EPAPER

Rohit Sharma : అదే మా కొంప ముంచింది : రోహిత్ శర్మ

Rohit Sharma : అదే మా కొంప ముంచింది : రోహిత్ శర్మ
Rohit Sharma

Rohit Sharma (ind vs sa 1st test 2023) : సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే మా కొంప ముంచిందని అన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ చేసి, టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు సాధించేలా చేశాడని అన్నాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కొహ్లీ అద్భుతంగా ఆడాడాని అన్నాడు. అయితే మ్యాచ్ లో ఎవరో ఒకరు బాగా ఆడితే సరిపోదని అన్నాడు. ఇది సమష్టి కృషి అని అన్నాడు. అందరూ కలిసి రాణిస్తేనే విజయం సాధ్యమని అన్నాడు.


రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లు తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయారని అన్నాడు. అలాగే సౌతాఫ్రికా బౌలర్లు రాణించిన పిచ్ పై మన బౌలర్లు తేలిపోవడం మ్యాచ్ ని మలుపు తిప్పిందని అన్నాడు. పిచ్‌కు తగినట్లు వారు బౌలింగ్ చేసినట్టు మన బౌలర్లు చేయలేకపోయారని చెప్పాడు.

అయితే కుర్రాళ్లతో నిండిన టీమ్ ఇండియాలో వాళ్లకు సౌతాఫ్రికాలో ఆడిన అనుభవం ఉందని అన్నాడు. అందువల్ల ఇక్కడ వాతావరణానికి వారు త్వరగానే అలవాటు పడ్డారని తెలిపాడు. కాకపోతే ఈ పరాజయంపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందని అన్నాడు.


ఈ ఓటమిని జీర్ణించుకోవడం అంత తేలిక కాదని, రెండో టెస్టుకు సంసిద్ధులం అవుతామని తెలిపాడు. అయితే బౌలర్లను విమర్శిస్తూనే, వారికి సౌతాఫ్రికాలో ఆడిన అనుభవం లేదని అన్నాడు. అందుకనే ప్రభావం చూపలేకపోయారని వెనకేసుకు వచ్చాడు. కానీ బ్యాటర్లు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంత దారుణంగా అవుట్ కావడం ఊహింలేదని అన్నాడు. కానీ క్రీడాకారులుగా ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండి, తర్వాత మ్యాచ్ లో తామేంటో నిరూపించుకోవాలని అన్నాడు.

ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో 8 మంది టీమిండియా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోవడం ఘోరాతీ ఘోరంగా అభివర్ణిస్తున్నారు. వీరిలో కెప్టెన్ రోహిత్ తో సహా మూడు డకౌట్లు కూడా ఉన్నాయి. మిగిలిన  5 గురు సింగిల్ డిజిట్లకి అవుట్ అయిపోయారు. టీమిండియా చేసిన 131 పరుగుల్లో కొహ్లీ (76), గిల్ (26) వీరు చేసినవే 102 పరుగులు ఉండటం విశేషం.

Related News

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

Big Stories

×