EPAPER

LOK SABHA Elections :  ఢిల్లీ పీఠం కోసం కాంగ్రెస్! సౌత్ ఇండియానే టార్గెటా..?

LOK SABHA Elections :  ఢిల్లీ పీఠం కోసం కాంగ్రెస్! సౌత్ ఇండియానే టార్గెటా..?
political news telugu

LOK SABHA Elections news(Political news telugu):

రూట్ మార్చి గేర్ పెంచాలని హస్తం హైకమాండ్ డిసైడ్ అయింది. సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లోనే రానుండడంతో పరిస్థితిని మార్చేసింది. విజయానికి కొత్త దారులు ఏమున్నాయో వెతుకుతోంది. సౌత్ తో పాటే నార్త్, ఈస్ట్, వెస్ట్ లోనూ సత్తా చాటి మళ్లీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తోంది.


2004 నుంచి 2014 వరకు యూపీఏ అధికారంలో ఉంది. ఆ తర్వాత రెండు టర్మ్ లు మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టింది. చెరో పదేళ్ల పాలన ముగిసింది. ఇప్పుడే అసలు సిసలైన యుద్ధం ఉండబోతోందంటున్నారు. ప్రస్తుత ఎన్డీఏ సర్కారుపై పదేళ్ల వ్యతిరేకత ఎంతో కొంత ఉండడం సహజమే. అయితే దీన్ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్లాలని హస్తం పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు. ఎక్కడ కోల్పోయారో.. అక్కడి నుంచే మొదలు పెట్టాలనుకుంటున్నారు. కచ్చితంగా గెలవాలంటే ఏం మార్పులు జరగాలి… జనం మైండ్ సెట్ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి.. పాజిటివ్ సిగ్నల్స్ ఎలా పంపాలి… దేశం మూడ్ ఎలా మార్చాలి.. ఇవే లెక్కలను వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

గెలుపు అవకాశాలను మెరుగు పరుచుకోవడం కాదు.. పక్కాగా గెలవాల్సిందే ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం. సౌత్ ఇండియాతో పాటే నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ ఎక్కడైనా సరే హస్తం జెండా ఎగరాల్సిందే అన్నట్లుగా ప్రణాళికలు నడుస్తున్నాయి. బలమైన పక్షాన్ని ఢీకొట్టాలంటే అంతకు రెట్టింపు బలాన్ని సంపాదించుకోవాలి. అందుకే యూపీఏను ఇండియా కూటమిగా మార్చేశారు. తగ్గాల్సిన చోట తగ్గారు. పొత్తులు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులతో ముందుకెళ్లడం, అవసరమైతే సీట్లు త్యాగం చేయడానికీ వెనుకాడడం లేదు హస్తం పార్టీ.


ప్రస్తుతం 543 సీట్లలో ఎన్డీఏకు 323 సీట్లు ఉంటే.. ఇండియా కూటమి పార్టీలకు 138 సీట్లు ఉన్నాయి. మిగితా 61 సీట్లు తటస్థ పార్టీల చేతిలో ఉన్నాయి. అంటే అధికారానికి మరీ ఏమంత దూరం లేదు. ఐదేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు విపక్ష పార్టీల హోరు జోరు పెరిగాయి. అదే సమయంలో సీట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు గెలిచేలా కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ చేస్తోంది. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ లోక్ సభ సీట్లు ఉన్నది మహారాష్ట్రలోనే. ఇక్కడ మొత్తం 48 ఎంపీ సీట్లు ఉన్నాయి. గతంలో మహారాష్ట్రలో మంచి ఫాం చూపిన కాంగ్రెస్ గత పదేళ్ల నుంచి పట్టు కోల్పోయింది. అయితే పూర్వవైభవాన్ని సాధించే పట్టుదలతో నాగ్ పూర్ లో ఆవిర్భావ ర్యాలీ గ్రాండ్ గా నిర్వహించేందుకు డిసైడ్ అయింది.

లోక్ సభ ఎన్నికలకు 3 నెలలే టైం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం ఉత్సాహం నింపేలా నాగ్ పూర్ లో గ్రాండ్ ర్యాలీ చేపట్టబోతున్నారు. అక్కడ 20 లక్షల మందితో భారీ ర్యాలీ చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఖర్గే, సోనియా రాహుల్, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ఈ సభా వేదికగా ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా మొదలు పెట్టబోతోంది హస్తం పార్టీ. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఓడినా… రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని కేసీ వేణుగోపాల్.. ఆయా రాష్ట్రాల నేతల్లో ఇప్పటికే ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారని గుర్తు చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీని ఎదుర్కొనేందుకు మై నహీ, హమ్‌ అంటే నేను కాదు మేము అనే స్లోగన్ తో ముందుకు ఇండియా కూటమి పార్టీలు సాగాలని నిర్ణయించాయి. పార్టీల మధ్య సీట్ల పంపకం, ఉమ్మడి ఎన్నికల ర్యాలీలు, కార్యక్రమాల రూపకల్పన వంటి వాటిపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కుల గణన, MSPకి చట్టపరమైన హామీ, కార్మికులకు సామాజిక భద్రత వంటి అంశాలను ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్నికల ప్రచారంలో ముందుకు తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యాయి. అంతే కాదు గత 10 ఏళ్ల ప్రధాని మోడీ పాలనకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ పాలనలో సామాన్యుడి జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చిందనే అంశాలను హెలైట్ చేయాలని నిర్ణయించారు.

ఇటీవలే భేటీ అయిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ చాలా కీలక అంశాలపై చర్చించారు. ప్రతి ఎన్నికనూ తుది సమరంలా భావిస్తూ బీజేపీ పోరాడుతోందని, ఈ విషయాన్ని గ్రహించి మరింత టైట్ ఫైట్ కు రెడీ అవ్వాలనుకుంటున్నారు హస్తం నేతలు. మరోవైపు సోనియాగాంధీ ఈసారి సౌత్ నుంచే పోటీ చేస్తారన్న టాక్ కూడా పెరుగుతోంది. తెలంగాణ నుంచే పోటీ చేయాలని ఇటీవలే రాష్ట్ర పీసీసీ తీర్మానం కూడా చేసి పంపింది. గతంలో ఇందిరాగాంధీ మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసిన సందర్భం ఉంది. సోనియాగాంధీ ఒప్పుకుంటే ఇప్పుడు సంచలన విజయం నమోదవుతుందంటున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలవొచ్చని, అదే సమయంలో పక్కనే ఉన్న కర్ణాటకలోనూ భారీగా సీట్లు రాబట్టొచ్చన్న ఆలోచనతో ఉన్నారు.

.

.

Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×