EPAPER

Car Insurance : కారు పాలసీ రెన్యువల్‌‌ టిప్స్.. ప్రీమియంపై డిస్కౌంట్ ఇలా !

Car Insurance : కారు పాలసీ రెన్యువల్‌‌ టిప్స్.. ప్రీమియంపై డిస్కౌంట్ ఇలా !
Car Insurance

Car Insurance : ఏ వాహనానికైనా బీమా తప్పనిసరి. థర్డ్‌ పార్టీ బీమా అనేది తప్పనిసరి అయినప్పటికీ, సమగ్ర బీమా ఉంటేనే సంపూర్ణ రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కారు బీమా పాలసీని పునరుద్ధరించే టైంలో కొన్ని చిట్కాలను పాటిస్తే వాహనానికి తగిన రక్షణ ఉండటమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. రోడ్డు ప్రమాదాలు, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదం వంటి అనివార్య పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యల నుంచి కాపాడుకునేందుకు కారు బీమా పాలసీ అవసరం.


ఆన్‌లైన్‌లో పాలసీ రెన్యువల్
మీ కారు బీమాను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించడం వల్ల ప్రీమియం మొత్తంపై రాయితీలను పొందొచ్చు. ఎందుకంటే ఆన్‌లైన్‌ పాలసీ విషయంలో బీమా కంపెనీకి పాలసీను విక్రయించడం కోసం ఏజెంట్లను లేదా ఆన్‌-బోర్టింగ్‌ బ్రోకర్లను నియమించుకునే ఖర్చులు తగ్గుతాయి. అందుచేత కారు బీమా పాలసీ పునరుద్ధరణపై మీకు తగ్గింపును అందజేస్తారు. ఆన్‌లైన్‌లో వివిధ బీమా కంపెనీలు అందించే విభిన్న పాలసీ ప్లాన్స్‌ను సరిపోల్చుకోవాలి. సరసమైన ప్రీమియంతో సమగ్ర పాలసీని అందించే బీమా సంస్థను కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎంచుకోవచ్చు.

యాంటీ-థెఫ్ట్‌ పరికరం
మీ వాహనంలో యాంటీ-థెఫ్ట్‌ పరికరం ఇన్‌స్టాల్‌చేయడం వల్ల మీ కారు భద్రత స్థాయి పెరుగుతుంది. ఆటోమొబైల్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ఇండియా (ARAI) ఆమోదించిన యాంటీ-థెఫ్ట్‌ పరికరాలను కారులో తప్పనిసరిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని మీ వాహనంలో ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు బీమా సంస్థలు కారు బీమా ప్రీమియంపై తగ్గింపు కూడా అందిస్తాయి. ఈ పరికరం మీ కారును అన్ని దొంగతనాల నుంచి రక్షించడమే కాకుండా.. బీమా పాలసీని పునరుద్ధరించేటప్పుడు ప్రీమియం మొత్తంలో డబ్బును ఆదా చేస్తుంది.


మినహాయింపులు
మినహాయింపు అంటే.. పాలసీదారుడు క్లైయిమ్ టైంలో తన వాటాను కూడా కొంత శాతాన్ని చెల్లిస్తారు. పాలసీ రెన్యువల్ సమయంలో స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోవడం వల్ల బీమా ప్రీమియం కొద్దిగా తగ్గుతుంది. కానీ, క్లెయిమ్ సమయంలో ఈ మేరకు మొత్తాన్ని మీరు సొంతంగా చెల్లించాలి. అందువల్ల ఈ మినహాయింపును జాగ్రత్తగా ఎంచుకోండి.

క్లెయిమ్ సెటిల్‌మెంట్‌హిస్టరీ
పాలసీ తీసుకుంటే.. ఎప్పుడూ ప్రీమియం మాత్రమే చూడొద్దు. పాలసీ తీసుకునే సంస్థ క్లైయిమ్ సెటిల్మెంట్‌ రేషియోను కూడా చూడండి. త్వరిత క్లెయిమ్ ల ప్రక్రియతో పేరున్న బీమా సంస్థ పాలసీని తీసుకోండి. అవసరమైన టైంలో మరింత నమ్మకంగా ఉంటుంది.

గడువు తేదీ
గడువు తేదీలోపు బీమా రెన్యువల్ చేయడం కుదరకపోతే కంగారు పడక్కర్లేదు. మరో 90 రోజుల గ్రేస్ పీరియడ్ అందుబాటులో ఉంటుంది. ఈ లోపు రెన్యువల్ చేసుకుంటే NCB లాంటి ప్రయోజనాలు కోల్పోకుండా ఉంటారు. ఒకవేళ అప్పటికీ రెన్యువల్‌ చేయకపోతే కొత్త పాలసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దానిపై అధిక ప్రీమియం చెల్లించాలి.

AAI సభ్యత్వం
ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ఇండియా (AAI) మెంబర్‌షిప్‌ పొందడం వల్ల మీ కారు బీమా ప్రీమియం మొత్తంపై కొన్ని అదనపు తగ్గింపులు లభిస్తాయి. కారు బీమా ప్లాన్‌ను రెన్యువల్ చేసేటప్పడు ప్రీమియంపై డిస్కౌంట్‌ను పొందడానికి మీ AAI సభ్యత్వాన్ని పేర్కొనండి.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×