EPAPER

Vijayakanth Last Rites: ఇక సెలవు.. నేడు ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు..

Vijayakanth Last Rites: ఇక సెలవు.. నేడు ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు..

Vijayakanth Last Rites: తమిళ నటుడు విజయ్‌కాంత్‌ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కరోనాతో చెన్నైలోని మియాత్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నిన్న కన్నుమూశారు విజయ్‌కాంత్‌. ఆయన అంత్యక్రియలు తమిళనాడు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. సా. 4.45 గంటలకు విజయ్‌కాంత్‌ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపనుంది తమిళనాడు ప్రభుత్వం.


తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌ మృతితో కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్‌కాంత్‌కు కరోనా సోకడంతో.. చెన్నై లోని మియాత్ హాస్పిటల్‌లో చేరి చికిత్సపొందారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ తుదిశ్వాస విడిచారు.

1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు విజయకాంత్. ఆయన అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. 1979లో విడుదలైన ఇనికి ఇలమై సినిమాతో తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రతినాయకుడి పాత్రతోనే ప్రేక్షకులకు పరిచయమైన విజయ్‌కాంత్‌.. కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు ఎదురయ్యాయి. SAచంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఓరు ఇరుత్తరైతో విజయాలు అందుకున్న విజయ్‌కాంత్‌..తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్‌తో తిరుగులేని విజయాన్ని అందించి స్టార్ హీరోగా చేసింది. ఈ సినిమాతో అభిమానులు ఆయన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. మొత్తంగా 154 సినిమాల్లో నటించారు విజయ్ కాంత్.


కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా టాలెంట్ చూపించారు విజయ్ కాంత్. 1994 లో ఎంజీఆర్‌ పురస్కారం.. 2001లో కలైమళి అవార్డుని అందుకున్నారు. 2001లో బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు.. 2009లో టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు, 2011లో ఆనరరీ డాక్టరేట్‌ పొందారు. అలానే పలు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు కూడా అందుకున్నారు విజయ్‌కాంత్‌.

వెండితెరపై హీరోగా సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన… ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. తమిళ పాలిటిక్స్‌పై తనదైన ముద్ర వేయడంలో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ DMDK అధినేతగా ప్రజలకు మాత్రం చేరువయ్యారు. రాజకీయాల్లో ప్రజాదరణ తగ్గినప్పటికీ ఇప్పటికీ కూడా పార్టీని కొనసాగిస్తూనే వస్తున్నారు. ఎన్నికల్లో తన పార్టీ ఓటమి చవిచూసినా రాజకీయాల నుంచి మాత్రం వైదొలగలేదు.

.

.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×