EPAPER
Kirrak Couples Episode 1

Janasena: తూర్పు గోదావరిపై జనసేన ఫోకస్.. ఎవరి బలమెంత ?

Janasena: తూర్పు గోదావరిపై జనసేన ఫోకస్.. ఎవరి బలమెంత ?
Janasena party latest news today

Janasena party latest news today(AP news live):

ఎన్నికల యుద్ధానికి గోదావరి జిల్లాలో జనసేనలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమంటూ కత్తుల దూస్తున్నాయి. గోదావరి జిల్లాలను గురిపెట్టి అసెంబ్లీ గద్దెనేక్కేందుకు సిద్ధమవుతున్నారు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా కాకినాడలో బసచేసి ఇన్ఛార్జ్‌లను సన్నద్ధం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఎంచుకుని అన్ని స్థానాల్లో గెలిచితీరాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. దీనికోసం పవన్ చేస్తున్న ప్లాన్స్ ఏంటి ? తూగో జిల్లాల్లో పవన్ తూగగలుగుతాడా..?


టీడీపీ జనసేన పొత్తుతో అభ్యర్దుల ఎంపిక రెండు పార్టీలకు అత్యంత కీలకంగా మారింది. అధికార వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలను సుమారు 60 మందిని మార్చేందుకు రంగం సిద్దం చేస్తే ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలు తమ బలం ఏ ప్రాంతంలో ఉందో తెలుసుకునేందుకు సమీక్షలు చేస్తున్నాయి. ప్రతి నియోజక వర్గంలో సర్వేల ఆధారంగా అభ్యర్థులను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన, తన బలం ఎక్కడ ఉందో.. గెలుపు అవకాశాలు ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఉన్నాయో తేల్చుకునే పనిలో ఉంది. 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. తొలిసారి ఈ జిల్లా నుంచే అసెంబ్లీకి జనసేన ప్రాతినిధ్యం లభించడంతో.. ఈసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సత్తా చాటే విధంగా పవన్‌ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా మూడు రోజుల పాటు కాకినాడలోనే పవన్ కళ్యాణ్ ఉండి, అభ్యర్ధులపై క్లారిటికి రానున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీకీ బలంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అత్యంత ముఖ్యమైనది. కనుక, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఆరు నుండి ఎనిమిది స్థానాలు జనసేన అడుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేసిన పవన్.. గెలుపు గుర్రాలపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.

ఇక కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు కాకినాడ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు జనసేన అడిగినట్లు సమాచారం. మొదటి నుండి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన బలంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ జనసేన నుండి పంతం నానాజీ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లో తిరుగుతున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజక వర్గంలో కాపులతో పాటు బీసీ సామాజకవర్గానికి కూడా అధిక ఓట్లు ఉన్నాయి. కాగా.. ఇక్కడ ప్రస్తుతం వైసిపి అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాపు సామాజక వర్గానికి చెందిన నేత కావడంతో అదే సామాజక వర్గానికి చెందని పంతం నానాజీని బరిలోకి దింపితే విజయ అవకాశం ఎక్కువుగా ఉందనే భావన పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజక వర్గంలో జనసేన పార్టీ బలంగా ఉన్నప్పటికి టీడీపీ అభ్యర్దులను కలుపుని వెళ్తేనే విజయం సాధించే అవకాశం ఉంటుందని అంచనాల్లో పార్టీ నేతలున్నారు.


మరో నియోజకవర్గం కాకినాడపై జనసేన అధినేత ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడిని ఈ ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీ వైపు అడుగులు వేయకుండా చేయాలనే లక్ష్యంగా జనసేన పావులు కదుపుతున్నట్లు చర్చ. గతంలో ద్వారంపూడి అక్రమాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపణలు సంధించారు. దానికి ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలో దించాలనే అనే దానిపై పవన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, గతంలో కాకినాడ నుండి ఎమ్మెల్యేగా చేసిన ముత్తా గోపాలకృష్ణ కొడుకు ముత్తా శశిధర్ పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. దాంతో పాటు ఇటివల కాలంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించన ప్రముఖ అడ్వకేటు తోట సుధీర్ పేరు కూడా వినిపిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే రాజమండ్రి రూరల్ , రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్ది కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా జనసేన పిఎసి సభ్యులుగా ఉన్నారు. రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో గత కొంత కాలం నుండి దుర్గేష్ పార్టీ కార్యక్రమాల్లో, ప్రజా సమస్యలపై పార్టీ తరుపున పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నియోజక వర్గంలో కాపుల కంటే బీసీ సామాజక వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రామచంద్రపురం నుండి ప్రాతినిథ్యం వహించిన మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణను రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అయితే జనసేన పార్టీ నుండి కందుల దుర్గేష్‌కి టికెట్ ఇవ్వాలా, లేక టీడీపీ నుండి బుచ్చయ్య చౌదరికి కేటాయించాలా అనే అంశం ఇరు పార్టీల అధినేతలకు పెద్ద తలనొప్పిగానే మారిందని సమాచారం. ఈ జిల్లాలో ఉన్న మరో నియోజకవర్గం రాజానగరం నుండి గత కొంత కాలంగా బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ తరుపున బలంగానే ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్‌గా బొడ్డు వెంకటరమణ చౌదరి ఉన్నారు. కాగా, ఈ నియోజక వర్గంలో కమ్మ సామాజిక ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. మరి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ధికి సీటు ఇస్తే ఏ స్థాయిలో మద్దతు పలుకుతారో అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నారు.

ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో అత్యంత బలంగా ఉంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుచుకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఈ ప్రాంతం నుండే ఉన్నారు. రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి రాపాక వరప్రసాద్ విజయం సాధించినప్పటికి, అధికార పార్టీకి మద్దతు ఇచ్చి, జనసేన పార్టీని విడిచిపెట్టారు. కాగా, ఇప్పుడు ఈ నియోజకవర్గం జనసేన పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. రాజోలు నియోజక వర్గం నుండి ఖచ్చితంగా గెలిచే దిశగా జనసేన అడుగులు వేస్తుంది. ఈ నియోజక వర్గం నుండి ప్రముఖ వైద్యుడు రాపాక రామేష్ గత కొంత కాలంగా జనసేన తరుపున తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు గత ఎన్నికల్లో వైసిపి తరుపున పోటీ చేసి, ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు కూడా జనసేన పార్టీలో చేరారు. అయితే, ఈ ఇద్దరిలో ఒక్కరికి సీటు ఇచ్చే అవకాశం ఉంది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మరో నియోజక వర్గం అమలాపురం. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్ధి గట్టి పోటీ ఇచ్చి, ఓడిపోయారు. ఈ నియోజక వర్గంలో నాయుకులతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన శెట్టిబత్తుల రాజాబాబు జనసేన తరపున బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. దాంతో పాటు గత ఎన్నికల్లో జనసేన అమలాపురం పార్లమెంట్ అభ్యర్గిగా పోటీ చేసిన డీఎంఆర్ శేఖర్ ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు, ఈ ఇద్దరిలో ఎవ్వరికి ఇచ్చినా జనసేన గెలిచే అవకాశం ఎక్కువుగానే ఉంది. అయితే, అమలాపురం నియోజకవర్గంలో టీడీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందనడంలో సందేహమే లేదు. కానీ, టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, పరమట శ్యామ్ ఉన్నారు. ఈ ఇరువురు నేతలు పూర్తి మద్దతు ఉంటేనే విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇక, ఈ జిల్లాలో మరో నియోజక వర్గం రామచంద్రపురం. ఇక్కడ సరైన నాయుకుడు లేకపోయిన జనసేన పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసే సైనికులు ఈ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. దాంతోపాటు గతంలో రామచంద్రపురం నుండి ఎమ్మెల్యేగా పని చేసిన చిక్కాల రామచంద్రరావు కుటుంబం నుండి చిక్కాల దొరాబాబు జనసేన పార్టీ తరపున ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ ఇన్ఛార్జ్‌గా బీసీ సామాజిక వర్గం నుండి గత టీడీపీ ప్రభుత్వంలో శాసన మండలి డిప్యూటీ స్పికర్‌గా చేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోయారనే టాక్ ఉంది. కాగా, ఈ నియోజక వర్గలో కాపు ప్రభావం ఎక్కువుగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ స్థానం జనసేనకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మండపేట నియోజకవర్గంలోనూ జనసేన బలంగా ఉందనే చెప్పాలి. వేగుళ్ళ లీలాకృష్ణ జనసేన పార్టీ నుండి పోరాటాలు చేస్తున్నారు. అయితే, ఈ ప్రాంతం నుండి గత రెండు పర్యాయాలుగా టీడీపీ అభ్యర్ధి వేగుళ్లు జోగేశ్వరరావు విజయం సాధించుకుంటూ వస్తున్నారు. టీడీపీ అభ్యర్ధి మూడో సారి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా, ఈ ఇద్దరిలో ఎవ్వరికీ సీటు కేటాయిస్తారో వేచి చూడాలి. మరో నియోజక వర్గం కొత్తపేట, ఈ ప్రాంతంలోనూ జనసేన క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉందనడంలో సందేహమే లేదు. ఇక్కడ, జనసేన పార్టీ నుండి బండారు శ్రీనివాసు ఉండగా ఇదే ప్రాంతం నుండి టీడీపీ అభ్యర్ధి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం కూడా బరిలో ఉన్నారు. ఇరువురు అన్నదమ్ములు కావడంతో టీడీపీ అభ్యర్దికే సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ జిల్లాల్లో కాపు సామాజికవర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గాల్లో ప్రజా బలంతో పాటు, అంగబలం, ఆర్ధిక బలం పరిపుష్టిగా ఉన్న అభ్యర్దులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే, పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ప్లాన్ చేసిన పర్యటనతో దాదాపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీలో ఉన్న నాయుకులకు ఒక క్లారిటీ రానుంది. అలాగే, ఇక్కడ గెలుపోటుములపై జనసేన అధినేతకు కూడా స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×