EPAPER

New Year 2024: జనవరి 1 వేడుకలకు ఆ దేశాలు దూరం.. ఎందుకో తెలుసా ?

New Year 2024: జనవరి 1 వేడుకలకు ఆ దేశాలు దూరం.. ఎందుకో తెలుసా ?

New Year 2024: కాలగర్భంలో మరో ఏడాది కరిగిపోయింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి అందరూ సిద్దమయ్యారు. కానీ జనవరి 1న ఈ వేడుకలు జరుపుకోని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో జనవరి 1న కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. కానీ వేర్వేరు క్యాలెండర్లు, సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తున్న కారణంగా కొన్ని దేశాలు మాత్రం జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటాయి.


ఇలాంటి దేశాల్లో అత్యంత ప్రధానమైనది చైనా. చైనాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవు. వారి క్యాలెండర్ల ప్రకారమే అక్కడి ప్రజలు కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటారు. లూనార్ క్యాలెండర్‌ను చైనా అనుసరిస్తుంది. ఆ మేరకు జనవరి 21-ఫిబ్రవరి 20 తేదీల మధ్య డ్రాగన్ దేశం కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటుంది.

దీనినే స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా వ్యవహరిస్తారు. ఆ రోజు ఎక్కడెక్కడో ఉన్న కుటుంబసభ్యులు అందరూ ఒక్క చోటుకి వచ్చేస్తారు. ఆనందోత్సాహాల నడుమ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు. ఈ సందర్భంగా ఐకమత్యం ప్రాముఖ్యాన్ని చాటి చెబుతూ కుటుంబం మొత్తం కలిసి విందు ఆరగిస్తుంది.


భిన్న సంస్కృతులకు మన దేశం ఆలవాలం. ఆ విభిన్నత కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో నయా సాల్ వేడుకలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉగాది పర్వదినాన కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తారు. అలాగే పంజాబ్‌లో వైశాఖి, అసోంలో బిహు, ఒడిసాలో మహా బిషుభ సంక్రాంతి రోజు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. ఈ పండగలన్నీ జనవరి నుంచి ఏప్రిల్‌లోపు వేర్వేరు నెలల్లో జరుపుకుంటారు.

థాయ్‌లాండ్‌లో ఏప్రిల్ నెలలో కొత్త సంవత్సరం మొదలవుతుంది. సొంక్రాన్(Songkran) పండుగనాడే థాయ్ ప్రజలకు కొత్త సంవత్సరం వేడుకలు ఉంటాయి. నూతన సంవత్సరంలో గత ఏడాది కష్టాలన్నీ కొట్టుకుపోతాయన్న నమ్మకంతో ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటారు. అందుకే దీనిని వాటర్ ఫెస్టివల్‌గానూ వ్యవహరిస్తారు.

ఇస్లామిక్ క్యాలెండర్ను అనుసరించే దేశాలు హిజ్రి న్యూ ఇయర్‌ను జరుపుకుంటాయి. చాంద్రమాన నెలల ప్రకారం ప్రతి ఏడాదీ కొత్త సంవత్సరం రోజు మారుతుంటుంది. మక్కా నుంచి మదీనాకు మహ్మద్ ప్రవక్త తరలివెళ్లిన సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ప్రార్థనలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విషయంలో రష్యా ప్రత్యేకం. ఆ దేశంలో ఏటా రెండుసార్లు ఈ వేడుకలను జరుపుకొంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1న, జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించుకోవడం విశేషం.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×