EPAPER
Kirrak Couples Episode 1

kaleshwaram project : కాళేశ్వరం కథ.. కేసీఆర్ రీ ఇంజినీరింగ్ టోటల్ రివర్స్..

kaleshwaram project : కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకం, ఇంజినీరింగ్ మార్వెల్, కేసీఆర్ అపర భగీరథుడు, ఆయనే కాళేశ్వరం ఛీఫ్ ఇంజినీర్.. బాహుబలి మోటార్లు.. ఒక్కటేమిటి.. అంతా ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ రీ ఇంజినీరింగ్ కాస్తా రివర్స్ ఇంజినీరింగ్ అయి కూర్చుంది. మేడిగడ్డ కుంగింది. అన్నారం గ్యారెంటీ లేకుండా పోయింది. మహా అద్భుతం అని కట్టిన కాళేశ్వరం కుంగడంతో కేసీఆర్ ఇమేజ్ మొత్తం కాళేశ్వరం పాలైంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అసలు కథ మొదలైంది. పునరుద్ధరణ డిజైన్లు తమ వల్ల కాదని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేతులెత్తేసింది. మరోవైపు మేడిగడ్డ ఆరు, ఎనిమిదో బ్లాకుల్లోనూ కథ తేడాగా కనిపిస్తోంది. మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తో మరింత క్లారిటీ రానుంది.

kaleshwaram project : కాళేశ్వరం కథ.. కేసీఆర్ రీ ఇంజినీరింగ్ టోటల్ రివర్స్..

kaleshwaram project : కాళేశ్వరం ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకం, ఇంజినీరింగ్ మార్వెల్, కేసీఆర్ అపర భగీరథుడు, ఆయనే కాళేశ్వరం ఛీఫ్ ఇంజినీర్.. బాహుబలి మోటార్లు.. ఒక్కటేమిటి.. అంతా ఆహా ఓహో అన్నారు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ రీ ఇంజినీరింగ్ కాస్తా రివర్స్ ఇంజినీరింగ్ అయి కూర్చుంది. మేడిగడ్డ కుంగింది. అన్నారం గ్యారెంటీ లేకుండా పోయింది. మహా అద్భుతం అని కట్టిన కాళేశ్వరం కుంగడంతో కేసీఆర్ ఇమేజ్ మొత్తం కాళేశ్వరం పాలైంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అసలు కథ మొదలైంది. పునరుద్ధరణ డిజైన్లు తమ వల్ల కాదని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చేతులెత్తేసింది. మరోవైపు మేడిగడ్డ ఆరు, ఎనిమిదో బ్లాకుల్లోనూ కథ తేడాగా కనిపిస్తోంది. మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రెజంటేషన్ తో మరింత క్లారిటీ రానుంది.


కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక కలగా మారిపోయింది. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. కాళేశ్వరంలో గుండెకాయ లాంటి మేడిగడ్డకే ముప్పు వచ్చింది. డిజైన్ లోపం, నాణ్యతా లోపం, ఒక్కటేమిటి అన్ని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఎంత నష్టం జరిగిందో ఆ సంగతి తేల్చేందుకు మంత్రుల బృందం స్వయంగా మేడిగడ్డకు వెళ్తోంది. అక్కడే పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ప్రాజెక్ట కథేంటో తేల్చేయనున్నారు.

రికార్డు సమయంలో బ్యారేజీల నిర్మాణం జరిగిందన్న ఆనందం ఎంతో కాలం నిలవలేకపోయింది. నాలుగేళ్ల వయసున్న ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయింది. నాలుగేళ్లకే ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందన్న కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. నిజానికి కాంగ్రెస్ మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రజలపై భారం మోపడంతో పాటు ప్రాజెక్టుకు వయబులిటీ ఉండదని ఆనాడే గుర్తించారు. అయినా సరే కేసీఆర్ తుమ్మిడిహెట్టి దగ్గర కాదని తాను అనుకున్న చోటే బ్యారేజీలకు ప్లాన్ చేశారు. పోనీ అవైనా సరిగా చేశారా అంటే ఇదీ మేడిగడ్డ పరిస్థితి.


మేడిగడ్డ బ్యారేజ్ ఈ ఏడాది అక్టోబర్ 21న రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల దగ్గర వంతెన కుంగింది. కాంక్రీట్ నిర్మాణానికి, క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. దీంతో బ్యారేజ్ కు నష్టం జరగకుండా వెంటనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం కూడా కుంగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి చూసింది. ప్రాజెక్టులో దమ్ము లేదని రిపోర్ట్ కూడా ఇచ్చేసింది.

బేస్ సరిగా లేకపోతేనే ఇలాంటి క్రాక్స్ వస్తాయని, కుంగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. బ్యారేజ్ నిర్మించే ప్రాంతంలో అన్ని రకాల అధ్యయనాలు చేస్తారు. ఏది కొంచెం ఇబ్బంది ఉన్నా ఆ ప్రాంతంలో నిర్మాణం వీలు కాదు. కానీ జియాలజీ స్టడీ చూస్తే.. భూఅంతర్గత పొరలపై క్లారిటీ ఇచ్చారు. ఇసుక రాతి నేలగా నిర్ధారించారు. సాధారణంగా గోదావరి పరివాహకం భూపొరల్లో ఇసుక బేస్ ఎక్కువ. ఇలాంటి చోట ఫౌండేషన్ టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అది జరగలేదు. కచ్చితంగా మేడిగడ్డ దగ్గరే బ్యారేజ్ కట్టాలని ముందే డిసైడ్ అయ్యాక.. ఇక ఇతర రిపోర్టులను పూర్తిగా పక్కన పడేశారంటున్నారు.

బడ్జెట్ పెంచి కట్టడం కోసమే మేడిగడ్డ ప్రాంతాన్ని ఎంపిక చేశారన్న వాదన మొదటి నుంచి వినిపిస్తున్నదే. నిజానికి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ప్రాజెక్ట్ కట్టాలంటే విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ కాళేశ్వరం విషయంలో ఇది జరగలేదు. ఇది ప్రజాప్రయోజన ప్రాజెక్టు కాదు. సుస్థిర ప్రాజెక్ట్​ అసలే కాదు. ఇందుకే ఇలా కుంగిపోయింది. సమస్య ఒక్క మేడిగడ్డ దగ్గరే కాదు.. అన్నారం, సుందిళ్ల దగ్గరా సమస్యలున్నాయి. కాళేశ్వరం నడిస్తే నష్టం, నడవకపోయినా నష్టమే. ఇంత పెట్టిన పెట్టుబడి అంతా ప్రజల డబ్బే.

సరే కోరుకున్న చోట ప్రాజెక్టు కట్టారు. అయిపోయింది. నిలబడుతుందనుకున్నారు. బ్యారేజ్ బలంగా ఉండాలంటే నీటి అడుగున మృత్తిక స్వభావం కూడా ముఖ్యమే. బలమైన ఫౌండేషన్ వేస్తే సరిపోతుందనుకున్నారు. కానీ భూమి లోపలి ఫలకాలు ఇసుక, బొగ్గు ఇలా వేర్వేరు కాంపోజిషన్ లతో ఉంటే పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతుంటుంది. ఎంత బలమైన ఫౌండేషన్ వేసినా అడుగు ఫలకాలు రీసెట్ అయితే ఎవరూ ఏమీ చేయలేరు. నిర్మాణ సమయంలో మేడిగడ్డ వద్ద భూమి అనుకూలంగా లేదని నిపుణులు చెప్పిన విషయాన్ని పక్కన పెట్టేశారు. అంబటిపల్లి, పోచంపల్లి మధ్యలో భూగర్భంలో మృత్తిక ఫార్మేషన్ అనువుగా లేదు. ఇదంతా ఇసుక, బంక మన్నుతో కలిసిన భూభాగమని జియాలజీ సర్వే రిపోర్ట్ ఉంది. పోనీ ఉన్న ఇసుక రాయి కూడా అన్ కన్సాలిడేటెడ్ ఫార్మేషన్ లో ఉంది. అంటే భారీ నిర్మాణాలు తట్టుకొని నిలబడలేవన్నది ఏ నిపుణుడైనా చెప్పే మాటే. సిస్మిక్ జోన్ అంటే భూకంప జోన్ 2, 3 మధ్యలో మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉంది. మేడిగడ్డ దగ్గర భూ నిర్మాణంలో స్ట్రక్చరల్ ఫాల్ట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం మేడిగడ్డ రిపేర్లు మొదలు పెట్టినా కాఫర్ డ్యాం నిర్మాణానికి 6 నెలల సమయం దాటుతుంది. 25 లక్షల క్యూసెక్కుల వరద మళ్లీ వస్తే అది తట్టుకోలేదు. ఒక వేళ తట్టుకున్నా.. ఆ వరద మిగతా 50 పీర్స్ నుండి ప్రవహించాలి. అయితే ఆ ప్రెషర్ కి అవి కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మేడిగడ్డ వద్ద రిపేర్లు చేసినా 6 నుంచి 8 టీఎంసీల నీటిని మాత్రమే భవిష్యత్తులో స్టోర్ చేసే పరిస్థితి ఉందంటున్నారు. ఎలాంటి బ్యారేజ్ ఎలా అయిపోయింది. వేల కోట్లు పెట్టి కట్టింది కలలా కరిగిపోయిందంటున్నారు.

ఇంత నష్టం జరిగితే.. మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని అంటున్నారు. ఒక్క బ్యారేజీలో చిన్న లోపం ఉంటే మొత్తం కాళేశ్వరమే లోపం అన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువలు కడితే అదనంగా 30లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చంటున్నారు.

కాళేశ్వరంతో ఉపయోగం కన్నా ఆర్థిక భారమే ఎక్కువ అని కాగ్ కూడా రిపోర్ట్ లో పేర్కొంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ప్రాజెక్ట్ లోపభూయిష్టంగా కట్టారని రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీని తేలియాడే నిర్మాణంగా కట్టారని, కానీ స్థిరమైన నిర్మాణంగా కట్టలేదని NDSA చెప్పింది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందంటున్నారు. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తేల్చింది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు వెళ్లి అక్కడ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ లో పాల్గొంటారు. అసలు కథను బయటపెట్టనున్నారు.

Related News

Mohan Babu: లడ్డూ పేరుతో నక్క బుద్ధి బట్టబయలు.. సీఎం ను కాకా పట్టడానికేనా ఇదంతా.?

Bigg Boss 8 Day 20 Promo: పెళ్లాం పై కోపంతో బిగ్ బాస్.. అభయ్ ను బయటకు గెంటేసిన నాగార్జున..!

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Samantha: సమంత సైలెంట్ ఏలా? టాలీవుడ్‌లో హేమా కమిటీ వేయాలన్న సామ్.. జానీ మాస్టర్ కేసుపై స్పందించదే?

Manchu Vishnu: కల్తీ లడ్డూ.. ప్రకాష్ రాజ్ కి కౌంటర్.. పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన విష్ణు..!

Tollywood heroine: తెలుగు హీరోయిన్ భర్తకి యాక్సిడెంట్.. ఐసీయూలో చేరిక.!

Saripodhaa Sanivaram: 28 రోజులకే ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే..?

Big Stories

×