EPAPER

Best Test XI of 2023 : వరల్డ్ బెస్ట్ IX.. రోహిత్, కోహ్లీలకు దక్కని చోటు..

Best Test XI of 2023 : వరల్డ్ బెస్ట్ IX.. రోహిత్, కోహ్లీలకు దక్కని చోటు..

Best Test XI of 2023 : క్రికెట్ ఆస్ట్రేలియా 2023 సంవత్సరానికి.. ఆ ఏడాదిలో ఎవరు బాగా ఆడారో చూసి, అన్ని దేశాల నుంచి 11మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. వన్డే వరల్డ్ కప్ నెగ్గిన కమిన్స్‌ను టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఎంపిక చేసింది. అయితో ఈ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు. భారత క్రీడాభిమానులు ఇది నిజంగా అవమానమేనని అంటున్నారు. కావాలనే వారిద్దరినీ తప్పించి, వ్యూహాత్మకంగా భారత జట్టులో వారికి స్థానం లేకుండా చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  


ఇంతకుముందు ప్రముఖ కామెంటేటర్ హర్షభోగ్లే సైతం రోహిత్, విరాట్ కి తన జట్టులో స్థానం కల్పించలేదు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ప్రకటించిన 11మంది జట్టులో కాంబినేషన్ బాగాలేదని అన్నారు. ఎందుకంటే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్  స్టువర్డ్ బ్రాడ్  ను ఎంపిక చేశారు. అలాగే 2023లో అతి తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ కి అవకాశం ఇచ్చారు. మరిదెక్కడి లెక్కో అర్థం కాలేదని అంటున్నారు.

ఇంతకీ క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ లో ఎవరిని సెలక్ట్ చేసిందని అంటే, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా నుంచి ఒకరు, భారత్ నుంచి ఇద్దరు, పాకిస్తాన్, కివీస్, ఐర్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికాల నుంచి ఒకొక్కరిని ఎంపిక చేసింది.


క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: భారత్ నుంచి రవీంద్ర జడేజా, అశ్విన్; పాకిస్తాన్ నుంచి ఉస్మాన్ ఖవాజా,  దక్షిణాఫ్రికా పేసర్ రబాడ,  శ్రీలంక నుంచి కరుణరత్నే, ఇంగ్లాండ్ నుంచి జో రూట్,  వెటరన్ ప్లేయర్  స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్,  ఆస్ట్రేలియా నుంచి కమిన్స్ , కివీస్ నుంచి కేన్ విలియమ్సన్, ఐర్లాండ్ వికెట్ కీపర లోర్కన్ టక్కర్‌ లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×