EPAPER

Swargaseema Suketana Scam: స్వర్గసీమ సుకేతనకు DTCP అప్రూవల్.. ఈ ఒక్క లాజిక్ ఆలోచించండి..

Swargaseema Suketana Scam: స్వర్గసీమ సుకేతనకు DTCP అప్రూవల్.. ఈ ఒక్క లాజిక్ ఆలోచించండి..

Swargaseema Suketana Scam: బ్రోకర్లు లేరు.. కమిషన్లు ఇవ్వం.. డైరెక్ట్ సేల్స్‌.. ఆ బెనిఫిట్ కస్టమర్లకే ఇస్తాం.. ఇదీ చండ్ర చంద్రశేఖర్‌ చెప్పే మాట. మాటలు వరకూ బాగానే ఉన్నా.. కస్టమర్లను ముంచడంలో మాత్రం ఆయనకు ఆయనే ఎక్స్‌పర్ట్‌. రూల్స్‌ ప్రకారమే అన్నీ చేస్తున్నామంటూ రూల్స్‌ను ఫాలో కాకపోవడమే ఆయన స్టైల్‌. సుకేతన వెంచర్ డీటైల్స్‌ను తవ్వితే బిగ్‌టీవీకి తెలిసిన వాస్తవాలేంటో చూద్దాం.


ఏ వెంచర్ అయినా ప్లాట్లు వేయాలంటే ముందు DTCP అప్రూవల్ కావాలి. సుకేతన DTCP అప్రూవ్డ్‌ అని స్టాంప్‌ కూడా బ్రోచర్‌లో వేసుకున్నారు చండ్ర చంద్రశేఖర్‌. కానీ.. దానికింద ఇచ్చిన కోడ్‌ను చూస్తే అందులో తిరకాసు అర్థమైపోతుంది. ఇంతవరకూ సుకేతన ప్రాజెక్టుకు DTCP అప్రూవల్ రాలేదు. కేవలం అప్రూవ్ చేయమని దరఖాస్తు మాత్రమే పెట్టుకున్నారు. ఆ కాపీలను పట్టుకుని గంగన్నగూడ గ్రామపంచాయితీలో అప్రూవల్‌ తీసుకున్నారు. దాన్నే DTCP సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మొత్తం లే ఔట్ విస్తీర్ణం 60 ఎకరాలకు పైమాటే. ఇందులో 40.55 ఎకరాలకు ఓ సారి, 7.55 ఎకరాలకు మరోసారి లేఔట్లు తయారు చేశారు. మిగిలింది ఫామ్‌ల్యాండ్ పేరుతో ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అయితే.. ఇందులో కీలకమైన 40.55 ఎకరాల లేఔట్‌ డిజైన్‌ను చూస్తేనే కొత్త డౌట్స్‌ ఎన్నో వస్తాయి.. ఆ లేఔట్‌పై ఉన్న DTCP అధికారుల సంతకాలు.. వాళ్లు వేసిన తేదీలు చూడండి.. డిప్యూటీ డైరెక్టర్‌ సంతకం పెట్టింది మే1న, జాయింట్‌ డైరెక్టర్ సంతకం పెట్టింది కూడా మే1నే, డైరెక్టర్‌ కూడా సంతకం పెట్టింది మే1నే. అసలు అంత ఫాస్ట్‌గా ఒకే రోజు అధికారులంతా లేఔట్‌కు సంతకాలు చేసి పర్మిషన్ ఇచ్చేస్తారా? అప్పుడే డెసిషన్‌కు రాకండి. వాళ్లు సంతకం చేసిన తేదీ చూశారు కదా.. మే ఫస్ట్‌.. అంటే కార్మిక దినోత్సవం. ఆ రోజు వాస్తవానికి ఏ ప్రభుత్వ కార్యాలయం పని చేయదు. అలాంటప్పుడు అదే రోజు ఎలా పర్మిషన్ ఇచ్చారు.. అంటే ఏదో మతలబు జరిగిందన్న డౌట్ ఎవరికైనా వచ్చేస్తుంది.

DTCP అనుమతి కోసం పెట్టుకున్న లేఔట్లలో TLP నెంబర్లు చూడండి.. ఒక దానిలో 99/2023/H, ఇంకో దానిలో 216/2023/H ఉంది. కానీ.. బ్రోచర్‌లో మాత్రం కేవలం 99/2023/H మాత్రమే ప్రస్తావించారు. ఇక రెరా కోసం పెట్టుకున్న దరఖాస్తులో ఈ రెండు పత్రాలు తప్ప ఎలాంటి డాక్యుమెంట్లను స్వర్గసీమ అప్‌లోడ్ చేయలేదు. అంటే.. ఈ లేఔట్‌కు సంబంధించి ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అందుకే.. కస్టమర్లూ.. డిస్కౌంట్‌ రేట్ అని కొనేయడం కాదు.. ఒక్కసారి డీటైల్డ్‌గా అన్నీ చెక్‌ చేసుకోవాలి. లేదంటే చెరుకుపల్లిలో మీ చీటీ చిరిగిపోతుంది.


అగ్రికల్చర్ ల్యాండ్‌లో లేఔట్ వేయాలంటే ముందు నాలా కన్వర్షన్ చేయాలి. ఆ తర్వాత రూల్స్ ప్రకారం ఓపెన్‌ స్పేస్‌ వదిలి, రోడ్లు వేసి ప్లాట్లు విడగొట్టి.. డ్రైనేజీ వేసి DTCPకి దరఖాస్తు చేసుకోవాలి. DTCP తుది అనుమతులు వచ్చిన తర్వాత ప్లాట్లు అమ్మాలి. కానీ సుకేతనలో ఇలాంటి రూల్స్‌ ఏవీ ఫాలో కాలేదు చండ్ర చంద్రశేఖర్‌. సుకేతన లేఔట్‌ను సర్వే నెంబర్లు 238, 239, 242, 243, 244, 245, 246, 247, 248, 249, 250, 263/Pలోని భూముల్లో వేశారు. సాధారణంగా ఎకరాల్లో భూమి కొనుగోలు చేసినప్పుడు అదే రకంగా ధరణిలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రతీ ఎకరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తన పేరిట ధరణిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చండ్ర చంద్రశేఖర్‌. కనీసం 20 గంటలకు తక్కువ కాకుండా రిజిస్ట్రేషన్ చేయాలంటూ నిబంధనలు ఉన్నా.. దాన్ని అస్సలు ఫాలో కాలేదు. మొత్తం 73 బై నెంబర్స్‌తో చండ్ర చంద్రశేఖర్‌ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ధరణిలో కనిపిస్తోంది.

ఇందులో 51 బై నెంబర్స్ లోని భూమి చండ్ర చంద్రశేఖర్ పేరుమీదే ఉంది. మరో 22 సర్వే నెంబర్స్ కంపనీ పేరు మీదకి బదలాయించి నాలా కనెక్షన్ చేయించారు. ఇప్పటికి 150 గజాల నుంచి 2 ఎకరాల వరకు వివిధ బై నెంబర్స్ తో మొత్తం వెంచర్ లోని 10 ఎకరాల భూమి ఇంకా ఆయన పేరిటే ఉంది. వెంచర్‌లో గొప్పగా అందరికీ చూపించే 150 ఏళ్ల మామిడి చెట్టు చుట్టూ ఉన్న ఎకరం స్థలం కూడా ఆయన పేరిటే ఉంది. అంతా న్యాయబద్ధంగా చేస్తుంటే.. అన్ని బై నెంబర్లతో ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయించారు.. నాలా కన్వర్షన్ చేయకుండా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్‌గానే తన పేరిట ఎందుకు ఉంచుకున్నారు..? లే అవుట్ ఉన్న ప్లేస్‌ను చూస్తే ఇప్పట్లో అక్కడ ఎవరూ ఇల్లు కట్టుకునే సాహసం చేయరు. అక్కడ ఏ ప్లాట్ ఎవరిదో ఎవరికీ తెలియదు.. ప్లాట్లన్నీ అమ్ముడయ్యాక మ్యాంగో ట్రీ స్థలంతో పాటు ఇతర కామన్ ఏరియాలనూ అమ్ముకోరని గ్యారెంటీ ఏంటి ? ఈ ప్రశ్నలకే చండ్ర చంద్రశేఖర్‌ సమాధానం చెప్పాల్సి ఉంది.

సుకేతనలో రోడ్లు, డ్రైనేజీ ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. వాటర్‌ ట్యాంక్‌ ఊసు మాత్రం ఎత్తడం లేదు. వెంచర్ క్లోజింగ్ టైమ్ అని చెబుతున్నప్పుడు.. అన్నింటినీ ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు.. లేఔట్‌కు వెళ్లిన వాళ్లకు మాత్రం అందంగా డెవలప్‌ చేసిన పార్క్ ఒక్కటే కనిపిస్తుంది. దాన్ని, 150 ఏళ్ల మామిడి చెట్టును చూపించి మాయ చేస్తున్నారు చండ్ర చంద్రశేఖర్‌. సుకేతన లేఔట్‌కు భూములు కొన్న సర్వే నెంబర్లలో ఇంకా రైతుల పేరిట 70 ఎకరాల పొలం ఉంది. సాధారణంగా ధరణిలో సర్వేనెంబర్లతో మ్యాపింగ్ ఉంటుంది. చండ్ర చంద్రశేఖర్.. 73 బైనెంబర్స్‌తో ల్యాండ్‌ను రిజిస్ట్రేషన్లు చేయించినప్పటికీ దాన్ని మ్యాపింగ్ మాత్రం చేయించలేదు. దీంతో.. డాక్యుమెంట్ల ఆధారంగా ఏ స్థలం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కొన్ని రోజులయ్యాక ఎవరైనా ఆ సర్వేనెంబర్‌లో భూమి మాదే అంటూ లిటిగేషన్ పెడితే.. అక్కడ ప్లాట్లు కొన్న కస్టమర్లు నిలువునా మునగాల్సిందే.

సుకేతన ఫేజ్ 1 లో చాలా ప్లాట్స్ అమ్ముడు పోయాయని చెప్పుతారు. ఫేజ్ 2 లోనే ఉన్నాయని అంటారు. మొత్తం 460 ప్లాట్స్. ఫేజ్ -1 లో 370 ప్లాట్స్ కు గాను 70 మాత్రమే ఉన్నాయని అంటారు. కాని అధికారికంగా అమ్మింది 30 ప్లాట్స్ మాత్రమేనని రిజిస్ట్రేషన్ శాఖలో చూపిస్తోంది. ఇలా కొనుక్కున్నవాళ్లలో ఎక్కువమంది సినిమా ఇండస్ట్రీ వాళ్లే. అందులో ఒక్కరు కూడా సైట్‌కు వెళ్లి చూసి కొన్నవాళ్లు కాదనే తెలిసిపోతోంది. లేఔట్‌ను పూర్తిస్థాయిలో డెవలప్‌ చేసేవరకూ కొన్ని ప్లాట్లను మార్టగేజ్ చేసి ఉంచాలి. కానీ ఆప్లాట్లను కూడా అమ్మకానికి పెట్టేశారు చండ్ర చంద్రశేఖర్‌. అంతటితో ఆగలేదు.. సోషల్ ఇన్‌ఫ్రాలో భాగంగా స్కూల్‌కోసం కేటాయించిన స్థలాన్ని వాస్తవానికి లేఔట్లోని ప్లాట్ ఓనర్లతో సొసైటీని ఏర్పాటు చేసి.. సోషల్‌ ఇన్‌ఫ్రా కోసం కేటాయించిన స్థలాలన్నింటినీ ఆ సొసైటీ పేరిట బదలాయించాలి. దాన్ని సొసైటీ లీజుపై ఎవరికైనా కేటాయించి, వచ్చే డబ్బును లేఔట్ అభివృద్ధి కోసం, మెయింటెనెన్స్‌ కోసం వాడుకోవచ్చు. కానీ సొసైటీతో సంబంధం లేకుండానే స్కూల్ కోసం కేటాయించిన 2 ఎకరాల ఆ స్థలాన్ని కూడా అమ్మేస్తున్నారు. కావాలంటే తక్కువ రేటుకే ఇస్తాం కొనుక్కోండంటూ స్వర్గసీమ ఎగ్జిక్యూటివ్ చెబుతున్నాడు.

బ్లాక్‌లో డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎగ్గొడుతున్నాడన్నారు. మరి దీనిమీద అధికారులు ఏం చేస్తున్నారు.. అసలు రెరా ఉన్నదెందుకు.. కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకోవడానికా.. నిబంధనలకు విరుద్ధంగా ఇంత జరుగుతుంటే ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు..? ఆడంబరంగా కనిపిస్తూ.. పూటకో గెటప్‌తో టీవీల్లో ప్రత్యక్షమవుతూ చండ్ర చంద్రశేఖర్‌ ఇస్తున్న యాడ్స్‌ వెనుకున్న సుకేతన స్టోరీ ఇది. మరి అక్కడ స్థలాన్ని కొనుక్కుంటే లాభమా.. నష్టమా.. మీరే ఆలోచించుకోండి. పైసాను పెట్టుబడిగా పెట్టుకునే ముందు మీకు లాభం ఉందో లేదో తేల్చుకోండి. ఒక్కసారి డబ్బులు కట్టేశాక.. బాధపడితే మాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే స్వర్గసీమలో ప్లాట్ కొనే ముందు పాలేంటో నీళ్లేంటో తెలుసుకోండి.

.

.

Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×