EPAPER
Kirrak Couples Episode 1

Visakhapatnam : జగన్‌కు దాడి కుటుంబం షాక్.. తండ్రికుమారులు పార్టీకి రాజీనామా..

Visakhapatnam : జగన్‌కు దాడి కుటుంబం షాక్.. తండ్రికుమారులు పార్టీకి రాజీనామా..

Visakhapatnam : విశాఖపట్నంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన, టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


గతంలో దాడి వీరభద్రరావును జనసేనలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. దీంతో ఆయన, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగుదేశంలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదన్న టాక్ ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్ కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓడిపోయారు.

గతంలో కూడా ఓ సారి పవన్ కల్యాణ్.. దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటి అయ్యి, సూచనలు,సలహాలు తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇప్పడు దీనిపై ఓ క్లారిటీ రానుంది.


Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×