EPAPER

Jagan Vs Sharmila | జగన్ పై షర్మిలనే అస్త్రంగా వాడుతున్నారా?.. కాంగ్రెస్ వైపు వైసీపీ అసంతృప్తులు చూపు..

Jagan Vs Sharmila | ఏపీలో చతికిల పడ్డ కాంగ్రెస్‌.. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే సౌత్ లో బేస్ పెంచుకుంటూ వస్తోంది హస్తం పార్టీ. ఆర్నెళ్ల క్రితం కర్ణాటక అసెంబ్లీలోనూ గెలిచింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ కు బలమైన నేతలు లేకపోవడం సమస్యగా మారింది.

Jagan Vs Sharmila | జగన్ పై షర్మిలనే అస్త్రంగా వాడుతున్నారా?.. కాంగ్రెస్ వైపు  వైసీపీ అసంతృప్తులు చూపు..
YS Jagan Vs Sharmila

YS Jagan Vs Sharmila(AP political news):

ఏపీలో చతికిల పడ్డ కాంగ్రెస్‌.. తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే సౌత్ లో బేస్ పెంచుకుంటూ వస్తోంది హస్తం పార్టీ. ఆర్నెళ్ల క్రితం కర్ణాటక అసెంబ్లీలోనూ గెలిచింది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ కు బలమైన నేతలు లేకపోవడం సమస్యగా మారింది. అయితే షర్మిల రాకతో పరిస్థితి కొంతైనా మారుతుందన్న అంచనాతో ఉన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించడం కీలకంగా మారింది. షర్మిలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ప్లస్ అవుతుంది. వైఎస్ అభిమానులు కొంతవరకు కాంగ్రెస్‌ వైపు షిఫ్ట్ చేసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు వైసీపీలో పెరుగుతున్న అసమ్మతుల్లో కొందరు కాంగ్రెస్‌ వైపు వచ్చే ఛాన్స్ ఉంది.


జగన్ ను ఎదురించి షర్మిల ఎంత వరకు నిలబడుతారన్నది కీలకంగా మారింది. అదే సమయంలో జగన్, షర్మిల తల్లి విజయమ్మ ఎవరివైపు నిలుస్తారన్న ప్రశ్నలూ ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ అభిమానులు ఉత్కంఠగా చూస్తున్నారు. తాను ఏపీ రాజకీయాల్లోకి వెళ్లనంటూ గతంలో తన తల్లి విజయమ్మకు మాట ఇచ్చారు షర్మిల. కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చల తర్వాత ఆమె తన మనసు మార్చుకున్నారు. తాను రాజకీయంగా నిలబడాలంటే ఏపీలో ఉండాలనుకుంటున్నారు. మరి షర్మిల ఏపీ కాంగ్రెస్ లో ఎంట్రీ ఇస్తే.. కాంగ్రెస్‌ పార్టీ తిరిగి జీవం పోసుకుంటుందా… అన్నది కూడా కీలకమే. షర్మిల ఏపీ హస్తం పగ్గాలు చేపడితే ఎన్నికల ముందు రాజకీయంగా కుదుపు తప్పదన్న ప్రచారం జరుగుతోంది.

షర్మిలకు ఏపీ పాలిటిక్స్‌పై క్లారిటీ ఉంది. గతంలో ఆమె ఏపీ వ్యాప్తంగా అన్న జగన్ కు మద్దతుగా 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అయితే ఇప్పుడు జగన్ తో మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్.. వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల గట్టిగానే మాట్లాడారు. ఆస్తుల విషయంలోనూ జగన్ తో విబేధాలు ఉన్నట్టు చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆస్తుల సమానంగా పంచి ఇవ్వలేదని, పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు తీవ్ర అన్యాయం చేశారని చంద్రబాబు పులివెందుల గడ్డపై గతంలో మాట్లాడిన సందర్భం ఉంది. 2019 ఎన్నికల్లో జగన్‌ గెలుపులో షర్మిల కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత చెల్లిని జగన్‌ పక్కనబెట్టడంతోనే షర్మిల తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు. ఈ విషయాన్ని చాలా సార్లు పరోక్షంగా షర్మిల మీడియా ముందుబయటపెట్టారు. కానీ ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయాయంటున్నారు. దేనికైనా రెఢీ అన్నంతగా వ్యూహాలు నడుస్తున్నాయి.


సొంత అన్న జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పని షర్మిల.. టీడీపీ నేత నారా లోకేష్‌కు మాత్రం క్రిస్‌మస్‌ గిఫ్ట్‌లు పంపారు. ఈ సంకేతాలు చూస్తే చాలు ఏపీలో త్వరలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి హైకమాండ్‌ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు. అంతేకాదు వైఎస్‌ఆర్‌ కూతురుగా షర్మిల రావడం అభ్యంతరమేమీ లేదన్నారు. మోస్ట్‌ వెలకమ్‌ అంటూ తన మద్దతును తెలిపారు. కాంగ్రెస్‌ సారధ్య బాధ్యతలు షర్మిల చేపడితే.. ఇకపై అన్న వర్సెస్‌ చెల్లిగా మారనుంది పొలిటికల్ సీన్‌.

Jagan Vs Sharmila, heat, AP Politics, Congress, YSRCP, CM Jagan, YS Sharmila,

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×