EPAPER
Kirrak Couples Episode 1

Sharmila : ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ.. అన్నపై పోరాటానికి రెడీనా?

Sharmila : జగనన్న వదిలిన బాణం అంటూ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్ షర్మిల.. రూట్ రకరకాల మలుపులు తిరుగుతోంది. ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయమైందన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో పూర్తి డీలా పడిపోయింది కాంగ్రెస్. ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితులు లేవు. దీంతో ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలన్న టార్గెట్ తో హస్తం పార్టీ ఉంది. అందుకే షర్మిల రూపంలో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోందా?

Sharmila : ఏపీ పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ.. అన్నపై పోరాటానికి రెడీనా?

Sharmila : జగనన్న వదిలిన బాణం అంటూ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్ షర్మిల.. రూట్ రకరకాల మలుపులు తిరుగుతోంది. ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయమైందన్న టాక్ వినిపిస్తోంది. ఏపీలో పూర్తి డీలా పడిపోయింది కాంగ్రెస్. ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితులు లేవు. దీంతో ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలన్న టార్గెట్ తో హస్తం పార్టీ ఉంది. అందుకే షర్మిల రూపంలో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోందా?


వైఎస్ షర్మిల.. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. పాదయాత్రలు చేసి.. చివరి నిమిషంలో కాంగ్రెస్ తో జతకట్టాలని చూసి.. అది ఫలించక చివరికి హస్తం పార్టీకే మద్దతు పలికి.. ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారు. క్లుప్తంగా ఇదీ షర్మిల పొలిటికల్ సిచ్యువేషన్.

దక్షిణాదిన తమ బలం ఇంకా పెంచుకోవాలనుకుంటోంది. అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఫోకస్ చేసింది. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి జీరోగా ఉంది. రాష్ట్ర విభజనతో ఏపీలో హస్తం పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. బలమైన నేత ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా పోయారు. దీంతో ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇస్తే కొంత బెటర్ మెంట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అనుకుంటోంది.


తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో వైఎస్ఆర్ టీపీ పార్టీ విలీనానికి హస్తం హైకమాండ్ ఒప్పుకోలేదు. కనీసం షర్మిలను ప్రచారాల్లో కూడా భాగస్వామ్యం చేయలేదు. దీంతో.. అటు ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇటు కాంగ్రెస్ లో చేరకుండా షర్మిల స్తబ్దుగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.

అయితే వైఎస్ షర్మిల పొలిటికల్ జర్నీ ఊహించని మలుపులు తిరుగుతోంది. జగన్ వదిలిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఏపీకే వచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరే పరిస్థితికి చేరుకుంది. తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతోనూ సమావేశాలు నిర్వహించారు. వైఎస్సార్ పేరు సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చటం సమాచారం లోపంతోనే జరిగిందంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా చర్చకు కారణమమయ్యాయి. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ హైకమాండ్ తో దూరాన్ని దగ్గర చేశాయి.

ఏపీలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ముందే వైఎస్ షర్మిల.. నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్టులు పంపి శుభాకాంక్షలు తెలిపారు. వాటిని లోకేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిజానికి జగన్, షర్మిల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. దీంతో ఎవరికి వారే అన్నట్లుగా మారిపోయారు. అయితే జగన్ కు ప్రత్యర్థి అయిన టీడీపీతో షర్మిల పాజిటివ్ గా మూవ్ అవడం కీలకంగా మారింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం చేయడంతో పాటే… వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా నిర్ణయం తీసుకుంటారని ఏపీ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జి మాణిక్కం ఠాకూర్ అంటున్నారు. వైఎస్ఆర్ బిడ్డగా షర్మిల అంటే గౌరవం ఉందని, ఆమెకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చేదీ అధ్యక్షుడు ఖర్గేనే నిర్ణయం తీసుకుంటారన్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల రాకను ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎవరు వచ్చినా స్వాగతిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో షర్మిల తన అన్నయ్య వైఎస్ జగన్ కు అనుకూలంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ తో విభేదించిన తర్వాత ఆమె పూర్తిగా తెలంగాణ రాజకీయాలకు పరిమితం అయిపోయారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అయితే రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో షర్మిల తడబడుతున్నారా అన్న పాయింట్ పైనా చర్చ జరుగుతోంది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ లో విలీనానికి ప్రయత్నించినప్పుడు షర్మిలకు రాజ్యసభ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగలేదు. ఇప్పుడు సీన్ ఏపీకి మారింది అంతే.

వైఎస్ కూతురిగా ఏపీ ప్రజల్లో జగన్ మాదిరే తనకూ క్రేజ్ ఉండొచ్చని షర్మిల అనుకుంటున్నారు. ఏపీ పుట్టినిల్లు.. తెలంగాణ మెట్టినిల్లు అని గతంలో చెప్పిన షర్మిల తెలంగాణకే పరిమితం అవుతాననుకున్నారు. కానీ అనూహ్యంగా మళ్లీ ఏపీ రాజకీయాల్లోకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్ తనయ అనే ట్యాగ్ లైన్ తో ఏపీ ప్రజలను షర్మిల ఎంత వరకు ఆకట్టుకుంటారన్నది కీలకంగా మారింది.

Related News

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Big Stories

×