EPAPER
Kirrak Couples Episode 1

Ambati Rambabu : అంబటికి షాక్..టిక్కెట్ ఇవ్వవద్దంటూ వైసీపీ నేతల నిరసన..

Ambati Rambabu : అంబటికి షాక్..టిక్కెట్ ఇవ్వవద్దంటూ వైసీపీ నేతల నిరసన..

Ambati Rambabu : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. ఆయనకు ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వవద్దంటూ సత్తెనపల్లి వైసీపీ నేతలు నిరసనకు దిగారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్లారు. నియోజకవర్గం నుంచి ZPTCలు, MPTC లు పలువురు సర్పంచ్ లు ఆయనను కలిశారు. అంబటికి టికెట్ ఇవ్వొద్దని కోరారు. ఒకవేళ అంబటికి టికెట్ ఇస్తే.. సహకరించేది లేదని తేల్చి చెప్పారు.


2018 ఎన్నికల్లో అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో విజయం సాధించారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్ ను కోడెల శివప్రసాదరావును ఓడించారు. అంతకుముందు అంబటి రాంబాబు 1989లో రేపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994, 99 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లె నుంచి బరిలోకి దిగి స్వల్పతేడాతో పరాజయాన్ని చవిచూశారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం సత్తెనపల్లి నుంచి గెలిచి 30 ఏళ్లకు మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. జగన్ కేబినెట్ 2.0లోనూ అంబటికి స్థానం దక్కింది. కీలకమైన జలవనరుల శాఖ బాధ్యతను ఆయనకు అప్పిగించారు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సత్తెనపల్లి స్థానిక వైసీపీ నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేయడం అంబటికి సవాల్ గా మారింది. మరి ఆ నేతలను బుజ్జగించి తన దారికి తెచ్చుకుంటారా? ఈ నిరసన వెనుక ఎవరున్నారు? తాజా పరిణామాల నేపథ్యంలో అంబటికి టిక్కెట్ దక్కుతుందా? వైసీపీ అధిష్టానం వ్యూహమేంటి? ఇప్పుడే ఈ అంశమే సత్తెనపల్లిలో హాట్ టాపిక్ గా మారింది.


Related News

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Big Stories

×