EPAPER

JR NTR : జపాన్ భూ కంపాలపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. ధైర్యంగా ఉండాలని ట్వీట్

JR NTR : జపాన్ భూ కంపాలపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి.. ధైర్యంగా ఉండాలని ట్వీట్

JR NTR : ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ జపాన్‌లో దాదాపు 155 సార్లు భూమి కంపించింది. కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టీ పెట్టగానే ప్రకృతి ప్రకోపించింది. వరుస భూకంపాల ధాటికి పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా సంభవించిన భూకంపాలతో తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.


జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్‌ X వేదికగా స్పందించారు. జపాన్ లో సంభవించిన భూకంపాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్‌లో షూటింగ్ ముగించుకొని తిరిగి న్యూ ఇయర్ రోజున రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. జపాన్‌లో వారం రోజులు ‘దేవర’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే భూకంపం రావడం తన హృదయాన్ని కలచివేసిందని ఎన్టీఆర్ అన్నారు. “భూకంప ప్రభావిత ప్రాంత ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అందరూ ధైర్యంగా ఉండాలి” అని ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.


Tags

Related News

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Big Stories

×