EPAPER

World Economic Forum Summit : స్విట్జర్లాండ్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..

World Economic Forum Summit : స్విట్జర్లాండ్‌ లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..

World Economic Forum Summit : స్విట్జర్లాండ్‌ వేదికగా జనవరిలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమ్మిట్‌ జరగనుంది. జనవరి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సమ్మిట్‌ జరుగుతుంది. ఈ సమ్మిట్‌కు సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సీఎంతోపాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్పెషల్‌ సీఎస్‌ జయేశ్‌ రంజన్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లనున్నారు. ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం తరపున మాత్రమే కాక పలు రాష్ట్రాల నుంచి సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారు.


షెడ్యూల్‌ ప్రకారం అయితే.. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని టీమ్‌ జనవరి 15న ఎర్లీ మార్నింగ్‌ బయల్దేరి వెళ్తుంది. 18వ తేదీన తిరిగి హైదరాబాద్‌ చేరుకోనుంది. గతేడాది జరిగిన సమ్మిట్‌ కు అప్పటి మంత్రి కేటీఆర్‌ అండ్‌ టీం వెళ్లింది. దాదాపుగా 21వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పుకుంది.

విదేశీ కంపెనీలు తెలంగాణలో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేలా సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం చర్చలు జరపనుంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, సర్వీస్‌ సెక్టార్లలో అనుసరిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితరాలను వివరించి రాష్ట్ర ఎకానమీకి దోహదపడడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రయత్నించనుంది.


దావోస్‌ సమ్మిట్‌కు ఎంచుకునే థీమ్‌, ఎజెండా అంశాలను లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఇవ్వనున్న రాయితీలు, కల్పించనున్న సౌకర్యాలను ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు. దాంతో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకునే అవకాశముంది.

.

.

Related News

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Big Stories

×