EPAPER
Kirrak Couples Episode 1

CM Revanth reddy : విద్యాశాఖపై రివ్యూ.. త్వరలో మెగా డీఎస్సీ.. సీఎం ఆదేశం..

CM Revanth reddy : తెలంగాణలోని పంచాయతీల్లో బడి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా.. మారుమూల తండా అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనన్నారు. ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ… చదువు కోసం ఇతర గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని సూచించారు.

విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలని… ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందేనని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి DSC నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు.

ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.

విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటుచేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులను తగిన ఆదేశాలను జారీ చేశారు.

Tags

Related News

Chiranjeevi : గిన్నిస్ రికార్డులో మెగాస్టార్ కి చోటు.. అమీర్ ఖాన్ చేతుల మీదుగా..!

Bigg Boss 8 Day 21 Promo: గెస్ ది సౌండ్ .. కొత్త టాస్క్ తో తికమక పెట్టించిన బిగ్ బాస్..!

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Bigg Boss 8 Day 21 Promo: సెట్ ఆర్ కట్.. రియల్ ఫన్ డే అయ్యిందిగా..?

Bigg Boss: పోటీ లేదు.. టీఆర్పీ రేటింగ్ రాదు.. ఆ తప్పే రిపీట్ కానుందా..?

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

Big Stories

×