EPAPER

YSRCP: 2023లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది ? జగన్ కు షాక్ తప్పదా ?

YSRCP: 2023లో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది ? జగన్ కు షాక్ తప్పదా ?

YSRCP: ఏపీ రాజకీయాలలో ఈ ఏడాది అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు అధికార.. ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఈ సంవత్సరం గుర్తుండిపోక మానదు. అయితే అధికార పార్టీ వైసీపీకి మాత్రం 2023 కలిసి రాలేదని చెప్పాలి. ఏ ఎన్నికలు అయిన క్లిన్ స్వీప్ అంటూ.. నినాదాలు చేసే వైసీపీ.. ఊహించని విధంగా ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే బై బై 2023 కా.. వైసీపీకా అని ప్రతిపక్షాలు అపహాస్యం చేస్తున్నాయి.


ముందుగా ఈ ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో ఓటిమి చెందడం వైసీపీకి షాక్ ఇచ్చింది. అది కూడా రాయలసీమ గడ్డలో 2 స్థానాలు ఓడిపోవడం.. సీఎం జగన్ కి నిద్రపట్టకుండా చేసిందని అనడంలో సందేహం అక్కర్లేదు. అలానే అసెంబ్లీ వేదికగా కూడా ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గెలుపొందడం వైసీపీ నేతల్ని నోరెళ్ళబెట్టేలా చేసింది. ఆ ఎన్నికల ఎఫెక్ట్ తోనే.. ఆ తర్వాత మరో 4 గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

ఇక ఇప్పుడు తాజాగా అభ్యర్ధుల ఎంపిక మొదలైన నాటి నుంచి.. చాలా మంది నేతలు అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారం వైసీపీని కుదిపేస్తుంది. రానున్న ఎన్నికల నేపధ్యంలో 60 మందికి బదిలీలు ఉంటాయని.. 20 మంది ఇంటి బాట పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సైతం.. సీఎం జగన్ నిర్ణయాల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇప్పటికే రిలీజ్ అయిన 11 మందిలో పలువురికి స్థాన చలనం కలగగా.. తర్వాత రాబోయే లిస్ట్ ల పట్ల వైసీపీలో అయోమయం నెలకొంది. దీంతో జాబితా విడుదలలో మరింత భారీ జాప్యం జరుగుతుంది. కాగా ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాలోను మార్పులు ఉందనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాకి 3 నుంచి 10 స్థానాల వరకు మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అత్యధికంగా గుంటూరు, అనంతపురం.. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో భారీ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. దీంతో 2024 అంటేనే ఎమ్మెల్యేలు ఉంటామో.. ఊడతామో అని అయోమయంలో ఉన్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×