EPAPER

Janatha Garage : ఈ ఆదివాసి గూడెం.. ప్రపంచానికే ఆదర్శం..

Janatha Garage : ఈ ఆదివాసి గూడెం.. ప్రపంచానికే ఆదర్శం..

Janatha Garage : 18 ఏళ్లు నిండితే చాలు కులం మతం లింగవివక్షలేకుండా ఆస్తులు అంతస్థుల భేదాలు లేకుండా భారత పౌరులందరికి సరి సమానంగా దక్కే అపూర్వమైన హక్కు ఓటుహక్కు.. ఆ ఓటు హక్కుని కొందరు లైట్ గా తీసుకున్నా.. ఇంకొందరు మాత్రం విలువైనదిగానే భావిస్తారు.


వాజేడు మండలం పెనుగోలు ఆదివాసి గూడెం మైదాన ప్రాంతాలకు చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లడం మామూలు విషయం కాదు.. అనేక సవాళ్లతో నిండిన అటవీ మార్గంలో గంటల తరబడి అవిశ్రాంతిగా శ్రమించాలి. అందుకే రేకలువారే సమయానికల్లా ప్రయాణం మెదలు పెడితేనే సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేసరికి వారిని కలవగలం.. చీకుపల్లి అటవిమార్గం అంటే బోగతా జలపాతానికి వరద నీరు పోయే వాగులు, వంకలు అన్ని ఈ దారిలో మనకు తగులుతాయి.. వర్షాకాలం అయితే వాగులు ఉగ్రరూపంతో ప్రవహిస్తుంటాయి. కాబట్టి అసలు మనం పెనుగోలు ఆదివాసి గూడెంకి వెల్లడం దాదాపు అసాధ్యం. ప్రస్తుతం వానలు లేనందున వాగుల ఉధృతి లేదు . అలా నాలుగైదు చోట్ల చిన్నా పెద్దా వాగులను ..ధరుల అంచులను తాకుతు సాగే జలపాతాలను దాటుకుంటు వెళ్లాలి. వీటికి తోడు మోకాళ్ల పర్వతం లాంటి గుట్టల్లో ఉన్న రాళ్లదారులు ఎక్కాలి. అలా సాగితేనే వారిని కలవగలం.

వారిని కలవాల్సినంత ఆవష్యకత ఏంటి అందరిలానే వారు ఓటర్లే కదా అనుకోవచ్చు. కాని వారు ఎందరికో ఆదర్శవంతులు ..అక్షరాస్యతలో వెనకబాటు తనంలో ఉన్నా ప్రజాస్వామ్యంపై ఇంకా నమ్మకంతో బతుకుతున్నవారు. అందుకే ప్రతి ఎన్నికల వేళ ఎన్నో కష్టనష్టాలకు ఓనర్చి ఓటు వేస్తారు. పెనుగోలు గుట్టలు తెలంగాణ , చత్తీస్ ఘడ్ మధ్యన ఉన్న సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఇక్కడ మావోయిస్టుల కదలికలు కూడా ఉంటాయి. మావోయిస్టులు సైతం ఎన్నికలు బహిష్కరించండి అని పిలుపునిచ్చారు. కాని ఏ బెదిరింపులకు నెరవక ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి మరీ వచ్చి వాజేడు లేదా గుమ్మడి దొడ్డిలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసి వెళ్తారు . అందుకే వారి చైతన్యం కొందరిలో నైనా స్పూర్తి నింపుతుందని వారిని కలిసే ప్రయత్నం చేసింది బిగ్ టీవి టీం.


అడవిలో దారిచూపడానికి కొంత మంది ఆదివాసి యువకుల సహకారంతో పెనుగోలు ఆదివాసిలను కలవడానికి దండకారణ్యంలో ప్రయాణం సాగించింది. చూసారుగా మనం ప్రయాణించి వచ్చిన దారి ఎలా ఉందో.. ఇంత దూర భారాలను లెక్కచేయకుండా వీరు ప్రతి ఎన్నికల వేల ఓటుహక్కు వినియోగించుకుటారు. ఇక్కడికి ప్రచారానికి ఎవరు రారు ఎటువంటి స్పష్టమైన హమీలు ఉండవు . నిరక్షరాస్యత కారణంగా కొందరికైతే అసలు బరిలో ఉన్న అభ్యర్దులు కూడా తెలియదు. తమ ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తమ నియోజకవర్గం పేరు కూడా తెలియదు. అంత అమాయకత్వం. అయినా ఓటు వేస్తారు . ఎందుకంటే తాము బతికున్నాం అని నిరూపించుకోవడానికి ఓటేస్తారు. గుట్టల్లో ఒక గూడెం ఉంది. అక్కడ ఓటర్లు ఉన్నారని ప్రభుత్వానికి సమాజానికి తెలియాలని ఓటు వేస్తారు . ఓటనేది వేయకుంటే అడవుల్లో ఉన్న తాము చచ్చిపోయిన వారి గాటున కట్టేస్తారనే భయంతో ఓటు వేస్తారు. ఈ సారి కాకున్నా మల్ల సారైనా తమ భాదలు తీరక పోతాయా.. భవిష్యత్ మారకపోతదా.. అనే నమ్మకంతో ఓటేస్తారు. ఓటు గురించి ప్రశ్నిస్తే వారి నుండి వచ్చిన సమాధానాలు ఇవి.

ఎన్నికల రోజు వచ్చిందంటే చాలు వీళ్లకు అదో ప్రజాస్వామ్య జాతరగా భావిస్తారు. అడవి మార్గంలో కిలో మీటర్ల కొద్ది నడవాలి. కాబట్టి ఉదయానే కొందరు తిని బయలుదేరతారు. మరికొందరు ఆలస్యం అవుతుందేమో వెళ్లే సరికి పోలింగ్ అయిపోతుందేమోనని సద్ది కట్టుకొని బయలుదేరతారు. వాగుల దగ్గర సద్ది తిని ఓటేసి వస్తారు. ప్రస్తుతం ఈ పెనుగోలు గూడెంలో గతంలో 70 ఓటర్లు ఉండేవారు. కాని చాలా మంది గుట్టదిగి మైదాన ప్రాంతాలకు వెళ్లి పోయారు. దీంతో ప్రస్తుతం 30 మంది ఓటర్లు ఉన్నారు. కానీ కనీసం ఇక్కడ పోలింగ్ బూత్ అనేది లేకపోవడంతో ఎన్నికల ప్రక్రియలో తాము భాగస్వాములం కావాలన్న సంకల్పంతో కష్టాల కోర్చి వచ్చి ఓటు వేస్తారు. వీరు ఓటు వెసి రావాలంటే.. పోను 18 కిలోమీటర్లు రాను పద్దెనిమిది కిలోమీటర్లు అంటే మెత్తం 36 కిలోమీటర్లు నడవక తప్పని పరిస్థితి ఉంది. వీరే కాదు తెలంగాణలో చాలా వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితే ఉంది.

ఆదివాసి ఏజెన్సీ ప్రాంతాల్లో రకరకాల కారణాలు చెప్పి పోలింగ్ బూత్ లు పెట్టక పోవడాన్ని తప్పుపడుతున్నారు సామాజిక వేత్తలు. గుజరాత్ లోని గిర్ అటవి ప్రాంతంలో ఒక్క ఓటరు కోసం పోలింట్ బూత్ పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ లో 16 మంది ఓటర్లు ఉన్నా పోలింగ్ బూత్ ఏర్పాటు చేసారు. కాని ఏజెన్సి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఓటర్లు ఉన్నా ఎందుకు పోలింగ్ బూత్ పెట్టరని ప్రశ్నిస్తున్నారు. వారి హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ కు లేదా అంటున్నారు. ప్రతి ఓటరు విలువైన వారే.. ఒక్క ఓటరునూ వదలొద్దు అని చెప్పే ఎన్నికల సంఘం నినాదం సాకారం కావాలంటే పోలింగ్ కేంద్రాలను ఇలాంటి ప్రాంతాల దరికి చేర్చాలంటున్నారు.

ప్రతిఏటా ఎన్నికల వేల ఓటు హక్కుపై చైతన్యం తెచ్చేందుకు పెద్ద పెద్ద ప్రముఖులతో ఎన్నికల కమీషన్ ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రచారం చేయిస్తుంది. పట్టణాల్లో నగరాల్లో కూడా ఓటరు నమోదు మేలాలను పెడుతుంది. కాని అక్షరాస్యతలో ఆధునికతలో ముందంజలో ఉన్న నగరాలు పోలింగ్ శాతంలో అట్టడుగున నిలుస్తున్నాయి. దానికి నిదర్శనమే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 2014 ఎన్నికల వేల 54 శాతం పోలింగ్ శాతం నమోదు అయితే 2018 ఎన్నికల వేల 50 శాతం నమోదు కావడం దీనికి కారణం నిర్లక్ష్యం. నేను ఓటేస్తే సమాజం మారుతుందా.. అనే అలసత్వం అందుకే పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ సంస్దలకు సెలవిచ్చినా ఎందరో పోలింగ్ కు దూరంగానే ఉంటున్నారు. కాని అడవుల్లో ఉన్న వీరు మాత్రం ఓటు వినియోగించుకోకుంటే అదో పెద్ద తప్పు అన్న భావనతో ఉంటారు. ఎటువంటి ప్రలోబాలకు గురి కాకుండా స్వచ్చందంగా ఓటు వేస్తునే వస్తుంటారు .

వీళ్లకు లేవా కష్టాలు.. వీళ్లకు లేవా సమస్యలు అంటే ఉన్నాయి. తాగునీరు లేదు చెలిమలు వాగుల నీళ్లే దిక్కు. విద్య లేదు వైద్యం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఒక్క రేషన్ బియ్యం తప్పా ఎటువంటి కనీస మౌళిక సదుపాయాలు వీరికి అందుబాటులో లేవు గత పాలకులు వీరికి అనేక హమీలు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి మైదాన ప్రాంతంలో 2 ఎకరాల పొలంతో పాటు ఇల్లు ఇస్తాం అన్నారు. దీంతో ఆ మాట నమ్మిన కొన్ని కుటుంబాలు గుట్ట కింద గ్రామాలకు పోయారు. కాని ప్రభుత్వం ఇచ్చిన హమీలు నీటిమూట కాగా 15 ఏళ్లుగా కూలీ నాలీ చేసుకొని బతుకుతున్నారు. దీంతో గుట్ట మీద బతకడానికి భూమి అయినా ఉందనే బరోసాతో చాలా మంది గుట్ట దిగడానికి ఇష్ట పడక పిల్లా జెల్లాతో కష్టమో నస్టమో అడవి దాపునే బతుకుతున్నారు. అన్ని సమస్యలని దిగమింగుకుంటు కూడా ఎవరిపై ద్వేషం లేకుండా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఉన్నారు. ఇక్కడి యువత కూడా వారి పెద్దల బాటలోనే నడుస్తుంది. ఓటు వేయడం మన బాధ్యత అని చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు.

బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నా.. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి సారి పాలు పంచుకుంటూ ఓటుహక్కు వినియోగించు కుంటూ .. అభివృద్ది కోపం ఆశగా ఎదురు చూస్తున్నారు ఆదివాసీలు చదువు కున్నోళ్లలో ఎంతోమంది ఓటు వేయకున్నా వారి ప్రాంతాల్లో అభివృద్ది జరుగుతుంది. మరి ప్రతి ఎన్నికల్లో వ్యయప్రయాసలకు ఓర్చుకొని వెళ్లి మరీ ఓటు వేసి వస్తున్నా మేమెందుకు అభివృద్ది చెందడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయినా తాము ఎవరిని తప్పుపట్ట బోమని .. తమ బతుకుల్లో ఏ నాటికైనా ఓటు దారిచూపుతుందనే ఆశతో ఉన్నామంటున్న ఆదివాసీలు నిజంగా ఎందరికో ఆదర్శప్రాయులు.

Tags

Related News

Tirumala Laddu Politics: లడ్డూ కాంట్రవర్సీ.. దేవదేవుడి ప్రసాదంపైనే ఇన్ని రాజకీయాలా ?

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Big Stories

×