EPAPER
Kirrak Couples Episode 1

SA Vs IND 1st Test | మూడురోజుల్లో ముగిసిన టీమిండియా కథ.. తొలి టెస్టులో సఫారీల సూపర్ విజయం

SA Vs IND 1st Test | అంతన్నాడు…ఇంతన్నాడో లింగరాజు అన్నట్టయ్యింది…టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెటర్ల పరిస్థితి…సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలిటెస్టులో టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో  131 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్ ని నాలుగోరోజు వరకు కొనసాగించడం ఎందుకని అనుకున్నారో…ఏమో, ముచ్చటగా మూడురోజుల్లోనే ముగించేశారు.

SA Vs IND 1st Test | మూడురోజుల్లో ముగిసిన టీమిండియా కథ.. తొలి టెస్టులో సఫారీల సూపర్ విజయం

SA Vs IND 1st Test | అంతన్నాడు…ఇంతన్నాడో లింగరాజు అన్నట్టయ్యింది…టెస్ట్ మ్యాచ్ లో భారత క్రికెటర్ల పరిస్థితి…సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న తొలిటెస్టులో టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో  131 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్ ని నాలుగోరోజు వరకు కొనసాగించడం ఎందుకని అనుకున్నారో…ఏమో, ముచ్చటగా మూడురోజుల్లోనే ముగించేశారు.


సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. డీన్ ఎల్గర్ అత్యద్భుతంగా ఆడి 185 పరుగులు చేసి, డబుల్ సెంచరీ ముందు అవుట్ అయి నిరాశగా వెళ్లాడు. కానీ తను చేసిన ఆ పరుగులే సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

కెప్టెన్ బవుమా అనారోగ్యం కారణంగా బ్యాటింగ్ చేయలేదు. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా
ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. అందరూ ఏదో గల్లీ ప్లేయర్లలా ఆడి, ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సౌతాఫ్రికా బ్యాటర్లు 408 పరుగులు చేసిన పిచ్ పై, మనవాళ్లు 131 పరుగులకి ఆలౌట్ కావడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదని నెట్టింట ట్రోలింగ్ లు మొదలయ్యాయి.


భారత్ తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అది కూడా కేఎల్ రాహుల్ పుణ్యమాని ఆ పరుగులైనా వచ్చాయి. అందుకు బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేసింది. అలా భారత్ పై 163 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈసారి మనవాళ్లు అద్భుతంగా ఆడతారు. ఇరగదీసేస్తారు. ఇంకేం లేదు, కనీసం ముగ్గురైనా సెంచరీలు చేయడం ఖాయం, వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి బయటపడతారు, సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచి వీరుల్లా వస్తారని అంతా లెక్కలేసుకున్నారు.  కానీ అందరి అంచనాలను తలకిందులు చేసి మూడోరోజుకే చాప చుట్టేశారు.

 కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ముగ్గురు సున్నాలు చుట్టారు. వారిలో జస్ప్రీత్ బూమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. ఇక సింగిల్ డిజిట్ కే పరిమితమైన వాళ్లు యశస్వి జైస్వాల్ (5), శ్రేయాస్ (6), మొదటి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు రాహుల్ (4), ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ (2), సిరాజ్ (4) ఉన్నారు. ఇకపోతే విరాట్ కొహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శుభ్ మన్ గిల్ మాత్రంత అతికష్టమ్మీద 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

మనవాళ్లు ఆడిన విధానం చూస్తే, టెస్ట్ మ్యాచ్ లా భావించి ఎవరూ ఆడలేదు. అంతా టీ 20, వన్డే మ్యాచ్ తరహాలోనే ఆడి వికెట్లు పారేసుకున్నారు. అంటే ఎడతెరిపి లేని ఐపీఎల్ ఆటలకి అలవాటు పడిపోయారో, లేదంటే టెస్ట్ ప్లేయర్లుగా తమకి ముద్ర వేసి, ఇక్కడే బంధించేస్తారని అనుకున్నారో తెలీదు. అందరూ ఇలా వెళ్లి, అలా వచ్చేశారు. ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏమిటంటే పుజారా, ఆజ్యింక రహానే ఇద్దరిని పక్కన పెట్టడం చారిత్రాత్మక తప్పిదంగా మారింది.

ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఇద్దరిని ఫైనల్ జట్టులో బలవంతంగా ఇరికించడం వల్లే ఇంత దారుణం జరిగిందని నెట్టింట తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్లిద్దరికి ఏం అనుభవం ఉందని తెచ్చి టీమ్ ఇండియా నెత్తి మీద పెట్టి ఆడిస్తున్నారని తిట్టిపోస్తున్నారు. మ్యాచ్ లు చూసే ప్రజలని వెర్రివాళ్లను చేస్తున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు.  అంతమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లుంటే, వారి జీవితాలతో ఆటలాడుతూ రికమండేషన్ క్యాండిట్లకి చోటు కల్పించడం వల్లే ఇలా జరిగిందని దుయ్యబడుతున్నారు.

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 163 పరుగులను కూడా దాటలేకపోవడం నిజంగా దౌర్భాగ్యం అని చెప్పాలి. ఎప్పుడూ ఆ రికార్డు, ఈ రికార్డు అని గొప్పలు తప్ప, టీమ్ ఇండియా గొప్ప గొప్ప ట్రోఫీలు సాధించి చాలా ఏళ్లవుతోంది. ఫైనల్ ఫోబియాతోనే ప్రపంచకప్ లో ఓడిపోయింది.  మరీ పరిస్థితిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏ విధంగా పరిష్కరిస్తుందనేది దేవుడికే తెలియాలి.

Related News

Akash Deep: ఆకాశదీప్ కి బంతి తగిలితే.. అందరూ నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

Big Stories

×