EPAPER

Tirupati : బిర్యానీ తిన్న వ్యక్తికి.. గిఫ్ట్ గా రూ .7 లక్షల కారు

Tirupati : బిర్యానీ తిన్న వ్యక్తికి.. గిఫ్ట్ గా రూ .7 లక్షల కారు

Tirupati : పండగైనా , పెళ్ళైనా, పుట్టిన రోజైనా , పార్టీ అయినా.. ఏదైనా స్పెషల్ డే అయితే చాలు కేక్ కంటే ముందు బిర్యానీనే కావాలంటారు. అది లేనిదే పార్టీ ఉండదు. పార్టీ అంటే బిర్యాని.. బిర్యాని అంటే పార్టీ.. అదీ ఇప్పుడు బిర్యానీకి ఉన్న క్రేజ్. ప్రతి ఒక్కరూ నోటి రుచి కోసం బిర్యానీని కోరుకుంటున్నారు. గతేడాదిలో బిర్యానీల కోసం చాలా ఖర్చు చేసి ఉంటారు కదా. మరి బిర్యానీ మీకెప్పుడైనా లాభం తెచ్చిపెట్టిందా ? ఒక వ్యక్తికి బిర్యానీనే వరంలా మారింది. ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాలా రూ.7 లక్షల విలువైన కారును తన ఇంటికి తీసుకొచ్చింది. ఇంతకీ అదెలా జరిగిందో తెలుసుకుందాం.


తిరుపతిలో ఓ హోటల్ యజమాని కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని లక్కీ డ్రా నిర్వహించాడు. 2023 సెప్టెంబర్ లో తమ హోటల్ లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ ఇచ్చారు. 23 వేల మంది కస్టమర్లకు పైగా కూపన్లు అందించారు. ఆ కూపన్లకు సంబంధించిన లక్కీ డ్రా డిసెంబర్ 31న నిర్వహించారు. రోబో హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, తన భార్య నీలిమ డిసెంబర్ 31న లక్కీ డ్రా తీశారు. అందులో తిరుపతికి చెందిన రాహుల్ అనే వ్యక్తి విజేతగా నిలిచి.. రూ. 7 లక్షల విలువైన నిస్సాన్ మాగ్నైట్ కారును బహుమతిగా గెలుచుకున్నాడు. బిర్యానీ లక్కీ డ్రా లో ఇంత విలువైన కారు దక్కడంతో రాహుల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×