్యక్తులు పెళ్లి పత్రికలతో వచ్చారు. 10 నిమిషాల పాటు ఆయనతో మాట్లాడి.. పెళ్లికి తప్పనిసరిగా రావాలని ఆహ్వానిస్తారు. ఆ తరువాత లేచి వెళుతూ తుపాకులు తీసి సుఖ్ దేవ్ సింగ్‌పై కాల్పులు చేశారు.

ఈ మర్డర్ కేసులో మరో విచిత్రమేమిటంటే.. ముగ్గురు హంతకులలో ఒకడు సుఖ్ దేశ్ హత్య తరువాత తనతో వచ్చిన మరో వ్యక్తిని కూడా కాల్చి చంపేస్తాడు. ఈ ఘటనంతా వీడియోలో రికార్డ్ కావడంతో పోలీసులు హంతకులను గుర్తుపట్టారు. ఆ ముగ్గరూ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ సభ్యులు అని తేలింది.


  1. యూపీ డాన్ అతీఖ్ అహ్మద్ మర్డర్

2023లో డాన్ అతీఖ్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. ఈ హత్య అందరిముందూ జరగింది.. పైగా కెమెరా ముందు జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతీఖ్ అహ్మద్ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఒక మాఫియా డాన్. కిడ్నాపింగ్, పొలిటికల్ హత్యలు చేయడం.. చేయించడం అతని వృత్తి. అతను లోక్ సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. అతని కుటుంబంలో అందరూ క్రిమినల్స్.

అతని తమ్ముడు అషరఫ్, కొడుకులు, భార్య అందరూ ఇదే బిజినెస్‌లో ఉన్నారు. అతీఖ్ అహ్మద్‌పై 160 క్రిమినల్ కేసులున్నాయి. పలు హత్యల కేసులో నిందితుడిగా ఉన్న అతీఖ్ అహ్మద్‌ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. చాలా కాలంగా అతను అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అయినా అతను జైలు నుంచే తన కిడ్నాపింగ్, మర్డర్ బిజినెస్ నడిపేవాడు.

2005లో అతీఖ్ అహ్మద్ ఒక హత్య కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఉమేష్ పాల్‌ని హత్య చేయించాడు. ఆ తరువాత నుంచి పోలీసులు సీరియస్‌గా అతని గ్యాంగ్‌ సభ్యులను పలు ఎన్ కౌంటర్‌లలో చంపేశారు. అలా అతని కొడుకు అసద్ కూడా చనిపోయాడు. అసద్ చనిపోయిన రెండు రోజుల తరువాత పోలీసులు డాన్ అతీఖ్ అహ్మద్‌, అతని తమ్ముడు అషరఫ్‌ను వైద్య పరీక్షల కోసం ఆస్ఫత్రికి తీసుకెళ్లారు. అక్కడ మీడియా రిపోర్టర్ల వేశంలో ముగ్గురు యువకులు వచ్చి పోలీసుల ముందే తుపాకులతో ఇద్దరినీ కాల్చి చంపేశారు. ఇదంతా వీడియోలో రికార్డ్ కావడంతో దేశమంతా సంచలనంగా మారింది. అతీఖ్ అహ్మద్ ఆస్తుల విలువ దాదాపు 12 వేల కోట్లు.

Tags

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×