EPAPER
Kirrak Couples Episode 1

AUS vs PAK 2nd Test : రిస్ట్ బ్యాండ్ కి తగిలి రిజ్వాన్ అవుట్.. రెండో టెస్ట్ లో ఆసిస్ చేతిలో పాక్ ఓటమి ..

AUS vs PAK 2nd Test : రిస్ట్ బ్యాండ్ కి తగిలి రిజ్వాన్ అవుట్.. రెండో టెస్ట్ లో ఆసిస్ చేతిలో పాక్ ఓటమి ..
AUS vs PAK 2nd Test

AUS vs PAK 2nd Test : ఆసిస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపు-ఓటముల మధ్య  పాకిస్తాన్ కాసేపు దోబూచులాడింది. ఒక దశలో గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే వికెట్ కీపర్ రిజ్వాన్ బ్యాటింగ్ చేసే సమయంలో ఒక వివాదాస్పద అవుట్ కి తను బలైపోయాడు. రిజ్వాన్ రిస్ట్ బ్యాండ్‌కు బంతి తాకింది. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. కానీ రివ్యూలో థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో ఆడేవారు లేక పాకిస్తాన్ ఓటమి పాలైంది.


మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ 264 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 54 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఒక దశలో 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.  

జట్టు స్కోరు 40 పరుగుల వద్ద మార్ష్ ఇచ్చిన సులువైన క్యాచ్ ని అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు. దీంతో పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ లైఫ్ తో బతికి బయటపడ్డ మార్ష్ 96 పరుగులు చేశాడు. స్మిత్ తో కలిసి 153 పరుగుల భాగస్వామ్యంతో ఆసిస్ కోలుకుంది. ఆ క్యాచ్ పట్టి ఉంటే, కచ్చితంగా పాక్ విజయం సాధించేదే.


ఎట్టకేలకు రెండో ఇన్నింగ్స్ లో 262 పరుగులకు ఆసిస్ ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 54 పరుగులు కలిపి 316 పరుగులు చేసినట్టయ్యింది. దీంతో 317 పరుగుల లక్ష్యంతో చివరి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 237 పరుగులకు ఆలౌటయ్యింది. 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుతంగా ఆడినప్పటికీ.. మార్ష్ క్యాచ్ మిస్ చేయడం, రిజ్వాన్ వివాదాస్పద  అవుట్ పాకిస్తాన్ పాలిట శాపంగా మారాయి. రెండో ఇన్నింగ్స్ లో ఒక దశలో మహ్మద్ రిజ్వాన్ (35), అఘా సల్మాన్ (50) పాకిస్థాన్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ నెమ్మదిగా స్కోరుబోర్డుని 200 పరుగులు దాటించారు. 219 పరుగుల వద్ద కమిన్స్ వేసిన బంతి రిజ్వాన్ రిస్ట్ బ్యాండ్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది.

అంపైర్ నాటౌట్ అన్నాడు. కానీ ఆసీస్ ఆటగాళ్లు  రివ్యూకి వెళ్లారు. అనూహ్యంగా థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. రిస్ట్ బ్యాండ్ కి తగిలితే అవుట్ అని కొందరు, కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు. కాకపోతే రిజ్వాన్ అవుట్ అయిన 8 ఓవర్లలోనే మిగతా 4 వికెట్లను చేజార్చుకొని పాకిస్తాన్ ఓటమిపాలైంది. మొత్తానికి రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో ఓటమి పాలై పాకిస్తాన్ సిరీస్ కోల్పోయింది. నామమాత్రమైన మూడో టెస్ట్ మ్యాచ్ ఒక్కటే మిగిలి ఉంది.

Related News

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Big Stories

×