EPAPER

Kim Jong UN : న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికా, దక్షిణ కొరియాను హెచ్చరించిన నియంత

Kim Jong UN : ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటోంది. అందరూ మిత్రవులు, శత్రువులని భేదభావాలు లేకుండా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికా, దక్షిణ కొరియా దేశాలను హెచ్చరించాడు.

Kim Jong UN : న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికా, దక్షిణ కొరియాను హెచ్చరించిన నియంత

Kim Jong UN : ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటోంది. అందరూ మిత్రవులు, శత్రువులని భేదభావాలు లేకుండా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికా, దక్షిణ కొరియా దేశాలను హెచ్చరించాడు.


ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకారం.. డిసెంబర్ 31 సాయంత్రం కిమ్ జాంగ్ ఉన్ రాజధాని పొంగ్ యాంగ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా దేశ సైన్యాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు కిమ్ మాట్లాడుతూ.. ”అమెరికా, దక్షిణ కొరియా రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. వారి సైన్యాన్ని నాశనం చేయాలి. ఒకవేళ వారితో యుద్ధమే చేయాల్సివస్తే ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. దక్షిణ కొరియాపై అవసరమైతే అణ్వాయుధాలతో దాడి చేయాలి” అని చెప్పారు.

కొన్ని రోజుల క్రితమే కిమ్ జాంగ్ ఇలాంటి వ్యాఖ్యాలే చేశారు. ఉత్తర కొరియా మూడు గూఢాచర్య ఉపగ్రహాలను కొత్త సంవత్సరంలో లాంచ్ చేయనుంది. అలాగే మరిన్ని న్యూక్లియర్ ఆయుధాలు, మిసైల్ దాడి చేసే డ్రోన్లను తయారు చేయాలని కిమ్ ఆదేశించారు. శత్రు సైన్యాలు ఉత్తర కొరియావైపు అడుగుల వేస్తే ఏమాత్రం సంకోచించకుండా వారిని హతమార్చాలని చెప్పారు.


స్పందించిన దక్షిణ కొరియా ప్రెసిడెంట్

ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జాంగ్ వ్యాఖ్యలపై దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్ స్పందించారు. సోమవారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యూన్ సుక్ మాట్లాడుతూ.. ఇకపై ఉత్తర కొరియా ఎటువంటి సంధి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలకు సమాధానంగా మా వద్ద సైనిక బలం, ఆధునిక మిసైల్స్ ఉన్నాయి. వీటిని మరింత బలోపేతం చేస్తామన్నారు.

Kim Jong UN, warning, destroy, America, South Korea, New Year celebrations, North Korea, Dictator, Yoon suk Yeol, Nuclear,

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×