EPAPER

Mrinank Singh : మాట వినడం లేదని వదిలేశారు .. ఊరిమీద పడి వాడేం చేశాడంటే..?

Mrinank Singh : మాట వినడం లేదని వదిలేశారు .. ఊరిమీద పడి వాడేం చేశాడంటే..?
Mrinank Singh

Mrinank Singh : అందరి నెత్తిమీద చేతులేశాడు. అమ్మాయిలకు వల వేశాడు. ఖరీదైన ఫైవ్ స్టార్ హోటళ్లలో బసచేసి, తనొక్కప్పుడు గొప్ప క్రికెటర్ అని చెప్పి, క్రికెటర్లతో దిగిన ఫొటోలు చూపించి, అందరినీ బుట్టలో వేసుకున్నాడు. వారితో బిల్లులు కట్టించేవాడు. అమ్మాయిలను లోబరుచుకుని, వారితో అడ్డదిడ్డమైన ఫొటోలన్నీ దిగాడు. వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడు.  చివరికి రిషబ్ పంత్ కి కూడా 1 కోటి 60 లక్షలకి టోకరా వేశాడు. డ్రగ్స్ కూడా వాడేవాడని తెలిసింది. ఇంకా పేర్లు తెలియని వారెంత మంది ఉన్నారో తెలీదు. అందరినీ శుభ్రంగా వాడేసిన ఆ కేటుగాడి అసలు పేరు…మృనాంక్ సింగ్.


ఇన్ని ఘనకార్యాలు చేసిన వాడి వయసెంతని అనుకుంటున్నారా? కేవలం 25 ఏళ్లు మాత్రమే. పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టు కాలేజీ చదువు అయిన దగ్గర నుంచి విలాసాలకు అలవాటు పడిన మృనాంక్ సింగ్ ని ఇంట్లో వాళ్లు వదిలేశారు. ఎంత చెప్పినా వినడం లేదని పట్టించుకోవడం మానేశారు. దీంతో కుర్రాడు రెచ్చిపోయాడు. అడ్డూ అదుపు లేకుండా జీవితాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేశాడు.

చివరికి దేశం దాటి వెళ్లిపోతుంటే ఎయిర్ పోర్టు దగ్గర పట్టుకుని, కటకటలా వెనక్కి పంపించారు. ఇక్కడ గొప్ప విచిత్రం ఏమిటంటే లగ్జరీ లైఫ్ స్టైల్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలు పెట్టే ఇతణ్ని ఇన్‌స్టాలో 40 వేల మంది ఫాలో అవుతున్నారు. అది వారి తప్పు కాదు. తను అందరిలా నిజమైన సెలబ్రిటీ అనుకున్నారు.


ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసిన మృనాల్.. రాజస్థాన్‌లోని ఓపీజేఎస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. గతంలో హర్యానా తరఫున అండర్-19 క్రికెట్ ఆడాడు. ఆ కార్డు ఉపయోగించుకున్నాడు.  2014 నుంచి 2018 వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడానని.. తాను పాపులర్ క్రికెటర్‌నని ఎదుటి వ్యక్తులను నమ్మించాడు. అమ్మాయిలను వశపరుచుకునే వాడు. బిల్లులు కట్టకుండా ఖరీదైన రెస్టారెంట్లలో తింటూ.. ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండేవాడు.

2022లో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌కి వెళ్లాడు. ఎప్పటిలాగే  రూ. 5.5 లక్షల బిల్లు కట్టకుండా వచ్చేశాడు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా తీయలేదు. తర్వాత నంబర్ బ్లాక్ చేశాడు. దీంతో తాజ్ హోటల్ సిబ్బంది పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేటుగాడి బండారమంతా బయటపడింది.  అంతేకాదు  లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. హాంగ్‌కాంగ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

కుర్రాడిలో చాలా కళలున్నాయి. ఒక్క క్రికెటర్ అనే కాదు, మానాన్న ఒకప్పుడు గొప్ప క్రికెటర్ అని ఒకచోట, మరోచోట మానాన్న పెద్ద పోలీసాఫీసర్ అని ఇంకోచోట నమ్మించాడు. దేశంలో పలు ప్రాంతాల్లోని పోలీస్టేషన్లలో ఇతనిపై కేసులున్నాయి. మొత్తానికి దొరికాడు. ఇప్పుడు విలాసవంతమైన జీవితమంతా పోయి, వాస్తవ జీవితంలోకి వస్తాడని అంతా అంటున్నారు.

Related News

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

Big Stories

×