EPAPER
Kirrak Couples Episode 1

AP Politics : ఏపీలో ఎన్నికల పూనకాలు లోడింగ్.. 2024 ఎవరికి విజయనామ సంవత్సరం..?

AP Politics : ఏపీలో ఎన్నికల పూనకాలు లోడింగ్.. 2024 ఎవరికి విజయనామ సంవత్సరం..?

AP Politics : ఏపీలో ఎన్నికల పూనకాలు లోడింగ్ అవుతున్నాయి. కొత్త ఏడాది ఎంట్రీతోనే ఎన్నికలనూ తీసుకొస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పొలిటికల్ ఫైటింగ్ కీ ఫ్యాక్టర్ గా మారింది. ఏపీ భవిష్యత్ కు దశ దిశను నిర్దేశించేది ఇదే కొత్త సంవత్సరం. మరోవైపు రాజకీయ పార్టీల భవిష్యత్ కు కీలకంగా ఈ ఎన్నికలు ఉండడంతో అందరూ అలర్ట్ అవుతున్నారు. అటు ఏపీ ప్రజలకూ ఈ ఎలక్షన్లు కీలకంగా మారుతున్నాయి. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలిపే సంవత్సరం కూడా ఇదే.


కొత్త ఏడాదిలో ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు… గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయన్నది కీలకంగా మారుతోంది. సంక్షేమానికి జై కొడుతారా… మార్పు కోరుకుంటారా? అన్నది కూడా తేలిపోనుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీ ప్రజలకు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎంత ముఖ్యమో.. రాజకీయ పార్టీల భవిష్యత్ కూ అంతే కీలకంగా మారిపోయాయి. అందుకే ఈ సారి ఎలక్షన్లు టగ్ ఆఫ్ వార్ అవుతున్నాయి.

ఏపీలో ఎన్నికల పూనకాలు లోడింగ్ అవుతున్నాయి. కొత్త ఏడాది ఎంట్రీతోనే ఎన్నికలనూ తీసుకొస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పొలిటికల్ ఫైటింగ్ కీ ఫ్యాక్టర్ గా మారింది. ఏపీ భవిష్యత్ కు దశ దిశను నిర్దేశించేది ఇదే కొత్త సంవత్సరం. మరోవైపు రాజకీయ పార్టీల భవిష్యత్ కు కీలకంగా ఈ ఎన్నికలు ఉండడంతో అందరూ అలర్ట్ అవుతున్నారు. అటు ఏపీ ప్రజలకూ ఈ ఎలక్షన్లు కీలకంగా మారుతున్నాయి. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలిపే సంవత్సరం కూడా ఇదే.


సంక్షేమ పథకాలతో వరుసగా రెండోసారి గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్, జనం మార్పు కోరుకుంటున్నారన్న ఆశతో టీడీపీ ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. ఈ కొత్త సంవత్సరం ఏపీ దశ దిశను డిసైడ్ చేయబోతున్నాయి. అటు ప్రజలకు, ఇటు పార్టీలకు ఫలితం చాలా కీలకంగా మారుతోంది. పేదరికం లేని సమాజమే తన నవరత్నాల లక్ష్యమని జగన్ అంటున్నారు. 2047 విజన్ తో చంద్రబాబు దూసుకొస్తున్నారు. విజయం ఎవరిదన్నది జనం చేతుల్లోనే ఉంది. జనం మార్పు కోరుకుంటారా.. సంక్షేమం కంటిన్యూ కావాలనుకుంటారా అన్నది ఈ ఏడాది తేలిపోనుంది.

2024 ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ పోటాపోటీగా తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి. మళ్లీ అధికారం చేపట్టేందుకు అధికార వైసీపీ ఇప్పటికే యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ సైతం అధికారం పార్టీని ఓడించే వ్యూహాలను రచిస్తోంది. మరోసారి అధికారంలోకి వస్తే తమకు తిరుగులేదనే ధీమాతో వైసీపీ అధినేత జగన్ ఉంటే.. ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ కష్టమే అనే భావనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు.

అటు కేంద్రంలో కీలకంగా ఉన్న బీజేపీ ఏపీలో తన అదృష్టాన్ని పొత్తుల రూపంలో పరీక్షించుకోబోతోందా అన్నది కీలకంగా మారింది. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పట్టు పెంచుకున్నారు. టీడీపీతో కలిసి వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ కూడా అయ్యారు. ఈ ఏడాది మేలోపు జరగాల్సిన ఎన్నికలకు ఈసారి నోటిఫికేషన్ గతంలో కంటే ముందుగానే రిలీజ్ అవుతుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను షురూ చేశాయి. వైసీపీ గెలుపు లెక్కలు ఏంటి.. టీడీపీ, జనసేనల ఉమ్మడి వ్యహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

వై నాట్ 175 అని ఏపీ సీఎం జగన్ అంటున్నారు. ఆ ప్రకారమే వ్యూహాలకు పదును పెడుతున్నారు. సాధారణంగా వైఎస్ జగన్ ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు వదిలిపెట్టరన్న టాక్ పొలిటికల్ సర్కిల్సో ఉంది. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి దాన్ని అధికారంలోకి తీసుకువచ్చే వరకు జగన్ చాలా పట్టుదలగా వ్యవహరించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ చాలా ఎత్తుగడలే వేస్తున్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి వై నాట్ 175 అనే నినాదాన్ని నిజం చేసే విధంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందనే విషయాన్ని జగన్ గుర్తించారు. అందుకే ఇప్పుడు చాలా మంది సెగ్మెంట్లు మారుస్తున్నారు. ఇది పార్టీలో ఇప్పటికిప్పుడు అలజడి రేపినా భవిష్యత్ లో అంతా సర్దుకుంటుందని మెజార్టీ మార్క్ దాటేందుకు ఈ ప్రయోగాలు చేయాల్సిందేనని డిసైడ్ అయ్యారంటున్నారు.

ఇప్పటికే సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు జగన్. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పుకు శ్రీకారం చుట్టారు. జనవరి 10 నాటికి ఈ ప్రక్షాళన పూర్తి చేసి, మొదటి లిస్టులో కొందరి పేర్లు ప్రకటించేసి పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక చేపడుతున్నారు. కొన్ని కీలకమైన స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ఎంపిక తర్వాత మార్పు చేర్పులు చేపట్టే ఉద్దేశంతో ఉన్నారు. జనవరి 20 నాటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారంటున్నారు.

ఫిబ్రవరి చివరి వారంలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సీఎం జగన్ అలర్ట్ అవుతున్నారు. జగన్ జనాల్లోకి రావడం లేదని, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కే పరిమితం అవుతున్నారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో త్వరలోనే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు విస్తృతంగా చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే భారీ సభలు నిర్వహించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసిన నవరత్న సంక్షేమ పథకాలు, నిర్ణయాలే తమను మళ్ళీ అధికారానికి దగ్గర చేస్తాయన్న నమ్మకంతో జగన్ ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరాలని సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చి చెబుతున్నారు. గెలిచే వారికే టిక్కెట్లు అని ఇప్పటికే స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే దఫదఫాలుగా సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అటు ఈసారి కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాలని వైసీపీ డిసైడ్ అయింది. అయితే అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు ఎంత వరకు కలిసి వస్తుందన్నది కీలకంగా మారింది. రాష్ట్రంలో దాదాపు 90శాతం కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, అందుకే జనం తమను గెలిపిస్తారన్న ధీమాతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో జగన్ వ్యూహం లబ్ది చేకూరుస్తుందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. మరి ఈ 2024 జగన్ పార్టీకి మరో విక్టరీని కట్టబెడుతుందా.. నమ్ముకున్న సంక్షేమ పథకాలు ఓట్లుగా మారుతాయా అన్నది చూడాల్సిందే.

Related News

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలైయేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

Big Stories

×