EPAPER
Kirrak Couples Episode 1

 KL Rahul : టాప్ టెన్ సెంచరీల్లో ఒకటైనా.. గెలిస్తే బాగుండేది: కేఎల్ రాహుల్

 KL Rahul : టాప్ టెన్ సెంచరీల్లో ఒకటైనా.. గెలిస్తే బాగుండేది: కేఎల్ రాహుల్
KL Rahul

KL Rahul : సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ చేసిన సెంచరీపై సునీల్ గవాస్కర్ అద్భుతమైన కామెంట్ చేశాడు. నేను 50 ఏళ్లుగా క్రికెట్ చూస్తున్నాను. అయితే అందులో టాప్ టెన్ సెంచరీల్లో కేఎల్ రాహుల్ చేసిన సెంచరీ కూడా ఒకటని కితాబునిచ్చాడు. ఇన్నేళ్లలో ఇంత గొప్ప సెంచరీ నేను చూడలేదని అన్నాడు. బౌలింగ్ పిచ్ మీద ఇంత కళాత్మక ఇన్నింగ్స్ ఆడటం రాహుల్ కే దక్కిందని అన్నాడు.


తొలిటెస్ట్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేఎల్ రాహుల్ దృష్టికి విలేకరులు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో కేఎల్ చాలా హ్యాపీగా ఫీలై, గవాస్కర్ సార్ కి నా ధన్యవాదాలు అని తెలిపాడు. అయితే నేను ఆడినప్పుడు ఇంత గొప్ప సెంచరీ అని ఫీల్ కాలేదని తెలిపాడు. నిజంగా గవాస్కర్ సార్ అన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించిందని తెలిపాడు. అయితే టెస్ట్ మ్యాచ్ గెలిచి ఉంటే, ఆ కిక్ వేరేలా ఉండేదని, అప్పుడు సెంచరీ చేసినందుకు  సంత్రప్తి ఉండేదని, ఇప్పుడంత లేదని తెలిపాడు.

కాకపోతే ఓపెనర్ గా వెళ్లినప్పుడు ప్రణాళిక ప్రకారం ఆడాల్సి ఉంటుందని అన్నాడు. అంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి, లేదా టార్గెట్ తెలిసినప్పుడు వేగంగా ఆడాలనే అంశాలపై ఒక అవగాహన ఉంటుందని అన్నాడు. అదే మిడిల్ ఆర్డర్ లో అయితే చాలా కష్టమని తెలిపాడు. అప్పటికి జట్టు అవసరాల రీత్యా మన ఆటతీరును మార్చుకుంటూ ఆడాల్సి ఉంటుందని అన్నాడు.


వికెట్లు త్వరగా పడితే, మన సహజత్వానికి భిన్నంగా డిఫెన్స్ ఆడుతూ స్కోర్ రొటేట్ చేయాలని అన్నాడు. అదే చివర్లో వెళితే టీ 20 మ్యాచ్ తరహాలో సిక్సర్లు, ఫోర్లు కొట్టాలని అన్నాడు. ఇక ఆరో డౌన్ వెళ్లినప్పుడు టెయిల్ ఎండర్స్ తో ఆడాల్సి ఉంటుందని అన్నాడు. అయితే శార్దూల్ ఠాకూర్ మంచి సపోర్టింగ్ ఇచ్చాడని తెలిపాడు. అందుకే మిడిలార్డర్ వెళ్లినప్పుడు ఖాళీ మైండ్ తో వెళతానని, అప్పుడు పరిస్థితులకు తగినట్టుగా నా మైండ్ సెట్ ని మార్చుకుంటానని తెలిపాడు.

మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ టెయిల్ ఎండర్స్ తో కలిసి సెంచరీ చేయడం సామాన్య విషయం కాదని, కేఎల్ రాహుల్ ని ప్రశంసలతో ముంచెత్తాడు.

Related News

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

Big Stories

×