EPAPER

Janasena : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేనాని ఫోకస్.. ఈ నియోజకవర్గాలే టార్గెట్..

Janasena : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతోంది. టీడీపీ, జనసేనల నుంచి ఎవరు పోటీ చేస్తారో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ జిల్లాపైనే ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. పట్టు ఉన్న స్థానాల్లో బరిలో దిగేందుకు వ్యూహారచన చేస్తున్నారు. ఇప్పటికే ఈస్ట్‌ గోదావరి జిల్లా నాయకులతో చర్చలు జరిపారు.

Janasena : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై జనసేనాని ఫోకస్.. ఈ నియోజకవర్గాలే టార్గెట్..

Janasena : టీడీపీతో పొత్తు పెట్టుకుని వైసీపీతో యుద్ధానికి దిగిన జనసేనాని.. విజయం కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారు. జనసేన పట్టు నిలుపుకోవాలంటే గోదావరి జిల్లాలే కీలకంగా భావిస్తున్నారు. టీడీపీ పొత్తులో ఇచ్చే స్థానాల్లో ఎక్కువ భాగం తూర్పు గోదావరి జిల్లా నుంచి డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతకీ తూర్పుపై పవన్ ఎందుకంత కాన్‌సన్‌ట్రేట్‌ చేశారు? ఏయే సీట్లు డిమాండ్ చేస్తున్నారు?


కూటములు, పొత్తులు పక్కన పెడితే జనసేనకి బలం, బలగం అంతా గోదావరి జిల్లాలే. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ జనసేనకు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. జనసేన గెలుచుకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు రాజోలు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనిదే. ఇదే అంశాన్ని పొత్తుల విషయంలో ప్రధాన అంశంగా జనసేన లేవనెత్తుతోందని తెలుస్తోంది.‌

మిగిలిన జిల్లాల్లో సీట్ల పంపకం ఎలా ఉన్నా కానీ.. గోదావరి జిల్లాలో మాత్రం సగానికి సగం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో జనసేన మాటను టీడీపీ కూడా పెద్దగా విభేదించడం లేదని తెలిసింది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన గెలవకపోయినా టీడీపీ కోల్పోయిన స్థానాలన్నీ జనసేన వల్ల ఓట్లు చీలడం వల్లే జరిగిందన్న అభిప్రాయంలో ఉంది తెలుగు తమ్ముళ్లలో. కేవలం అసెంబ్లీ మాత్రమే కాదు.. లోక్‌సభ స్థానాలు కూడా జనసేన వల్లే కోల్పోయిందన్న భావనలో ఉంది టీడీపీ.


ఈసారి అలాంటి నష్టం జరగకుండా టీడీపీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జనసేన కూడా గత ఎన్నికల తర్వాత గోదావరి జిల్లాల్లో తన బలం పెంచుకుంటూ వస్తోంది. పంచాయతీ ఎన్నికలు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని, టీడీపీని ఓడించి జనసేన తన జెండాను ఎగురవేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండలంలో స్థానిక ఎంపీ మార్గాని భరత్ రామ్ దత్తత తీసుకున్న గ్రామంలోనూ జనసేన గెలిచింది. ఆ ఎన్నికలు ముగిసిన తరువాత జనసేన పార్టీ గోదావరి జిల్లాలో మరింత బలంగా ముందుకు వెళుతోంది. పలుచోట్ల గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకొని నియోజకవర్గ ఇంచార్జిలను నియమించుకుని ప్రతిరోజు ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి జైలుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అనంతరం బయటకు వచ్చి టీడీపీతో పొత్తుపై బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజమండ్రిలోనే లోకేష్‌తో కలిసి ఉమ్మడి కార్యాచరణ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ స్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తలు నాయకులు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి రెండు పార్టీలు కలిసి గ్రామస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ రకంగా కలిసికట్టుగా ముందుకు వెళితే 2024 అధికార పీఠం కూటమిదే అని చెప్పడంలో సందేహం లేదన్న భావనలో ఉన్నారు ఇరు పార్టీల నేతలు.

ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఇంచార్జిల పేరుతో ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు ఎవరో కొంతవరకు స్పష్టత వచ్చింది. అయితే టీడీపీ, జనసేన పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలకుగాను ఏడు నుంచి తొమ్మిది స్థానాలను ఆశిస్తున్నట్లుగా సమాచారం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరిలోని 3 ఎంపీ స్థానాల్లో ఒక లోక్ సీటు ఇవ్వాలన్నది జనసేన డిమాండ్‌ అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించుకున్న స్థానాలను తిరిగి జనసేనకే ఇవ్వాలని డిమాండ్ ఆ పార్టీ నేతలు.

రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, పిఠాపురం నుంచి ఉదయ శ్రీనివాస్, రాజోలు నుంచి డిఎంఆర్ శేఖర్, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, అమలాపురం నుంచి శెట్టిబత్తుల రాజబాబు, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, పి.గన్నవరం నుంచి బొంతు రాజేశ్వరరావు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ ఎంపీ స్థానం నుంచి తోట శేఖర్ లేదా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఏదేమైనా తమ ఆయువు పట్టుగా ఉన్న గోదావరి జిల్లాల్లో తన జెండా ఎగురవేసి సత్తాచాటాలని చూస్తున్నారు జనసైనికులు. దీనికి టీడీపీ కూడా అడ్డు చెప్పే అవకాశాలు లేవని తెలుస్తోంది.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×