EPAPER

New Year Celebrations : ఇక్కడి న్యూఇయర్ వేడుకలు చూసి తీరాల్సిందే..!

New Year Celebrations : ఇక్కడి న్యూఇయర్ వేడుకలు చూసి తీరాల్సిందే..!
New Year Celebrations

New Year Celebrations(Telugu news updates):

మరికొన్ని గంటల్లో మరో సంవత్సరం కాలగర్భంలో కలవనుంది. అదే క్షణంలో మరో కొత్త ఏడాది పురుడుపోసుకోనుంది. పేరుకు ఆంగ్ల సంవత్సరాది అయినప్పటికీ.. మన దేశంలోని కొన్ని నగరాల్లో న్యూఇయర్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ ప్రదేశాలేమిటి? అక్కడి న్యూఇయర్ వేడుకల ప్రత్యేకతలేమిటో మనమూ ఓసారి తెలుసుకుందాం.


వయనాడ్, కేరళ
జలపాతాల గలగలలు, ఆకుపచ్చని సుగంధ ద్రవ్యాల తోటలు, ప్రశాంతమైన వాతావరణంలో కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలనుకునే వారికి కేరళలోని వయనాడ్ మంచి ఎంపిక. గ్రీన్ ప్యారడైజ్( ఆకుపచ్చని స్వర్గం)గా పిలిచే వయనాడ్ పచ్చికభూములపై టెంట్ వేసుకుని ఏకాంతంగా గడిపే క్షణాలు, ఊరికి దూరంగా విసిరేసినట్లుండే రిసార్ట్‌లలో గడిపే ప్రశాంతమైన సమయం న్యూఇయర్ రాకకు కొత్త శోభను తెస్తాయి.

మనాలి, హిమాచల్ ప్రదేశ్
‘వ్యాలీ ఆఫ్ ది గాడ్స్’ (దేవతల లోయ)గా పేరున్న మనాలీ.. డిసెంబరు 31 నాటికి టూరిస్టులతో కిక్కిరిసి పోతుంది. ఆగకుండా కురిసే మంచు, గిలిగింతలు పెట్టే చలిగాలి, నులివెచ్చని అనుభూతినిచ్చే క్యాంప్ ఫైర్స్, అలరించే సంగీత కార్యక్రమాలు, సరదాగా సాగిపోయే పార్టీలు కొత్త సంవత్సర వేడుకల ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. పాత మనాలి కేఫ్‌లలో దొరికే కమ్మని వంటకాలు, అలరించే హిప్పీ సంస్కృతి మీకు జీవితకాలపు అనుభూతిని అందిస్తాయి. ముఖ్యంగా సోలాంగ్ వ్యాలీ, కుఫ్రి ప్రాంతాల్లో మంచుతో నిండిన రోడ్లపై చేసే ప్రయాణాల గురించి ఎంత చెప్పినా తక్కువే.


ఉదయపూర్, రాజస్థాన్
మధ్యయుగాల నాటి రాజపుత్ర వైభవాన్ని నేటికీ గర్వంగా చాటే భారీ కోటలు, పెద్ద పెద్ద భవంతుల్లో సేదదీరుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలకటం ఒక సరికొత్త అనుభవం. ‘సిటీ ఆఫ్ లేక్స్’గా పేరొందిన ఈ నగరంలో చేసే పడవ ప్రయాణాలు, నాటి మేటి వంటకాల రుచి, అప్పటి నిర్మాణాల సొగసు, స్థానిక మార్కెట్లలో చేసే షాపింగ్.. కొత్త ఏడాదిలో మీకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ఊటీ, తమిళనాడు
నూతన సంవత్సరాన్ని కూల్‌గా స్వాగతించాలనుకునే వారికి ఊటీ మంచి ఎంపిక. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన ఊటీలో జరిగే సాయంకాలపు సంగీత కార్యక్రమాలు, కలర్ ఫుల్ పార్టీలను ఆస్వాదిస్తూ.. పాత సంవత్సరానికి వీడ్కోలు పలకటం మరుపురాని అనుభూతిగా మిగులుతుంది.

మెక్లీడ్‌గంజ్, హిమాచల్ ప్రదేశ్
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు మన దేశంలో ఉన్న హిల్ స్టేషన్స్‌లో ఇది అగ్రస్థానంలో ఉంటుంది. హిమాలయపు ఒడిలో ముచ్చటగా ఒదిగిపోయి నాటి చరిత్రకు సాక్ష్యంగా నేటికీ నిలిచిన క్లాసిక్ కేఫ్‌లు, టిబెటన్ ఆరామాలిచ్చే కొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ.. కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పటం మాటల్లో వర్ణించలేని అనుభూతి. దీనితో బాటు సమీపంలోని ధర్మశాల, ట్రెక్కింగ్‌కి అవకాశం కల్పించే భాగ్సునాథ్ టెంపుల్ వంటి వాటినీ మీ ట్రిప్పులో కవర్ చేయగలిగితే.. మరింత మజా మీ సొంతమవుతుంది.

పాండిచ్చేరి
దక్షిణాదిలో కొత్త ఏడాదికి స్వాగతం పలకాలనుకుంటే.. అందుకు పాండిచ్చేరి ఒక మంచి ఛాయిస్. ఇక్కడి రిసార్ట్‌లు, పబ్బులు, బీచ్‌లు, క్లబ్‌లలో నైట్‌లైఫ్ యువతకు మంచి కిక్‌ను ఇస్తుంది. ముఖ్యంగా పోర్ట్ బీచ్ పార్టీ, ప్యారడైజ్ బీచ్, ప్రొమెనేడ్ బీచ్ పాండిచ్చేరి, అశోక్ బీచ్ రిసార్ట్, పబ్ జిప్పర్, ఉమామి కిచెన్, క్రాస్కీస్ రెస్ట్రాపబ్, జింగీ సలై, సీగల్స్ బీచ్ రిసార్ట్, అరోమా గార్డెన్స్, ఆరోవిల్ వంటివి నూతన సంవత్సరాన్ని స్టైల్‌గా స్వాగతించడానికి మంచి గమ్యస్థానాలుగా ఉన్నాయి.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×