EPAPER

Hair Loss: ఈ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే బట్టతల రావడం ఖాయం!

Hair Loss: ఈ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే బట్టతల రావడం ఖాయం!

Hair Loss: జుట్టు అందరికి ఇష్టమే.. పురుషులు బట్టతల లేకుండా జట్టు ఒత్తుగా ఉండాలని కోరుకుంటే.. స్త్రీలు పొడవైన ఒత్తైన జుట్టును ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలుతుంది. దీనికి ప్రధాన కారణం మీ అలవాట్లే తెలుసా.. రోజూ డ్రింక్స్ తాగడం వలన జుట్టురాలి బట్టతల బారిన పడతారని న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం చెబుతోంది. కొన్ని రకాల డ్రింక్స్ తాగే పురుషుల్లో జట్టు రాలిపోయే సమస్య అధికంగా ఉందని వెల్లడించింది.


బీజింగ్‌లోని సింఘావా యూనివర్సిటీ జుట్టు రాలడంపై ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ద్వారా ఎనర్జీ డ్రింక్స్ లేదా చక్కెర పానీయాలు తాగే అలవాటున్న వారిలో జుట్టు రాలడం అధికంగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ ప్రభావంతో 13 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారు దీని బారిన పడుతారని వెల్లడించారు.

ఈ పరిశోధనకు బీజింగ్‌లోని సింఘావా యూనివర్సిటీ 1000 మంది పురుషులను తీసుకుంది. వారికి ముందుగా వారానికి 3 లీటర్లు డ్రింక్స్ తాగాలని కండీషన్ పెట్టింది. పరిశోధన అనంతరం రోజుకు ఒకటి కంటే ఎక్కువ డ్రింక్స్ తాగిన వ్యక్తికి జుట్టు రాలిపోయే ప్రమాదం 42 శాతం ఎక్కువుగా ఉందన్నారు.


అలానే తక్కువ కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తినేవారిలో కూడా జుట్టు రాలడంతోపాటు ఆందోళనకు గురవుతున్నారని అధ్యయనంలో తెలింది. ఫాస్ట్‌ఫుడ్ వల్ల ఊబకాయం, కేన్సర్ వంటి వ్యాధులు వస్తాయని పరిశోధకులు వెల్లడించారు.

జట్టు బలహీనంగా ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టును బలేపోతం చేయొచ్చు. వారానికి రెండు సార్లు తల స్నానం చేయాలి. జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు అయితే నిమ్మరసం పెరుగు ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. జట్టు దట్టంగా పెరగాలంటే ఎగ్‌లోని తెల్లసొనను జుట్టుకు ఆప్లై చేయాలి.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×