EPAPER

The Economic Times : 2023 ముగిసే లోపు .. వీటిని పూర్తి చేసేయండి!

The Economic Times : 2023 ముగిసే లోపు .. వీటిని పూర్తి చేసేయండి!

The Economic Times : 2023వ సంవత్సరానికి గుడ్‌బై చెప్పి 2024వ సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం. వీటితోపాటు పలు పనుల కూడా ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఒకవేళ మీరు ఈ 5 పనులను పూర్తి చేయకుంటే ఈరోజే వాటిని పూర్తి చేయండి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఆ 5 పనులు ఏంటో చూద్దాం.


డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్ నామినేషన్
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లయితే, మీ నామినీ పేరును జోడించడానికి మీకు డిసెంబర్ 31 వరకు మాత్రమే సమయం ఉంది. మీరు ఈ పనిని పూర్తి చేయకపోతే.. మీ మ్యూచువల్ ఫండ్ ఖాతా యాక్టివేట్‌లో ఉండదు.

UPI ID బ్లాక్‌
ఒక సంవత్సరానికి పైగా యాక్టివ్‌గా లేని UPI IDలు, నంబర్‌లను యాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. లేదంటే.. UPI IDని డీయాక్టివేట్ అవుతుంది.


బ్యాంకు లాకర్ ఒప్పందం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. సేఫ్ డిపాజిట్ లాకర్ల కొత్త నిబంధనల ప్రకారం లాకరు కలిగిన ప్రతి ఖాతాదారుడు తమ బ్యాంకుల కొత్త ఒప్పందంపై సంతకం చేయడం తప్పనిసరి. దీనికి చివరి తేది డిసెంబరు 31 వరుకు మాత్రమే.

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు
ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31. అయితే జులై 31 నాటికి ITR ఫైల్ చేయని కస్టమర్‌లు ఆలస్య రుసుముతో డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయవచ్చు. లేదంటే జరిమానా విధించే అవకాశం ఉంది.

అమృత్ కలాష్ స్కీమ్‌
ఎస్‌బీఐ అమృత్ కలాష్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఈ 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 7.6 శాతం వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు.

సిమ్ కార్డు కొత్త రూల్స్
సిమ్ కార్డుల జారీకి సంబంధించి డిసెంబరు 31 తర్వాత కొత్త రూల్ రాబోతుంది. ఎలాంటి ఫిజికల్‌ డాక్యుమెంట్స్ సమర్పించకుండానే.. డిజిటల్ విధానంలో ఇ-కేవైసీ చేసుకోవచ్చు.

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×