EPAPER
Kirrak Couples Episode 1

Houthi Rebels in Red sea | ఎర్ర సముద్రంలో హౌతీల టెర్రర్.. అంతర్జాతీయ సరుకు రవాణాకు పెనుముప్పు

Houthi Rebels in Red sea | హౌతీ రెబల్స్ హద్దులు దాటుతున్నారు. ఎర్ర సముద్రం నుంచి అరేబియన్ సీ దాకా ఎటాక్స్ చేస్తున్నారు. తాజాగా భారత్ వస్తున్న షిప్ పై దాడి చేసిన ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు చమురు రవాణా చేస్తున్న సంస్థలు తమ నౌకలను మళ్లించడం లేదంటే రద్దు చేయడం వంటివి చేస్తున్నాయి. దీంతో కొత్త ఏడాదిలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది.

Houthi Rebels in Red sea | ఎర్ర సముద్రంలో హౌతీల టెర్రర్.. అంతర్జాతీయ సరుకు రవాణాకు పెనుముప్పు

Houthi Rebels in Red sea | హౌతీ రెబల్స్ హద్దులు దాటుతున్నారు. ఎర్ర సముద్రం నుంచి అరేబియన్ సీ దాకా ఎటాక్స్ చేస్తున్నారు. తాజాగా భారత్ వస్తున్న షిప్ పై దాడి చేసిన ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు చమురు రవాణా చేస్తున్న సంస్థలు తమ నౌకలను మళ్లించడం లేదంటే రద్దు చేయడం వంటివి చేస్తున్నాయి. దీంతో కొత్త ఏడాదిలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది.


హౌతీల దాడులతో భారత్ వైపు వస్తున్న షిప్పులే ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. పైగా చాలా అంతర్జాతీయ నౌకల్లో సిబ్బంది భారతీయులే ఉంటారు. గత నెల రోజుల నుంచి జరుగుతున్న డ్రోన్ దాడుల్లో చాలా మంది ఇండియన్లు తృటిలో ప్రాణాలు కాపాడుకున్నారు. తాజాగా లైబీరియన్ ఫ్లాగ్ తో భారత్‌కు వస్తున్న నౌకపై జరిగిన దాడి జరిగింది. ఈ ఎటాక్ కు కారణమైన డ్రోన్‌ ఇరాన్‌ భూభాగం నుంచి బయల్దేరిందని అమెరికా డిఫెన్స్ ఆఫీస్ పెంటగాన్‌ కన్ఫామ్ చేసింది. ఇప్పటి వరకు ఇరాన్ సపోర్ట్ ఉన్న హౌతీ రెబల్స్.. కేవలం ఎర్ర సముద్రంలోని షిప్పులపైనే దాడులు చేశారు. కానీ తాజాగా చేసిన ఎటాక్ మాత్రం గుజరాత్‌ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో జరిగింది. దీన్ని మన నేవీ సీరియస్ గా తీసుకుంది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల పరిధి ఎర్ర సముద్రాన్ని దాటినట్లయిందని పెంటగాన్‌ అంటోంది. ఇది మరింత విస్తరించే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్.

గుజరాత్‌లోని వెరావల్‌ తీరానికి 200 నాటికల్‌ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్‌ ప్లూటోపై డిసెంబర్ 23న డ్రోన్‌ దాడి జరిగింది. వెంటనే భారత కోస్ట్‌గార్డుకు చెందిన పెట్రోలింగ్ నౌక ఐసీజీఎస్‌ విక్రమ్‌, పీ-81 మారిటైమ్‌ పెట్రోలింగ్‌ విమానం ఘటనా స్థలానికి వెళ్లాయి. వాణిజ్య నౌకలో మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదం నుంచి నౌకలోని 21 మంది ఇండియన్లను రక్షించారు. దీంతో అరేబియన్ సీలో అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.


హమాస్‌పై ఇజ్రాయెల్ వార్ మొదలైన తర్వాత ఇరాన్ నేరుగా నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని పెంటగాన్ బహిరంగంగా ఆరోపించడం ఇదే తొలిసారి. తాజాగా దాడికి గురైన నౌక లైబీరియన్‌ జెండాతో వస్తోందని తెలిపింది. ఇది డచ్‌ సంస్థకు చెందినదందంటున్నారు. ఈ నౌకకు ఇజ్రాయెల్‌తో సంబంధం ఉందని.. కెమికల్స్, దానికి సంబంధించిన ప్రొడక్టులను తీసుకెళ్తోందని మారిటైమ్‌ సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే చెబుతోంది. మరోవైపు ఎర్ర సముద్రంలో మరో రెండు వాణిజ్య నౌకలపై కూడా డ్రోన్ దాడి జరిగింది. అందులో గాబన్‌ జెండాతో వస్తోన్న నౌక ఒకటి ఉంది. ఎంవీ సాయిబాబా పేరుతో భారత్‌లోనూ ఈ నౌక రిజిస్టర్‌ అయింది. అయితే, ఇది భారత జెండాతో వస్తున్నట్లు మొదట అమెరికా సైన్యం ప్రకటన చేసింది. ఆ ఎటాక్ లో ఎవరూ గాయపడలేదు. మరోవైపు నార్వే జెండాతో ఉన్న ఎంవీ బ్లామనెన్‌పైనా హౌతీలు దాడి చేశారు. అలాగే, అమెరికా యుద్ధ నౌక యూఎస్‌ఎస్‌ లబూన్‌ పైనా కొన్ని డ్రోన్లు దాడికి యత్నించాయి. కానీ, వాటిని ఆ యుద్ధనౌక కూల్చివేసింది. మొత్తంగా అక్టోబర్‌ 17 తర్వాత వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల సంఖ్య 15కు చేరుకుంది.

హౌతీలను ఇలాగే విడిచి పెడితే పరిస్థితి చేయి దాటిపోతుందని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. ఈ దాడులకు అడ్డుకట్ట వేసేలా కార్యాచరణను అమెరికా రెడీ చేస్తోంది. అమెరికా, ఎర్ర సముద్ర మార్గంలో వెళ్లే రవాణా నౌకల సెక్యూరిటీ కోసం అంతర్జాతీయంగా నేవీ జాయింట్ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, బహ్రెయిన్, నార్వే, స్పెయిన్‌లు కూడా భద్రత కల్పించేందుకు ముందుకు వస్తాయి. యెమెన్‌కు చెందిన హౌతీలు చేస్తున్న దాడులతో స్వేచ్ఛాయుత వాణిజ్యం ప్రమాదంలో పడుతోందని, అమాయక నావికులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని అమెరికా అంటోంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని ఫైర్ అవుతున్నారు.

ప్రస్తుతం సూయజ్ కెనాల్, రెడ్ సీ పరిధిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని షిప్పింగ్ కంపెనీల్లో రెండో అతిపెద్ద కంపెనీ మేయిర్స్క్ అంటోంది. ఈ కంపెనీకి చెందిన నౌక మేయిర్స్క్ జిబ్రాల్టర్‌పైనా, మరో కంటెయినర్ షిప్‌పైనా దాడి తృటిలో తప్పింది. ఇది ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే నౌకలు ఆఫ్రికా చుట్టి తిరిగి రావాలంటే నెల రోజులకు పైగా సమయం పడుతుంది. దీంతో సమస్యలు పెరుగుతాయంటున్నారు. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.6 శాతం పెరిగి, ఒక్కో చమురు బ్యారెల్ ధర 79 డాలర్లకు చేరింది. ఇండియన్ కరెన్సీలో 6579 ధరకు చేరుకుంది.

హౌతీలు వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైల్ దాడులకే పరిమితం కాకుండా మరిన్ని వార్నింగ్ లు ఇస్తున్నారు. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించే ప్రయత్నాలు జరుగుతుండడంతో.. ఇంటర్నెట్‌ వ్యవస్థపై ఎటాక్ చేస్తామని హౌతీ గ్రూప్ ప్రకటించింది. ఇందుకోసం బాబ్‌ అల్‌-మందబ్‌ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్‌ కేబుళ్లను కట్ చేసి పారేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిచిపోతాయంటూ సోషల్‌ మీడియా ద్వారా వార్నింగ్ లు ఇస్తున్నారు. అమెరికా నిర్ణయానికి ఇటలీ, స్పెయిన్‌ మద్దతిస్తాయన్న ప్రచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో హౌతీ ఉగ్రవాదులు చెప్పకొచ్చారు. తాము తీసుకునే నిర్ణయంతో ప్రపంచం నిజమైన రాతియుగంలోకి వెళ్లిపోతుంది ఇక కాస్కోండి అంటూ సవాల్ చేస్తున్నారు.

హౌతీలను కట్టడి చేయకుంటే.. ప్రపంచానికి నెట్‌వర్క్‌ సమస్య ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. హౌతీలు సముద్ర గర్భంలోని కేబుళ్లను కట్‌ చేసినా.. పెద్దగా ప్రమాదమేమీ ఉండదని భారత టెలీకమ్యూనికేషన్‌ శాఖ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ప్రస్తుతమున్న వనరులతోనే ఎక్కడా ఇంటర్నెట్‌కు ఇబ్బంది లేకుండా చేయవచ్చంటున్నారు. సముద్ర గర్భంలో ఒకే లైన్‌లో ఇంటర్నెట్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థ లేదని, దేశాల మధ్య వేర్వేరు సంస్థలకు చెందిన కేబుళ్లున్నాయంటున్నారు. భారత్‌కు చెన్నై, పుదుచ్చేరి, కోల్‌కతా, ముంబై వంటి పోర్టుల వద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్‌ హబ్‌లు ఉన్నాయి. ముంబై-హైదరాబాద్‌ లైన్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. సర్వీస్‌ ప్రొవైడర్లు వెంటనే చెన్నై లేదా కోల్‌కతా హబ్‌ నుంచి డేటాను యాక్సెస్‌ చేస్తారంటున్నారు. అంతేకాదు.. అర్జెంటీనా లాంటి పలు దేశాల నుంచి మన హబ్‌లకు ఎమర్జెన్సీ ఇంటర్నెట్‌ కనెక్టివిటీకి అవకాశాలున్నాయంటున్నారు.

Houthi Rebels, Red sea, terror, Global trade, Shipping Business, India,

Related News

Israel vs Iran War: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Big Stories

×